కేజ్రీవాల్పై ఆప్ మాజీనేత షాజియా పోటీ?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఫిరాయింపుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆప్ నాయకురాలు షాజియా ఇల్మి భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ టిక్కెట్టు ఇవ్వడంతో 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాజియా పోటీచేశారు. కాగా నేడు రూటు మార్చిన ఆమె బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. న్యూఢిల్లీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడమే కాదు.. స్వయంగా కేజ్రీవాల్ మీదే పోటీకి దిగుతారని కూడా చెబుతున్నారు.
ఆమె అంతకుముందు స్టార్న్యూస్ చానల్లో పాత్రికేయ వృత్తిలో ఉండేవారు. సామాజిక కార్యకర్తగా కూడా పేరొందారు. గత రెండు వారాల నుంచి బీజీపీలో చేరనున్న ఆరో వ్యక్తి ఆమె. న్యూఢిల్లీ పార్టీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఇల్మి పేరును ప్రకటించడం చూస్తే బీజేపీకి ఇది రాజకీయంగా కలిసొచ్చే అంశం అవుతుంది.