new divisions
-
రాజస్తాన్‌లో 19 కొత్త జిల్లాలు
జైపూర్: రాజస్తాన్‌లో కొత్తగా 19 జిల్లాలను, మూడు డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 50కి చేరనుంది. 2008 తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇదే తొలిసారి. కొత్త జిల్లాల్లో అత్యధికంగా జైపూర్‌లో నాలుగు జిల్లాలు, జోథ్‌పూర్‌లో మూడు ఏర్పాటు కానున్నట్టు గహ్లోత్ వెల్లడించారు. కొత్త జిల్లాలు, డివిజన్లలో మౌలిక వసతులు, మానవ వనరుల కల్పనకు బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించామన్నారు. విస్తీర్ణపరంగా దేశంలో రాజస్తాన్ అతిపెద్ద రాష్ట్రమన్న విషయం తెలిసిందే. -
కొత్త డివిజన్లకు ఆర్డీవోల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 47 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యుటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలుగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 21 కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోల నియామకం కోసం పలువురిని బదిలీ చేశారు. కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్లలో సోమవారం నుంచి పరిపాలన ప్రారంభం కానుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జేసీ (ఆసరా–సంక్షేమం)గా పని చేస్తున్న కె. శ్రీరాములు నాయుడును సహకార శాఖ (సొంత శాఖ)కు బదిలీ చేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా జేసీ (ఆసరా–సంక్షేమం)గా పనిచేస్తున్న ఎం.కె.వి. శ్రీనివాసులును వ్యవసాయ, సహకార శాఖ (సొంత శాఖ)కు బదిలీ చేశారు. ఆర్డీవోల బదిలీలు ఇలా ఉన్నాయి. -
తెరపైకి కొత్త డివిజన్
ఇచ్చోడ(బోథ్): ఇచ్చోడ కేంద్రంగా రెవెన్యూ డివిజన్ చేయాలనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూర్ రెండు డివిజన్లు మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లో బోథ్ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలు, ఆదిలాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఉన్నాయి. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లో 13 మండలాలు ఉండడంతో పని భారంతోపాటు బోథ్‌లోని మండలాల ప్రజలకు దూరభారం కూడా అవుతోంది. కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడే ఇచ్చోడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపించింది. కాని కొన్ని కారణాలతో తెలంగాణాలో కొత్తగా డివిజన్ ఏర్పాటు కాలేదు. సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మరికొన్ని కొత్త మండలాతోపాటు అవసరం ఉన్న చోట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కొత్త రెవెన్యూ డివిజన్ల అంశం తెరపైకి వచ్చింది. అయితే అన్నిసౌకర్యాలు ఉన్న ఇచ్చోడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డివిజన్ ఏర్పాటు చేయాలని తీర్మానం.. ఇచ్చోడ మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పా టు చేయాలని ఇటీవల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. యువజన సంఘాల ఆధ్వర్యంలోనూ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు కూడా అందిస్తున్నారు. ఇప్పటికే పలు యువజన సంఘాలతోపాటుగా రాజకీయ పార్టీలు కూడా ఇచ్చోడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని తీర్మానాలు చేస్తున్నాయి. ఇచ్చోడ ఏర్పాటుతో తగ్గనున్న దూర భారం ఇచ్చోడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తే చుట్టు పక్కల మండలాలకు దూర భారం తగ్గనుంది. కొత్తగా ఏర్పాటు అయిన సిరికొండ మండలం ఇచ్చోడకు కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో పక్కనున్న బజార్హత్నూర్ మండలం కూడా ఇచ్చోడకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిహత్నూర్, నేరడిగొండ మండలాలు కూడా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బోథ్ మండలానికి ఇచ్చోడ మండలానికి 25 కిలో మీటర్లు దూరం ఉంటుంది. ఇచ్చోడ మండలానికి ఐదు మండలాలు పది నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉండడంతోపాటు జాతీయ రహదారిపై ఉండడం అన్ని మండలాలకు సెంటర్ పాయింట్ ఇచ్చోడ కావడంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సమీప మండలాల ప్రజలు సుముఖంగా ఉన్నారు. దీంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వాదన తెరపైకి వస్తోంది. కొత్త డివిజన్లపై ప్రభుత్వ కసరత్తు... సీఎం కేసీఆర్ ఆదేశాలతో కొత్తగా డివిజన్ల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజనతో ఆదిలాబాద్‌లో రెవెన్యూ డివిజన్ ఒక్కటే కావడంతో అటు అధికారులకు, ఇటు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొత్తగా డివిజన్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాలన సౌలభ్యంతోపాటు దూరంభారం తగ్గి ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇచ్చోడ, సిరికొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, నేరడిగొండ, బోథ్ ఆరు మండలాల కలిపి ఇచ్చోడ రెవెన్యూ ఏర్పాటు కానుంది. -
ముసాయిదా నేడు విడుదల
{పజల ముందుకు కొత్త డివిజన్లు సిద్ధమైన ముసాయిదా జాబితా అభ్యంతరాలకు వారం గడువు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో కీలకఅంకానికి బుధవారం తెర లేవనుంది. వార్డులు/డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన ముసాయిదా జాబితాను నేడు విడుదల చేయనున్నారు. దీన్ని ప్రజల ముందుంచి... వారి అభ్యంతరాలు స్వీకరించేందుకు వారం రోజుల గడువునిస్తారు. డీలిమిటేషన్‌పై దాదాపు ఆరు నెలలుగా కసరత్తు సాగుతుండడం... ఈ నేపథ్యంలో వివిధ పరిణామాలు చోటు చేసుకోవడం తెలిసిందే. వార్డుల మధ్య సమతుల్యత కోసం 2011 జనాభా లెక్కల మేరకు సమాన జనాభా ఉండేలా డివిజన్లను రూపొందించాలనుకున్నారు. తొలుత 172 డివిజన్లు ఏర్పాటు కాగలవని భావించారు. అనంతరం 200 డివిజన్లకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ తరువాత సహజ సరిహద్దులు.. ఇతరత్రా ఇబ్బందుల దృష్ట్యా ఇది సాధ్యం కాదని కమిషనర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో 150 డివిజన్లనే కొనసాగించాలని నిర్ణయించారు. అన్ని డివిజన్లలో జనాభా దాదాపు సమానంగా ఉండేలా చూసేందుకు అధికారులు తిరిగి కసరత్తు చేపట్టారు. 150 సంఖ్యలో మార్పు లేనప్పటికీ.. కొన్ని సర్కిళ్లలో డివిజన్లు పెరగనున్నాయి. కొన్ని సర్కిళ్లలో తగ్గనున్నాయి. ముసాయిదా జాబితాను బుధవారం విడుదల చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మంగళవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. సంఖ్యలో మార్పు లేనప్పటికీ.. జనాభాకు అనుగుణంగా కొత్త డివిజన్లు ఉంటాయన్నారు. ప్రజలు, రాజకీయ పక్షాలు, వివిధ వర్గాల నుంచి అందే విజ్ఞప్తులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైతే ముసాయిదాలో మార్పుచేర్పులు చేస్తామని చెప్పారు. కొత్తగా వచ్చే డివిజన్లలో చిలుకానగర్, భారతీనగర్, అల్లాపూర్ వంటివి ఉన్నాయి. ఒక్కో డివిజన్‌కు సగటున 40 వేల నుంచి 47 వేల జనాభా ఉండే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగా ఏర్పాటు కానున్న డివిజన్లు సర్కిళ్ల వారీగా ఇలా ఉన్నాయి. వీటిలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంది.