New England
-
అమెరికా విప్లవం ముందునాటిది.. అదిరిపోయే ధర పలికింది
17వ శతాబ్దంనాటి అత్యంత అరుదైన వెండి నాణెం అది. అందులోనూ అమెరికా విప్లవానికి ముందునాటిది. మరీ ముఖ్యంగా అమెరికాలోనే తయారైంది. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు(యూఎస్ఏ)గా అమెరికా ప్రాంతం ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించకముందునాటిది. ప్రపంచంలో ఇలాంటిది ఇంకొక్కటి మాత్రమే ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఆ చిన్ని నాణెం ఏకంగా రూ.21.28 కోట్ల ధర పలికిందని స్టేక్స్ బోవర్స్ గ్యాలరీస్ వేలం సంస్థ ప్రకటించింది. తయారుచేసినపుడు దీని ముఖ విలువ మూడు పెన్నీలు మాత్రమే. బోస్టన్ మింట్ ప్రారంభించిన కొద్ది వారాలకే 1652వ సంవత్సరంలో దీనిని ముద్రించారు. నాణేనికి ఒకవైపు న్యూ ఇంగ్లండ్(ఎన్ఈ) అన్న రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు రోమన్ అంకెల్లో మూడు అని రాసి ఉంది. న్యూ ఇంగ్లండ్ ప్రభ పెరుగుతోందని తెలియజేసేందుకు గుర్తుగా మొదట్లో కొన్నింటిని మాత్రమే ఇలా వెండితో ముద్రించారు. ప్రస్తుత మార్కెట్లో నికెల్, వెండి విలువల్లో లెక్కిస్తే దీని ధర కేవలం 1.03 అమెరికన్ డాలర్లు. కానీ అమెరికా స్వాతంత్య్రం ముందునాటిది కావడం, చారిత్రక విశేషాలుండటంతో దీనికి ఎక్కడా లేనంతటి విలువ వచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం వెలుగుచూసి.. నెదర్లాండ్స్‌లో 2016లో ఒక పేస్ట్బోర్డ్ పెట్టెలో దీనిని కనుగొన్నారు. దీంతోపాటు ఒక కవర్ ఉంది. దానిపై ‘1798 డిసెంబర్లో క్విన్సీ కుటుంబానికి బోస్టన్ మింట్ నుంచి వచ్చిన సిల్వర్ టోకెన్ ఇది’అని మాత్రమే రాసి ఉంది. అయితే దీని విలువ తెలియని ఆ యజమాని దీని గురించి పట్టించుకోవడం మానేశారట. అయితే అరుదైన నాణెం వార్త అందరి నోటా పడి చివరకు దీని మూలాల గుట్టు తెల్సుకునే పని మొదలైంది. అరుదైన నాణేల ప్రమాణాలను నిర్ధారించే స్వతంత్ర ‘పీసీజీఎస్’విభాగం రంగంలోకి దిగి దీని విశిష్టతను ప్రపంచానికి తెలిసేలా చేసింది. అయితే గతంలోనూ ఇలాంటి ప్రయత్నం జరిగిందన్న విషయం పీసీజీఎస్ పరిశోధనలో వెల్లడైంది. ఇంగ్లండ్‌కు చెందిన నాణేలను సేకరించే థామస్ బ్రాండ్ అనే పెద్దాయన 1781లో నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారి జాన్ ఆడమ్స్కు ఒక లేఖ రాశారు. ఆడమ్స్ భార్య ఎబిగేల్కు ఈ నాణేనికి ఒక సంబంధం ఉండటమే ఇందుకు కారణం. ఈ నాణేన్ని ముద్రించిన స్వర్ణకారుడు జాన్ హల్కు సవతి సోదరుడి ముని మనవరాలే ఈ ఎబిగేల్. ఇలా ఈ నాణెం ఎప్పుడు ఎక్కడ ముద్రించబడిందనే వివరాలు తెలిశాయి. ఇలాంటి మరో నాణెం గతంలో ఉండేదని మసాచుసెట్స్ హిస్టారికల్ సొసైటీ పేర్కొంది. గతంలో అమెరికాలోని యేల్ కళాశాలలో ప్రదర్శనకు ఉంచగా చోరీకి గురైంది. ఇప్పుడు అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. ‘‘నాణెం వేలం మొదలెట్టిన కేవలం 12 నిమిషాల్లోనే ఊహించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది’అని వేలంపాట నిర్వహకుడు బెన్ ఒరోజీ చెప్పారు. గతంలోనూ కొన్ని అమెరికా నాణేలు రికార్డ్ ధరలకు అమ్ముడుపోయాయి. 2013లో 1794నాటి వెండి డాలర్ నాణెం ఒక కోటి డాలర్లకు అమ్ముడుపోయింది. 1933లో ముద్రించిన డబుల్ ఈగిల్ బంగారు నాణెం మూడేళ్ల క్రితం ఒక వేలంపాటలో 1.89 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టెక్నాలజీ ఎక్కడికి దారితీస్తుందో గానీ, మున్ముందు వైద్యమంతా ఏఐ మయమే!
మనిషి మెదడు, కృత్రిమ మేధ రెండింట్లో ఏది గొప్ప అన్న చర్చ ఇప్పటిది కాదు. ఏఐ చాట్బాట్ల రాకతో ఇది మరింత ఊపందుకుంది. ఏఐ వల్ల ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావనేది ఒక వాదన. దీనివల ఉద్యోగావకాశాలు తగ్గిపోవడమే గాక తప్పుడు సమాచారం మొదలుకుని ప్రాణహాని దాకా ఎన్నో సమస్యలు తలెత్తవచ్చనే వాదన మరొకటి. వెనకాముందూ చూసుకోని పక్షంలో అంతిమంగా కృత్రిమ మేధ మానవాళిని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుంటుందని భయపడేవాళ్లూ ఉన్నారు. ఈ చర్చోపచర్చలతో నిమిత్తం లేకుండా ఏఐ ఇప్పటికే మన జీవితాల్లోకి పూర్తిగా చొచ్చుకొస్తోంది. కీలకమైన ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ వాడకం నానాటికీ పెరిగిపోతోంది. మున్ముందు దీని పరిణామాలెలా ఉంటాయన్నది ఆసక్తికరం... ఇప్పటికే వినియోగంలో... ఏ కంప్యూటరో, మరోటో తనకిచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకొని, పూర్తిగా విశ్లేషించి అచ్చం మనిషి మాదిరిగా ప్రతిస్పందించగలగడమే కృత్రిమ మేధ అని చెప్పుకోవచ్చు. అలా చూస్తే ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ వాడకం ఈనాటిది కాదు. గుండె పరీక్షల్లో మొదటిదైన ఈసీజీ మొదలుకుని అల్ట్రా సౌండ్, ఎకో కార్డియోగ్రఫీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరికరాల్లో ఏఐ వాడకం ఏళ్లుగా ఉన్నదే. వీటిల్లో మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి రిపోర్టు జనరేట్ చేసేది ఏఐ సాయంతోనే. కంటిలోని రెటీనా ఫొటోలను చూసి సమస్యను పసిగట్టడంలో ఏఐ ఇప్పటికే కంటి డాక్టర్లతో పోటీపడుతోంది. రొమ్ము క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించడంలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. యాంజియోగ్రాం తదితర అతి సంక్లిష్టమైన వైద్య వీడియోలను కూడా సమగ్రంగా చక్కని చికిత్స మార్గాలను సూచించే దిశగా దూసుకుపోతోంది ఏఐ! మెదడులోని న్యూరాన్ల ఆధారంగా కనిపెట్టిన డీప్ లెర్నింగ్ కాన్సెప్టు ఏఐలో అత్యంత కీలకం. ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకోవడంతో సరిపెట్టకుండా తన దగ్గర అప్పటికే ఉన్న సమాచారంతో క్రోడీకరించి, విశ్లేషించి, మరింత మెరుగైన, సమగ్రమైన ఫలితాలు వెల్లడించడం దీని ప్రత్యేకత. ఎన్నో ఉపయోగాలు... ► వైద్యులు–రోగి సంభాషణను, పరీక్ష ఫలితాలను బట్టి కచ్చితమైన రోగ నిర్ధారణ చాట్ జీసీటీ ఫోర్ వంటి చాట్బాట్లతో ఇప్పటికే సాధ్యపడుతోంది. ► మెడికల్ రికార్డుల నిర్వహణలో ఏఐ బాగా ఉపయోగపడనుంది. తద్వారా డాక్టర్లకు ఎంతో సమయం ఆదా చేయడమేగాక రోగి సమాచారాన్నంతా లోతుగా విశ్లేషించి సమగ్రమైన డిశ్చార్జ్ సమ్మరీని అలవోకగా అందిస్తుంది. ► డిశ్చార్జ్ సమయంలో ఇచ్చే ట్రీట్మెంట్ చార్ట్‌లోని మందులను గుర్తించి, వాటి సైడ్ ఎఫెక్టులు తదితరాలను రోగికి స్పష్టంగా చెబుతుంది. డ్రగ్స్ తాలూకు నెగెటివ్ ఇంటరాక్షన్‌పై అలర్ట్ చేయగలుగుతుంది. ► ఇన్సూరెన్స్ పేపర్లను సరిగా విశ్లేషించి క్లెయిం సులువుగా, త్వరగా జరిగేలా చూస్తుంది. మెడికల్ డిసీజ్ కోడింగ్‌లోనూ బాగా ఉపయోగపడుతుంది. ► వైద్య విద్యలోనైతే ఏఐ విప్లవాన్నే తేనుంది! సంక్లిష్టమైన అంశాలను బొమ్మలు, టేబుల్స్లా, చార్టుల రూపంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పటంలో, మెడికల్ రీసర్చ్‌లో కీలక పాత్ర పోషించనుంది. ► రోబోటిక్ పరికరాలతో మమేకమై సంక్లిష్టమైన ఆపరేషన్లలో వైద్యులకు సహకరించనుంది. ► కోవిడ్ వంటి మహమ్మారులను ముందుగానే గుర్తించడంలోనూ ఏఐ ఉపయోగపడొచ్చు. ► టెలీ మెడిసిన్‌నూ ఏఐ కొత్త పుంతలు తొక్కించగలదు. రోగి ఆస్పత్రికి వచ్చే పని లేకుండానే సమస్య గుర్తింపు, వైద్యం, పర్యవేక్షణ జరిగిపోతాయి. ► కొత్త మందులను కనిపెట్టడం మొదలుకుని జన్యు అధ్యయనం ద్వారా ప్రతి వ్యక్తికీ పర్సనలైజ్డ్ మెడిసిన్ సూచించగలదు. సమస్యలూ తక్కువేమీ కాదు... ► ఆరోగ్య సమాచారం తాలూకు గోప్యత చాలా కీలకం. ఏఐతో దీనికి చాలా ముప్పుంటుంది. ► ఏఐ సలహాలు అన్నివేళలా కరెక్టుగా కాకపోవచ్చు. కొన్ని రకాల వైద్య సలహాలివ్వడంలో చాట్‌జీపీటీ వంటివి చిత్త భ్రాంతికి గురైనట్టు ఇప్పటికే తేలింది. అలాగని వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి వస్తే వైద్యులకు అదో అదనపు బరువుగా మారొచ్చు. ► డ్యూటీ డాక్టర్ల పనులను ఏఐ ఇప్పటికే చేసేస్తోంది. కనుక మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి హెచ్చు నైపు ణ్యం అక్కర్లేని ఉపాధి అవకాశాలకైతే ఏఐ సమీప భవిష్యత్తులోనే పూర్తిగా గండి కొట్టవచ్చు. ► ప్రజారోగ్యానికి సంబంధించిన విధాన నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేస్తే వాటిలో వ్యక్తి స్వేచ్ఛ వంటివాటికి ప్రాధాన్యం లేకుండా పోవచ్చు. చివరగా... ఆరోగ్య రంగంపై ఏఐ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ప్రఖ్యాత న్యూ ఇంగ్లండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ ఓ కొత్త జర్నల్నే ప్రారంభించనుంది. ఇరువైపులా పదునున్న కత్తి వంటి ఏఐని విచక్షణతో వాడుకోవాల్సిన బాధ్యత మాత్రం అంతిమంగా మనదే. -
ఈ సబ్బుతో పిశాచాల పీడ విరగడ!
ఆరోగ్యానికి రక్షణ ఇచ్చే సబ్బుల గురించి మనకు తెలుసు. సూక్ష్మక్రిములను దూరం చేసే సబ్బులు, సుగంధాలను వెదజల్లే సబ్బుల గురించి తెలుసు. చర్మసౌందర్యాన్ని ఇనుమడింపజేసి యవ్వనకాంతితో మెరిపించే సబ్బుల గురించి కూడా తెలుసు. ఇలాంటి సబ్బులను తరతరాలుగా చూస్తూనే ఉన్నాం. ‘ఇలాంటివి ఎవరైనా తయారు చేస్తారు. వీటిలో వెరైటీ ఏముంది? మా కంపెనీ తయారు చేసే సబ్బును వాడితేనా... ఎంతటి పిశాచాలైనా పరారు కావాల్సిందే’ అంటోంది ఓ అమెరికన్ కంపెనీ. న్యూ ఇంగ్లండ్ రాష్ట్రంలోని వెర్మంట్కు చెందిన ఈ కంపెనీ ఇటీవల కొత్త తరహా సబ్బును మార్కెట్లోకి తెచ్చింది. వెల్లుల్లి తైలం, పవిత్రజలం ఉపయోగించి తయారు చేసిన ఈ సబ్బు శాకినీ, ఢాకినీ, డ్రాకులా వంటి సమస్త భూతప్రేత పిశాచాదులను దూరంగా ఉంచగలదని నమ్మకంగా చెబుతోంది. రుద్దుకుంటే పోయేదేముంది ఒంటి మీద మురికి తప్ప అనుకునే వారు, దీని పనితీరును ప్రాక్టికల్‌గా చూడాలని ఉబలాటపడేవారు ఎగబడి మరీ ఆన్లైన్లో ఈ సబ్బును తెగ కొంటున్నారు. దీని ధర ఎంతో కాదు, పట్టుమని పది డాలర్లు (రూ.656) మాత్రమే.