new futures
-
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అగంతకుల నుంచి వచ్చే కాల్స్ నుంచి యూజర్లను కాపాడేలా ఐపీ అడ్రస్‌ను ఈ ఫీచర్ సురక్షితంగా ఉంచనుంది. వాట్సాప్‌కు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందించే వాబీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ను గుర్తించింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సప్‌లో ఎబుల్, డిసేబుల్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవడం ద్వారా యూజర్ల ఐపీ అడ్రస్‌లకు రక్షణ కవచంలా ఉంటుంది. నివేదిక ప్రకారం.. యూజర్లు వాట్సప్‌లో వాయిస్స్ కాల్స్, వీడియో కాల్స్ చేసే సమయంలో సురక్షితంగా ఉండేలా ప్రైవసీ సెట్టింగ్ స్క్రీన్‌లో అడ్వాన్డ్స్ అనే సెక్షన్లో ‘ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్’ ఎనేబుల్ చేసుకోవాలి. తద్వారా, ఇతరులు మీరు కాల్స్ మాట్లాడే సమయంలో మీరు ఎక్కడ నుంచి ఫోన్ మాట్లాడుతున్నారు. ఐపీ అడ్రస్ ఏంటనేది తెలుసుకునే అవకాశం ఉండదు. ఫిల్టరింగ్ ఫర్ చానెల్ ఛానెల్ అప్డేట్ల కోసం రియాక్షన్లను ఫిల్టర్ చేసేలా వాట్సప్ మరో ఫీచర్‌ను విడుదల చేయనుంది. కాంటాక్ట్‌లలో ఎవరైనా ఎమోజీని ఉపయోగించి కంటెంట్‌కి ప్రతిస్పందించినట్లయితే వెంటనే గుర్తించడానికి ఛానెల్ యజమానులకు ఇది సహాయపడుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని వాబీటా నివేదించింది. -
హమ్మయ్యా..వాట్సాప్‌లో ఇక ఆ సమస్య లేనట్లే!
ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ వాట్సాప్ యూజర్లకు శుభవార్త. యూజర్ల సౌలభ్యం కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్లు, ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటికే ఉన్న 'డిలీట్ ఫర్ ఎవరివన్' ఆప్షన్‌ను ఆప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాట్సాప్ బ్లాగ్ వీ బీటా ఇన్ఫో ప్రకారం..యూజర్లు సెండ్ చేసిన మెసేజ్‌లలో ఏదైనా మిస్టేక్ ఉంటే డిలీట్ చేసే సదుపాయం ఉంది.అయితే పొరపాటు ఉన్న ఆ మెసేజ్‌లను టైంకి డిలీట్ చేయకపోతే ఎన్ని అనార్ధాలు జరుగుతాయో మనకు తెలియంది కాదు. ఆ సమస్యకు పరిష్కార మార్గంగా వాట్సాప్ 2017లో డిలీట్ ఫర్ ఎవిరివన్ ఆప్షన్‌ను యూజర్లకు పరిచయం చేసింది. 📝 WhatsApp beta for Android 2.22.15.8: what's new? WhatsApp is updating the time limit to delete messages for everyone, for some beta testers!https://t.co/4EmyZfdkFI — WABetaInfo (@WABetaInfo) June 30, 2022 ఇక ఆ సమస్య తీరినట్లే పొరపాటున మీ వాట్సాప్‌లో మీ కుటుంబ సభ్యులకు,స్నేహితులకు పంపిన మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలు పంపితే.. వాటిని డిలీట్ చేసే టైం 1గంట,8 నిమిషాల,16 సెకన్లలోపు ఎప్పుడైనా డిలీట్ చేయోచ్చు. ఆ తర్వాత వాటిని డిలీట్ చేయాలన్నా సాధ్యపడేది కాదు. అందుకే ఆ టైం ఫ్రేమ్‌ను పొడిగిస్తూ డిలీట్ ఫర్ ఎవరివన్ ఆప్షన్‌ను అప్డేట్ చేసింది. ఈ అప్డేట్ ప్రకారం.. మిస్టేక్ ఉన్న మెసేజ్‌లను డిలీట్ చేసేందుకు 2రోజుల 12గంటల సమయం వరకు పొడిగించింది. ప్రస్తుతం ఈ ఆప్షన్ టెస్టింగ్ దశలో ఉండగా.. త్వరలో అందరికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు వీ బీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పేర్కొంది. -
వాట్సాప్‌లో స్టార్ మెసేజీలు
ఈరోజు వాట్సప్ వాడారా? ఏదైనా తేడాగా అనిపించిందా? ఒకే సస్పెన్స్ ఎందుకుగానీ విషయం ఇదీ... వాట్సప్‌లో కొన్ని కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టారు. వీటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది స్టార్ మెసేజ్‌ల గురించి. ఇటీవలే విడుదలైన వాట్సప్ 2.12.367 వెర్షన్లో ఈ కొత్త ఫీచర్ వచ్చి చేరింది. వాట్సప్ సందేశాల్లో మనకు కావాల్సిన వాటిని వెంటనే చూసుకునేందుకు వీలుగా దానిపై స్టార్ గుర్తు పెట్టుకునే అవకాశం కల్పించారు. వాట్సప్‌లోని ఆప్షన్స్ సెక్షన్లో ఉంటుంది ఈ ఫీచర్. ఏ సందేశాన్నైనా కొద్దిసేపు నొక్కి పట్టుకుంటే స్క్రీన్ పై భాగంలో స్టార్ గుర్తు కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే ఆ సందేశం ప్రత్యేకమైందిగా సేవ్ అవుతుంది. ఒకే సందేశాన్ని పలుమార్లు పంపేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక రెండో కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ డెరైక్ట్ షేర్‌తో పనిచేయగలగడం. ఇది మార్ష్‌మెల్లో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఏవైనా లింక్‌లను వాట్సప్ ద్వారా షేర్ చేసుకోవడం దీని ద్వారా సులువు అవుతుంది. దీంతోపాటు మనం షేర్ చేసుకునే లింక్‌ల రిచ్ ప్రీవ్యూను కూడా ఒక ఫీచర్‌గా పరిచయం చేశారు.