new machine
-
సత్యదేవుడి ప్రసాదం ముప్పావుగంటలో సిద్ధం
అన్నవరం: సత్యదేవుని గోధుమ నూక ప్రసాదాన్ని యంత్రాల ద్వారా తయారు చేయడానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ కొత్త భవనంలో మొదలైంది. తొలి కళాయిలో 80 కిలోల ప్రసాదం తయారైంది. స్వామికి నివేదన సమర్పించాక ప్యాకింగ్ సిబ్బంది 150 గ్రాముల చొప్పున విస్తర్లలో ప్యాక్ చేసి, విక్రయ కౌంటర్లకు పంపించారు. మంగళవారం భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుందని, 98 కళాయిల్లో 7,930 కిలోల ప్రసాదం తయారు చేశామని అధికారులు తెలిపారు. ప్రసాదం తయారీ ఇలా.. తొలుత వంద డిగ్రీల సెల్సియస్ వేడినీరు 40 లీటర్లు గొట్టం ద్వారా కళాయిలో పడింది. అందులో 35 కిలోల గోధుమ నూక మరో గొట్టం ద్వారా, ఇంకో గొట్టం ద్వారా రెండు విడతలుగా 30 కిలోల పంచదార పడ్డాయి. ప్రసాదం ఉడికిన తర్వాత ఆరు కిలోల నెయ్యి, 150 గ్రాముల యాలకుల పొడిని సిబ్బంది కలిపారు. కళాయికి ఇరువైపులా ఉన్న చక్రాలను ముందుకు వంచడం ద్వారా ప్రసాదం మరో తొట్టెలో పడింది. ప్యాకింగ్ సమయంలో మరికొంత నెయ్యి కలుపుతామని సిబ్బంది తెలిపారు. ఈ తయారీ ప్రక్రియ 45 నిమిషాల్లో ముగియడం ఆశ్చర్యం కలిగించింది. భవన దాత మట్టే సత్యప్రసాద్ చొరవ తీసుకుని యంత్రాల పనితీరు పర్యవేక్షణకు నలుగురు టెక్నీషియన్లను పంపించారు. దేవస్థానం పీఆర్ఓ కె.కొండలరావు, ఈఈ వి.రామకృష్ణ, ఆలయ ఏఈఓ డీవీఎస్ కృష్ణారావు తదితరులు ప్రసాద తయారీని పరిశీలించారు. యంత్రాలకు సమీపాన ప్యాకింగ్ చేస్తుండడంతో కొంచెం వేడి వస్తోందని సిబ్బంది తెలిపారు. కుకింగ్, ప్యాకింగ్‌ల మధ్యన అడ్డంగా అద్దాలు అమర్చి, అదనంగా ఫ్యాన్లు బిగించేలా చూస్తామని భవన దాత సత్యప్రసాద్ వారికి హామీ ఇచ్చారు. ఆలయ సూపరింటెండెంట్ బలువు సత్యశ్రీనివాస్, ప్రసాదం సూపరింటెండెంట్ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ బండారు వేంకట రమణ తదితరులు ప్రసాదం తయారీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తయారీ సులభం ప్రసాదం తయారీ సులభంగా ఉంది. నలుగురు రెగ్యులర్, నలుగురు ఔట్సోర్సింగ్ సిబ్బంది తయారు చేస్తున్నారు. ఏకకాలంలో 20 కళాయిల ద్వారా కూడా ప్రసాదం తయారు చేయవచ్చు. - పీఎస్‌ఎస్‌వీ ప్రసాదరావు, ప్రసాదం హెడ్ కుక్ ప్యాకింగ్ వేగం ప్రసాదం ప్యాకింగ్ కూడా వేగంగా జరుగుతోంది. తయారీకి, ప్యాకింగ్ చేసే ప్రదేశం దగ్గరగా ఉండడంతో కొంత వేడి వస్తోంది. దీంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. వేడి రాకుండా ఏర్పాట్లు చేయాలి. - వీవీఎస్ కుమార్, సీనియర్ ప్యాకర్ -
బూజు జాడ చెప్పే కొత్త యంత్రం!
సాక్షి, హైదరాబాద్: బూజు పట్టిన ఆహారం తింటే ఏమవుతుంది? పలుమార్లు బాత్రూంకు వెళ్లాల్సి రావడం తాత్కాలిక ప్రతి క్రియ కానీ.. తరచూ తిన్నా.. కాలేయం పాడైపోయి ప్రాణాల మీదకు వస్తుందని సైన్స్ చెబుతోంది. బూజులోని అఫ్లాటాక్సిన్లనే విషరసాయనాల వల్ల కొన్నిసార్లు కేన్సర్ బారిన కూడా పడొచ్చు. బూజు లేని ఆహారాన్ని మాత్రమే తినడం ఈ సమస్యలకు పరిష్కారం. కానీ అఫ్లాటాక్సిన్లను గుర్తించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పరిశోధనశాలల్లో మాత్రమే వీలయ్యే పని. మరి తరుణోపాయం ఏంటంటే.. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్యూర్ స్కాన్ ఎ.ఐ.’అనే స్టార్టప్ పరిశోధనల పుణ్యమా అని అఫ్లాటాక్సిన్లను గుర్తించేందుకు సరికొత్త యంత్రం అందుబాటులోకి వచ్చింది. 5 అంగుళాల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండే ఈ పరికరం అతినీలలోహిత కిరణాల సాయంతో అఫ్లాటాక్సిన్లను గుర్తిస్తుంది. అర నిమిషంలోనే మోతాదును కూడా నిర్ధారిస్తుంది. అఫ్లాటాక్సిన్లు అతినీల లోహిత కిరణాల కాంతిలో ప్రతిదీప్తిని ఇస్తాయి. పరిశీలించాల్సిన ఆహార పదార్థపు ఫొటో లు తీసి వాటిల్లో ప్రతిదీప్తిని ఇస్తున్న ప్రాంతాలను గుర్తించడం.. మెషీన్ లర్నింగ్ పద్ధతుల సాయంతో అఫ్లాటాక్సిన్ల మోతాదును గుర్తించడం ఈ పరికరం పనిచేసే పద్ధతి. తక్కువ ధరకే దొరికే ఈ యంత్రం అత్యంత కచ్చితత్వంతో పని చేస్తుంది కూడా. ఇన్స్పైర్ చాలెంజ్ అవార్డు.. రైతులు, వ్యవసాయం ఎదుర్కొంటు న్న పలు సమస్యలకు బిగ్ డేటా సా యంతో పరిష్కారాలు కనుగొనేందు కు అంతర్జాతీయ మెట్ట ప్రాంత పం టల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్), సీజీఏఐఆర్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ చాలెంజ్ అవార్డుకు ప్యూర్ స్కాన్ ఎ.ఐ. అభివృద్ధి చేసిన యంత్రం ఎంపికైంది. అవార్డులో భాగంగా దాదాపు రూ.73.63 లక్షలు (లక్ష డాలర్లు) నగదు ఈ కంపెనీకి దక్కనుంది. రైతులకు లాభం అఫ్లాటాక్సిన్లను గుర్తించే పరికరం అందుబాటులో ఉంటే రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పంట దిగుబడులు వచ్చాక పలు కారణాల వల్ల వాటిల్లో ఈ అఫ్లాటాక్సిన్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది కాస్తా ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. అఫ్లాటాక్సిన్లను గుర్తించే యంత్రంతో రైతులు విషాలు తక్కువగా ఉన్నవాటిని పొలంలోనే వేరు చేయొచ్చు. దీంతో వారు తమ ఉత్పత్తులకు మెరుగైన ధర పొందొచ్చు. ప్యూర్ స్కాన్ ఎ.ఐ. తయారు చేసిన యంత్రంపై మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఖరీఫ్ నాటికి ఈ యంత్రం అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. – డాక్టర్ శ్రీకాంత్, ఇక్రిశాట్ -
కాలితో తొక్కితే చాలు.. చేతిలోకి శానిటైజర్ చుక్కలు..
సాక్షి, హైదరాబాద్: ఇకపై శానిటైజర్ బాటిల్‌ను చేతితో నొక్కాల్సిన పనిలేదు. కాలితో తొక్కితే చాలు...మీ చేతిలో శానిటైజర్ చుక్కలు పడతాయి. ఇందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రత్యేకంగా మెషిన్ రూపొందించింది. ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ) విద్యార్థుల సాయంతో దీన్ని తయారు చేసింది. చేతితో శానిటైజర్ బాటిల్‌ను పట్టుకోవడంతో వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందనే వాదన ఉంది. ఈ క్రమంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో కొందరు ఐటీఐ విద్యార్థులు ఈ పరికరానికి రూపకల్పన చేశారు. దీన్ని ఇటీవల మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు ఉచితంగా అందించారు. త్వరలో వంద మిషన్లు తయారు చేసి డిమాండ్ ఉన్న సంస్థలకు అందించనున్నట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కె.వై.నాయక్ తెలిపారు. 40వేల మాస్కుల ఉచిత పంపిణీ ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో కుట్టుమిషన్ ట్రేడ్ ఉన్న వాటిల్లో మాస్కుల తయారీకి కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఆదేశించింది.ప్రస్తుతం 15 ప్రభుత్వ ఐటీఐలు, 5 ప్రైవేటు ఐటీఐలలో మాస్కులను తయారు చేస్తున్నారు. ఐసీఎంఆర్, వైద్య,ఆరోగ్య శాఖ సూచనల ఆధారంగా వీటిని రూపొందిస్తున్నారు. మాస్కులు కొనుగోలు చేయలేని కూలీలు, పేదలకు వీటిని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించి.. ఇప్పటివరకు తయారు చేసిన 40వేల మాస్కులను ఉచితంగా పంపిణీ చేసినట్టు ఆ శాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్ తెలిపారు. ఆన్లైన్లో ఐటీఐ శిక్షణ: ఐటీఐల్లోనూ ఆన్లైన్ బోధన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న చైన్నైలోని నేషనల్ ఇన్స్ట్రక్షన్ మీడియా ఇన్స్టిట్యూట్ టీచింగ్ ఫ్యాకల్టీ సాయంతో ప్రస్తుతం 63 ప్రభుత్వ ఐటీఐలు, 13 ప్రైవేటు ఐటీఐలలోని విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుండగా... ఈ వారాంతంలోగా అన్ని ప్రైవేటు ఐటీఐలలోని విద్యార్థులకు ఆన్లైన్ బోధన అందుబాటులోకి రానుంది. -
డీఆర్డీవో శానిటైజర్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై యుద్ధంలో డీఆర్డీవో మరో ముందడుగు వేసింది. వేర్వేరు ఉపరితలాల నుంచి వైరస్‌లను తొలగించేందుకు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో శానిటైజింగ్ యంత్రాలను అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని డీఆర్డీవో సంస్థ ‘ద సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్)’అభివృద్ధి చేసిన ఈ యంత్రాల్లో ఒకటి అవసరమైన చోటుకు మోసుకెళ్లేది కాగా, రెండోది చక్రాలపై ఉంచి తరలించగలిగేది. మంటలు ఆర్పేందుకు పనికొచ్చే యంత్రాలను రీడిజైనింగ్ చేయడం ద్వారా తాము ఈ శానిటైజింగ్ యంత్రాలను అభివృద్ధి చేసినట్లు డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. పోర్టబుల్ యంత్రం ద్వారా ఒక శాతం హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లవచ్చని, బ్యాక్‌ప్యాక్ ద్వారా తీసుకెళ్లగలమని వివరించింది. గాలితోపాటు ద్రావణాన్ని కూడా చేర్చి స్ప్రే చేయడం దీని ప్రత్యేకతని తెలిపింది. ఒక యంత్రం ద్వారా దాదాపు 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో శానిటైజేషన్ చేపట్టవచ్చని పేర్కొంది. చక్రాలపై ఉంచి తరలించగల రెండో యంత్రంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని మాత్రమే పొగమంచు మాదిరిగా మార్చి పిచికారీ చేసేందుకు ఏర్పాట్లు ఉంటాయని తెలిపింది. ఒక్కోటి 3,000 చదరపు మీటర్ల విస్తీర్ణాన్నిశుభ్రం చేయగలదని వివరించింది. 50 లీటర్ల ద్రావణాన్ని నింపుకోగల ట్యాంకు ఇందులో ఉంటుందని.. 12నుంచి 15 మీటర్ల దూరం వరకూ పిచికారీ చేయవచ్చని తెలిపింది. ఢిల్లీ పోలీసులకు ఇప్పటికే ఈ యంత్రాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. -
కలుపు తీసే కొత్త యంత్రం
వ్యవసాయంలో రైతు పెట్టే పెట్టుబడుల్లో కలుపుతీత కూడా ఒకటి. అయితే ఈ కాలంలో కలుపు తీసే వ్యవసాయ కూలీలకు కొరత ఉన్న నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన స్మాల్ రోబోట్ కంపెనీ ఓ సరికొత్త యంత్రాన్ని అభివృద్ధి చేసింది. ఇది పంట చేలలో మొలిచే పిచ్చిమొక్కలను మాత్రమే ఎంచుకుని మరీ కరెంటు షాకిచ్చి చంపేస్తుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇదే కంపెనీ గత ఏడాది వ్యవసాయ పనులను స్వతంత్రంగా చక్కబెట్టే టాం, హ్యారీ పేర్లతో రెండు రోబోలను సిద్ధం చేయడం. టాం తన కెమెరా కన్నులతో కలుపు మొక్కలను గుర్తించేదికాగా.. హ్యారి అత్యంత కచ్చితత్వంతో విత్తనాలు నాటుతుంది. స్మాల్ రోబో కంపెనీ తాజాగా అభివృద్ధి చేసిన రోబోట్ డిక్.. విద్యుత్తు షాక్‌లతో కలుపు మొక్కలను నాశనం చేస్తుంది. ఇంకోలా చెప్పాలంటే హానికారక రసాయన మందుల వాడకం అస్సలు అవసరం లేదన్నమాట. అంతేకాకుండా.. పొలంలోని జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ నేల సారాన్ని పరిరక్షించుకునేందుకు ఈ రోబో అవకాశం కల్పిస్తుంది. ఈ మూడు రోబోలను కలిపి ఉపయోగించడం ద్వారా పొలం పనులు చాలా వేగంగా పూర్తి చేయవచ్చునని కంపెనీ చెబుతోంది. పొలంలోని ఒక్కో మొక్కను పరిశీలించి.. మిల్లీమీటర్ సైజులో ఉన్న కలుపు మొక్కలను సైతం గుర్తించగలగడం ఈ రోబోల ప్రత్యేకత అని స్మాల్ రోబోట్ కంపెనీ వ్యవస్థాపకుడు సామ్ వాట్సన్ జోన్స్ అంటున్నారు. 2020లో సుమారు 20 చోట్ల వీటిని ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తామని, ఆ తరువాతి సంవత్సరం అందరికీ అందుబాటులోకి తెస్తామని కంపెనీ వివరించింది. -
ఉల్లి రైతుకు ఊరటనిచ్చే యంత్రం
ఉల్లి పాయలను పీకిన తర్వాత కాడను కొంత మేరకు కోసి పొలంలో 3–7 రోజులు ఎండబెడతారు. ఎండిన తర్వాత ఉల్లిపాయలపై గుప్పెడు ఎత్తున ఉండే పిలకను కత్తితో కోసి, గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పనిని సాధారణంగా మహిళా కూలీలతో చేయిస్తుంటారు. ఇది చాలా శ్రమతో, ఖర్చుతో కూడిన పని. ఈ సమస్య పరిష్కారానికి బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ ఎ. కరోలిన్ రతినకుమారి ఒక యంత్రాన్ని రూపొందించారు. ఆనియన్ డి–టాప్పింగ్ మెషీన్లో ఎండిన ఉల్లిపాయలు వేస్తే.. ఉల్లిపాయల నుంచి పిలకలను కత్తిరించి, వీటిని వేర్వేరుగా బయటకు పంపుతుంది. 3 కె.డబ్లు్య., 3 ఫేజ్ విద్యుత్ మోటార్‌తో నడుస్తుంది. గంటకు టన్ను ఉల్లిపాయలపై పిలకలు కత్తిరిస్తుంది. దీని ధర రూ. 4 లక్షలు. ఉల్లిని ఎక్కువగా సాగు చేసే ప్రాంతాల్లో రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కొనుగోలు చేసి రైతులకు అందుబాటులోకి తేవచ్చు. వివరాలకు.. డాక్టర్ ఎ. కరోలిన్ రతినకుమారి, ముఖ్య శాస్త్రవేత్త, ఐఐహెచ్ఆర్, బెంగళూరు. మొబైల్ – 94835 19724 carolin@iihr.res.in -
శ్వాసను సరిచేసేందుకు కొత్త యంత్రం...
సైనసైటిస్ వంటి సమస్యలుంటే ఎంత ఇబ్బందో మనకు తెలియంది కాదు. సరిగా నిద్ర పట్టదు. ఊపిరితీసుకోవడం కష్టమైపోతుంది. ముక్కు లోపలి భాగాల్లో ఊపిరి లోనికి చేరనీయని స్థాయిలో కండరాలు పెరిగిపోతే కూడా ఇవే రకమైన ఇబ్బందులు ఎదురవుతూంటాయి. మందులేసుకోవడం... సమస్య మరీ ఎక్కువైతే, చిన్నపాటి ఆపరేషన్ చేయించుకోవడం... ఇప్పటివరకూ ఉన్న చికిత్స విధానాలు. కాకపోతే ఈ రెండు పద్ధతులతో లభించేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఈ నేపథ్యంలో ఓహాయో స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ సమస్యలకు ఓ వినూత్నమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని ఆవిష్కరించారు. రేడియో తరంగాల శక్తిని ఉపయోగించి శ్వాసకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రాంతాలను సరిచేయడం కోసం వీరు వివావెర్ నాసల్ ఎయిర్‌వే రీమోడలింగ్ డివైజ్‌ను తయారుచేశారు. వాయు నాళానికి అడ్డుగా ఉన్న వృదులాస్థి కణజాలం ఆకారాన్ని కొద్దిగా మార్చడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశమని, ఆపరేషన్ టేబుల్‌పై కాకుండా.. ఔట్ పేషంట్ విభాగంలోనే చికిత్స పూర్తి చేయగలగడం దీని ప్రత్యేకత అని ఈ పరికరం తయారీలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త డాక్టర్ బ్రాడ్ ఒట్టో తెలిపారు. -
బధిరుల కోసం.. కొత్త వినికిడి యంత్రం
సాక్షి, హైదరాబాద్: బధిరులకు మరింత అనుకూలంగా ఉండేలా కోక్లియర్ ఇంప్లాంట్స్ సంస్థ నూతన వినికిడి యంత్రాన్ని రూపొందిం చింది. ప్రస్తుతమున్న యంత్రాల పరిమాణం కన్నా 23% చిన్నసైజులో ఉండే ‘న్యూక్ల్యెస్-6’ అనే వినికిడి పరికరం బధిరులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సోమవారం దీనిని ఇక్కడ ఆవిష్కరించిన వైద్యులు పేర్కొన్నారు. అతి సూక్ష్మ శబ్దాలను సైతం గ్రహించే శక్తి ఈ పరికరానికి ఉందని అపోలో ఈఎన్టీ నిపుణులు డాక్టర్ రాంబాబు చెప్పారు. ఇది వాటర్ ప్రూఫ్ పరికరమని, వర్షంలో తడిసినా ఫర్వాలేదని అపోలో ఆస్పత్రి చీఫ్ ఆడియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ వివరించారు.