new married couple died
-
కొత్త జంట.. సెల్‌ఫోన్.. ప్రతిరోజూ 50 సార్లు ఐ లవ్ యూ.. విషాదం
తమిళనాడు: భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని మనస్తా పం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని జీర్ణించుకోలేక భర్తా ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి అయిన నెలరోజులు కూడా గడవకముందే నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ సంఘటన పట్టుకోట్టైలో జరిగింది. పట్టుకోట్టై సమీపంలోని నాటుచాల గ్రామానికి చెందిన సతీష్ (28)కు నెల రోజుల క్రితం సువిత (22)తో వివాహమైంది. వారు ప్రతిరోజూ కనీసం 50 సార్లు ఐ లవ్ యూ అనే సందేశాన్ని పంపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సువిత భర్తకు ఫోన్ చేసింది. అతడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మనస్తాపం చెందింది. మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. సతీష్ ఆమెను వెంటనే పట్టుకోట్టై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. భార్య మృతి చెందడంతో సతీష్ కూడా మనస్తాపం చెంది సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హనీమూన్‌కు వెళ్లి డాక్టర్ దంపతులు మృతి.. అసలేం జరిగింది?
తిరువళ్లూరు: హనీమూన్ కోసం మాల్దీవులు వెళ్లి మృతి చెందిన నూతన డాక్టర్ దంపతుల మృతదేహాలు రెండు వారాల క్రితం విమానం ద్వారా ఇంటికి చేర్చారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి చెన్నీర్‌కుప్పం ప్రాంతానికి చెందిన సెల్వం కుమార్తే విభూష్న డాక్టర్. ఈమేకు చైన్నెకు చెందిన డాక్టర్ లోకేశ్వరన్‌తో గత ఒకటిన అంత్యంత వైభవంగా వివాహం జరిగింది. వివాహం జరిగిన రెండు రోజుల తరువాత నూతన జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. అనంతరం అక్కడున్న రిజర్వాయర్‌లో బోట్లో వెళుతూ ఫొటో షూట్ తీసుకున్నారు. ఈ సమయంలో జరిగిన ప్రమాదంలో పడవ బోల్తా పడడంతో నూతన జంట నీటిలో మునిగి అక్కడే మృతిచెందారు. మృతదేహలను వెలికి తీసిన అక్కడి పోలీసులు లాంచనాలను పూర్తీ చేశారు. అనంతరం అక్కడి నుంచి విమానం ద్వారా మలేషియాకు అక్కడి నుండి చైన్నెకు మృతదేహాలను తరలించారు. కాగా చైన్నెకు చేరిన తరువాత విభూష్న మృతదేహాన్ని చెన్నీర్కుప్పానికి, లోకేశ్వరన్ మృతదేహాన్ని సేలంకు బంధువులు తరలించారు. శనివారం మధ్యాహ్నం విభూష్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా గత రెండు వారాల క్రితం పచ్చటి తోరణాలు, మంగళవాయిద్యాలతో కలకలాడిన ప్రాంతంలో చావు మేళాలు వినిపించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కానిస్టేబుల్‌పై దుండగుల దాడి -
15 రోజుల క్రితమే పెళ్లి.. గోడపై అలా రాసి జంట ఆత్మహత్యాయత్నం
పిడుగురాళ్ల: పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుని 15 రోజులైనా గడవక ముందే ఆత్మహత్యకు యత్నించింది ఓ నవ జంట. భార్య మరణించగా.. భర్త ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల రజక కాలనీలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కాలనీకి చెందిన చంపాల నాగేశ్వరరావు మరణించడంతో ఆయన భార్య నాగమ్మ కూలిపనులు చేసుకుంటూ కుమార్తె అఖిల(17)తో కలిసి ఉంటుంది. అఖిల ఇంటర్ పూర్తిచేసింది. అదే కానీలకి చెందిన తాడువాయి వెంకట శివ కొడుకు వినయ్ ఇంటర్ పూర్తి చేసి ప్రైవేటు కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వినయ్, అఖిల ఒకరినొకరు ఇష్టపడ్డారు. తల్లిదండ్రులను ఒప్పించి గతనెల 31న గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నాగమ్మ నవ దంపతులను భోజనానికి పిలిచేందుకు వారి గది వద్దకు వెళ్లింది. ఎంతసేపు పిలిచినా తలుపు తీయకపోవడంతో తలుపు సందులో నుంచి చూసింది. గదిలో ఇనుప కడ్డీకి ఇద్దరూ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. దీంతో ఆమె కేకలు పెడుతూ బయటకు వచ్చింది. స్థానికులు తలుపులు పగలగొట్టి ఇద్దరినీ కిందికి దింపారు. అఖిల అప్పటికే మరణించింది. కొన ఊపిరితో ఉన్న వినయ్‌ను ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కట్నం విషయంలో గొడవే కారణమా? కట్నం విషయంలో ఇరు కుటుంబాల మధ్య సమస్య తలెత్తడంతో ఈనెల 12న పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడం వల్లే మనస్తాపం చెంది నవ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసి ఉంటారని భావిస్తున్నారు. గదిలో గోడపై ‘‘న్యాయం జరగాలి. పెద్ద మనుషులు న్యాయం చేయలేదు. ఇన్నిరోజులు ఆగి ఇప్పుడు చనిపోవడానికి కారణం న్యాయం జరుగుతుందని ఆశ’’ అని నల్లటి అక్షరాలతో రాసి ఉండడం దీనికి బలం చేకూరుస్తోంది. -
డ్రైవర్ నిర్లక్ష్యంతో.. సంధ్య వాలింది
సాక్షి, తిరుపతి తుడా/రాయచూరు (కర్ణాటక): రాయచూరు సమీపంలోని ముదగల్ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(55)కి సువర్ణ, సంధ్య, సౌమ్య, సుజిత్ నలుగురు పిల్లలు. పెద్ద అల్లుడు సువర్ణ భర్త వినోద్‌కుమార్, రెండో అల్లుడు సంధ్య భర్త హరీష్‌తో పాటు రెండేళ్ల మనుమరాలు విన్మయ్ తదితర కుటుంబ సభ్యులు మొత్తం ఎనిమిది మందితో గురువారం రాత్రి బెంగళూరు మీదుగా శుక్రవారం కంచికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని తిరుమల వెళ్లేందుకు తిరుపతికి బయలుదేరారు. రాత్రి 12 నుంచి ఒంటి గంట దాకా నగరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో రైల్వే అండర్ బ్రిడ్జి కింద 8 అడుగులకు పైగా నీరు చేరింది. ఇదే సమయంలో వారు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం రైల్వే అండర్ బ్రిడ్జి వద్దకు చేరింది. డ్రైవర్ ఆంజనేయులు నిర్లక్ష్యంగా వాహనాన్ని నీటిలో దింపాడు. మధ్యలో ఇంజిన్ ఆగిపోవడం.. అంతలోనే నీటి ప్రవాహం పెరగడంతో వాహనం పూర్తిగా మునిగిపోయింది. చీర విసిరినా.. నీట మునిగిన వాహనంలోని పిల్లలు, అల్లుళ్లు, మనుమరాలును కాపాడేందుకు ఇంటికి పెద్ద దిక్కు అయిన భాగ్యశ్రీ విశ్వప్రయత్నాలు చేసింది. తన చీరను అప్పటికే గట్టువద్దకు చేరుకున్న పోలీసులు, స్థానికుల వద్దకు విసిరింది. వాహనంలోని వారు చీర సహాయంతో ఒక్కొక్కరూ గట్టుకు చేరారు. వెనుక సీటులో నిద్రిస్తున్న సంధ్యను గుర్తించలేకపోయారు. వారందరూ బయటకు వచ్చిన రెండు నిమిషాల తర్వాత సంధ్య కోసం ప్రయత్నించగా.. ఊపిరి ఆడక వాహనంలోనే తుది శ్వాస విడిచింది. విధికి కన్నుకుట్టిందేమో.. ముదగల్‌కు చెందిన సంధ్య(28)కి సమీపంలోని లింగసూగూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హరీష్ గుప్తా(30)తో ఇటీవలే వివాహమైంది. చూడచక్కని జంట. చిలకా గోరింకల్లా ఉన్నారని అందరూ సంతోషపడ్డారు. ఇంతలో విధికి కన్నుకుట్టిందేమో.. నవ వధువును అర్ధంతరంగా కబళించింది. సంధ్య స్వగ్రామంలో, అటు అత్తవారి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
నవదంపతుల ఆత్మహత్య
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువజంట మనస్పర్దల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బుర్రా సంతోష్(28) బంజారాహిల్స్ రోడ్‌నెం–2లోని ఎయిర్టెల్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో ఓ సెల్‌ఫోన్ షోరూంలో పనిచేస్తున్న అర్చన(28)తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. ఇద్దరూ మూడు నెలల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సంతోష్ తల్లిదండ్రులు హాజరుకాగా అర్చన తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాలేదు. పెళ్లి తరువాత ఇద్దరూ కలిసి బంజారాహిల్స్ రోడ్‌నెం–12లోని శ్రీరాంనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. గత రెండు వారాల నుంచి ఇద్దరూ తరచూ గొడవలు పడుతున్నారు. అభిప్రాయ బేధాలు తీవ్రరూపం దాల్చి శనివారం ఉదయం పోట్లాడుకున్నారు. ఉదయం 8 నుంచి 10గంటల దాకా ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఇద్దరూ క్షణికావేశంలో ఒకే తాడుతో ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సంతోష్ షోరూంకు వెళ్లి స్టోర్ తెరవాల్సి ఉంటుంది. ఎంతకూ రాకపోయే సరికి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అబీబ్ నాలుౖగైదు సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. రెండు రోజుల క్రితం అర్చన కూడా ఓ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. ఆమె కూడా 10.30కు స్టోర్స్‌కు వెళ్లి తాళాలు తీయాల్సి ఉంటుంది. ఆ స్టోర్ మేనేజర్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో ఆమె భర్త పనిచేస్తున్న ఎయిర్టెల్ షోరూంకు వచ్చారు. సంతోష్ కూడా ఫోన్ లిప్ట్ చేయడం లేదని తెలుసుకున్న అబీబ్ 12గంటల ప్రాంతో సంతోష్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు ఎంతకూ తలుపు తీయలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. కిటికీ తొలగించి చూడగా బెడ్రూంలో యువజంట ఫ్యాన్‌కు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. ఇద్దరూ ఒంటరివారవడం, సంసారంలో గొడవలు ఇవన్నీ తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఆర్.కలింగరావు, ఎస్ఐ హరీష్‌రెడ్డి ఆధారాలు సేకరించారు. -
పండక్కు వస్తామంటూ.. తిరిగిరాని లోకాలకు..
నెలరోజుల క్రితం పెళ్లయింది. ఎన్నో ఆశలు, మరెన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. జీవితమంతా బంగారు భవిష్యత్తంటూ ఊహల్లో తేలియాడుతున్న ఆ యువ దంపతులను చూసి దేవుడికే కన్నుకుట్టిందేమో.. ఆనందంగా పుట్టింటికి వెళ్లి వస్తున్న సమయంలో కారు ప్రమాదం రూపంలో ఆ జంటను తన వద్దకు తీసుకెళ్లాడు. అయినవారికి తీరని శోకం మిగిల్చాడు. తిరుపతి జూపార్క్ రోడ్డులో సోమవారం ఉదయం బైకును కారు ఢీకొనడంతో నవ వధూవరులు కావ్య(19), బాలాజీ (22) మృతి చెందారు. వీరిద్దరికీ గత నెల 8న పెళ్లయింది. దంపతుల మృతితో వధూవరుల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. చిత్తూరు, చంద్రగిరి: ‘‘అమ్మా మళ్లీ పండగకు వస్తాము. మా అత్త, మామతో పాటు మా ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు.. నువ్వేమీ నా గురించి దిగులు పడొద్దు.. ఎండా కాలంలో కావడంతో మాకోసం కొత్తగా కూలర్‌ను కూడా తీసుకొచ్చారమ్మా.. నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పి అని తల్లిని ఊరడించి, అత్తగారింటికి బయల్దేరిన కుమార్తె గంట వ్యవధిలోనే తన భర్తతో సహా తిరిగిరాని లోకాలకు చేరుకుంది. కొత్త ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ నవదంపతులను మృత్యువు కారు రూపంలో కబళించింది. మండలంలోని కూచువారిపల్లెకు చెందిన కావ్య, కరకంబాడికి చెందిన బాలాజికి గత నెలలో వివాహమైంది. ఆదివారం కావ్య తన భర్తతో కలసి స్కూటీ వాహనంపై పుట్టింటికి వచ్చింది. అందరినీ పలకరించి సంతోషంగా గడిపింది. సోమవారం ఉదయం తిరిగి నవదంపతులు కరకంబాడికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ తిరుపతి–అలిపిరి బైపాస్‌లోని సైన్స్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఇటు కూచివారిపల్లె, అటు కరకంబాడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటికి చేరాక ఫోన్ చేస్తామన్న తన కుమార్తె, అల్లుడి మరణం గురించి ఫోన్లో వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని కుటుంబ సభ్యులు భోరున విలపించారు. -
నవదంపతుల మృత్యువాత
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో అనంతపురానికి చెందిన కొత్త దంపతులు మృత్యువాత పడినట్లు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. పిడుగులాంటి వార్త విన్న కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. దేవుడు ఆరునెలలకే ఆ దంపతుల జీవితాన్ని ముగించేశాడంటూ రోదించారు. మృతదేహాల కోసం అనంతపురం నుంచి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నారు. మృతదేహాలను బుధవారం అప్పగిస్తామని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో వారంతా అక్కడే పడగాపులు గాస్తున్నారు. అనంతపురంలోని నీలిమ థియేటర్ సమీపంలో పోస్టల్ కరస్పాండెంట్ క్లర్క్ చంద్రశేఖర్, అనసూయ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శ్రీనివాస్ (28), శ్రీకాంత్ ఇద్దరు కుమారులు. ఇద్దరూ బెంగళూరులోని ప్రెవేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఆరునెలల క్రితం తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీలతతో శ్రీనివాస్ వివాహం జరిగింది. శ్రీలత, శ్రీనివాస్ దంపతులు బెంగళూరులో ఉంటున్నారు. ఈ క్రమంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లేందుకు వారు అనంతపురం రావాలనుకున్నారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీనివాస్ తన తండ్రి చంద్రశేఖర్‌కి ఫోన్ చేసి అనంతపురం వస్తున్నట్లు చెప్పాడు. ఇంతలోనే దంపతులిద్దరూ ప్రమాదంలో చిక్కుకున్నారని సమాచారం అందడంతో శ్రీనివాస్ తల్లిదండులు తల్లడిల్లిపోయారు. 24 గంటల అనంతరం శ్రీలత, శ్రీనివాస్ మృత్యువాత పడ్డారని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.