చిప్ ప్లాంటుకు భాగస్వామి సిద్ధం..
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ ప్లాంటు ఏర్పాటు కోసం భాగస్వామిని సిద్ధం చేసుకున్నట్లు వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాదే చిప్‌ల తయారీని ప్రారంభించనున్నట్లు కంపెనీ 58వ షేర్‌హోల్డర్ల సమావేశంలో వివరించారు. అయితే, భాగస్వామి పేరు మాత్రం ఆయన వెల్లడించలేదు. రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ ప్లాంటు నెలకొల్పేందుకు వేదాంతతో కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్‌కాన్ తప్పుకున్న నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తమ అనుబంధ సంస్థ ఎవాన్్రస్టేట్.. గ్లాస్ సబ్్రస్టేట్స్ తయా రీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందని, సొంత పేటెంట్లు కూడా ఉన్నాయని అగర్వాల్ చెప్పారు. మరోవైపు, భారత్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడాన్ని వేదాంత కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 35 బిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 2.9 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. కార్యకలాపాల విస్తరణ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 14,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు.