new temple
-
ఆ పనులు ఆపండి!
సాక్షి, అమరావతి: కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పాత ఆలయాల పునరుద్ధరణకు కామన్ గుడ్ఫంఢ్ (సీజీఎఫ్), శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా గత ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్లో ఇంకా ప్రారంభంకాని వాటన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టాలని సీఎం చంద్రబాబు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదలైన పనులను మాత్రమే పూర్తిచెయ్యాలన్నారు.దేవదాయ శాఖ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు మంగళవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజీఎఫ్ కార్యక్రమంలో పాత ఆలయాల పునరుద్ధరణకు సంబందించి గత ప్రభుత్వంలో మంజూరై ఇంకా మొదలుకాని 243 పనులను సైతం పక్కన పెట్టాలంటూ సీఎం ఆదేశించారు. అలాగే, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కింద వివిధ ప్రాంతాల్లో తలపెట్టిన 1,797 దేవాలయాల పనులు ప్రారంభం కాలేదని, వాటినీ నిలిపివేయాలని ఆయన చెప్పారు. గతంలో పల్లెల్లో, వాడల్లో శ్రీవాణి ఆలయ నిర్మాణం ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షలు ఇచ్చేవారని.. వీటితో ఆలయాల నిర్మాణాలు సాధ్యంకావడంలేదని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ మొత్తాన్ని పెంచడానికి, ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం సూచించారు. ఆలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదు.. దేవాలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో స్పష్టంచేశారు. ఏ మతంలో అయినా భక్తుల మనోభావాల ముఖ్యమని.. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా దేవాదాయ శాఖాధికారులు పనిచేయాలని సూచించారు. అలాగే, రాష్ట్రంలో ఇకపై ఎక్కడా బలవంతపు మత మారి్పళ్లు ఉండకూడదన్నారు. రూ.20 కోట్లు కంటే ఎక్కువ వార్షికాదాయం ఉండే ఆలయ ట్రస్టు బోర్డుల్లో ప్రస్తుతం 15 మందిని సభ్యులుగా నియమిస్తుండగా, ఆ సంఖ్యను 17కు పెంచే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. అదనంగా పెంచిన సభ్యుల సంఖ్యలో ఒక బ్రాహ్మణుడు, ఒక నాయీ బ్రాహ్మణునికి అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని.. ఈ విషయంలో ప్రణాళికలతో రావాలని సీఎం అధికారులను కోరారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయించారు. అర్చకుల వేతనాలు పెంపు.. దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే పలువురు అర్చకుల వేతనాల పెంపుపైనా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా.. » ప్రస్తుతం రూ.10 వేల వేతనంతో పనిచేసే అర్చకులకు ఇకపై రూ.15 వేలు చెల్లించాలని నిర్ణయించారు. » తక్కువ ఆదాయం ఉండే ఆలయాలలో ధూపదీప నైవేద్య పథకం ద్వారా అర్చకులకు అందజేసే మొత్తం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. » అలాగే, వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని సీఎం సూచించారు. » అంతేకాక.. నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. » వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరి, కృష్ణా నదీ హారతులు మళ్లీ.. గోదావరీ, కృష్ణా నదీ హారతులు మళ్లీ నిర్వహించాలని సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే, ప్రతి దేవాలయంలో ఆన్లైన్ విధానం అమలుచేయాలని, అన్ని సర్విసులు ఆన్లైన్ ద్వారా అందాలన్నారు. అవసరమైతే ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో హోటళ్ల నిర్మాణం చేపట్టి భక్తులకు వసతులు కల్పించాలన్నారు. దేవాలయాలకు విరాళాలిచి్చన వారిని ప్రోత్సహించాలని.. వారి పేర్లు ప్రకటించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు. -
పలు ఆలయాలకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
-
నూతన ఆలయాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం
-
సచివాలయానికి నీలకంఠాభరణం...!
-
నమో వేంకటేశా..
కామారెడ్డి రూరల్ : మండలంలోని లింగాపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఆలయంలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వరకు సుబ్రహ్మణ్య శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవతామూర్తులప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 30న ఉదయం 7:30కు ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభమవుతాయని, ఏప్రిల్ 1న శిఖర ప్రతిష్ఠ, ధాన్యాది, శయ్యాది, పుష్పాది, ఫలాధివాసముులు, హోమం, 2న అవాహిత దేవతా పూజలు, బలిప్రదానం, గర్త సంస్కారము కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. అనుగ్రహ భాషణం ప్రతిష్ఠాపనోత్సవాల్లో తోగుట రామాపూరం శ్రీ మధనానంద పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ మధవానంద సరస్వతీతో యంత్ర ప్రాణ ప్రతిష్ఠా కళాన్యాసము, మహాభిషేకం, కుంభాభిషేకం, స్వామీజీ అనుగ్రహాభాషనం ఉంటాయ తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు అన్నదానం, సాయంత్రం సాయంత్రం భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు పూలు, పండ్లు, పూజ సామగ్రి నవధాన్యాలు, పగడాలు, ముత్యాలు, నవరత్నాలు, యంత్రం కింద వేయడానికి తీసుకురావచ్చన్నారు. 2న దేవదాయశాఖ మంత్రి రాక విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగం గా ఏప్రిల్ 2న నిర్వహించనున్న కార్యక్రమాలకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలు హాజరవుతారని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆలయ విశిష్టత లింగాపూర్ గ్రామంలోగల శ్రీవేంకటేశ్వర పురాతన ఆలయం భక్తులకు కొంగు బంగారంగా, కోరికలు తీర్చే వెంకన్నగా పేరుంది. కాల క్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు జీర్ణోద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమలతిరుపతి దేవస్థానం నిత్య ధూపదీప నైవెద్య పథకం కింద సహాయం అందించింది. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ సర్వశ్రేయో నిధి (సీజీఎఫ్) కింద రూ.30 లక్షలు ఆలయ నిర్మాణానికి మంజూరు చేసింది. టీటీడీ దేవతామూర్తుల విగ్రహాలను అందించింది. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఐక్యంగా ఆలయ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చి సుమారు రూ.కోటి వ్యయంతో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. -
రూ.3 కోట్లతో యముడికి కొత్త ఆలయం
చెన్నై: వరాలిచ్చే దేవుడే కాదు ప్రాణాలు హరించే యముడు సైతం తమిళనాడులో పూజనీయుడైనాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. తంజావూరు జిల్లాలో రూ.3 కోట్లతో యమధర్మరాజుకు వేల సంవత్సరాల నాటి ఆలయం ఉంది. ఇపుడు నూతన ఆలయం సిద్ధమైంది. పురాణగాథల ప్రకారం దేవతలు శివ దర్శనం కోసం కైలాసం వచ్చినపుడు శివుడు కళ్లు మూసుకుని కఠినమైన తపస్సు చేసుకుంటున్నాడు. కళ్లు తెరచి ఉన్న స్థితిలో శివుడు దర్శనం ఇచ్చేలా చేయాలనే ఆలోచనతో దేవతలు మన్మథుడిని రప్పించి తపస్సును భగ్నం చేశారు. ఇందుకు అగ్రహించిన శివుడు మన్మథుడిని భస్మం చేస్తాడు. ఆ తరువాత ఆయన భార్య రతీదేవి వచ్చి శివుడిని ప్రార్థించడంతో మన్మథుడిని తిరిగి బతికిస్తాడు. ఆ సమయంలో ప్రాణాలు హరించే బాధ్యతను తనకు అప్పగించాలని యమధర్మరాజు శివుడిని కోరగా శివుడు సమ్మతిస్తాడు. ఇందుకు గుర్తుగా పూర్వీకులు తంజావూరు జిల్లా పట్టుకోటై సమీపంలోని తిరుచ్చిట్రంబళం గ్రామంలో యమధర్మరాజుకు ఆలయం నిర్మించారు. యమధర్మరాజుకు సదరు బాధ్యతల అప్పగింతలకు కారణమైన శివుడికి సైతం కొద్ది దూరంలో మరో ఆలయాన్ని నిర్మించారు. యమధర్మరాజుకు ఆలయం నిర్మించి 1,300 ఏళ్లు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని గ్రామస్తులు మీడియాకు తెలిపారు. ఈ గ్రామంలోనే రూ.3 కోట్లతో యముడికి కొత్తగా ఆలయాన్ని కూడా నిర్మించి మట్టితో యముడి విగ్రహాన్ని తయారుచేసి ప్రార్థనలు జరిపామని తెలిపారు. మట్టి విగ్రహం స్థానంలో ఆరు అడుగుల ఎత్తు, రెండు టన్నుల బరువు ఉన్న శిలావిగ్రహాన్ని త్వరలో ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. జనవనరి 22వ తేదీన కొత్త ఆలయంలో యముడికి కుంభాభిషేకం జరుపుతామని వారు చెప్పారు. -
కురుక్షేత్రంలో వెంకన్న ఆలయ నిర్మాణం
సాక్షి, తిరుమల: హర్యానాలోని కురుక్షేత్రం పుణ్యక్షేత్రంలో టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తోంది. వచ్చే వేసవి నాటికి కొత్త ఆలయంలో వెంకన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. హర్యానా ప్రభుత్వం ఆధీనంలోని కురుక్షేత్రం డెవలప్మెంట్ బోర్డు టీటీడీకి 5 ఎకరాల భూమి విరాళంగా సమర్పించింది. మరో ఐదెకరాలు ఇచ్చేందుకు అంగీకరించిం ది. ఇందులో రూ.32.6 కోట్లతో ఆలయం, అనుబంధ అభివృద్ధి పనులు చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. తొలి విడతగా రూ.17.6 కోట్ల అంచనాలతో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తోంది. రాజగోపురం, ముఖ మండపం, మహా మణిమండపం, అర్థమండ పం, గర్భాలయం, వైకుంఠ ద్వారం పనులు సాగుతున్నాయి. అలాగే, కురుక్షేత్రంలో శ్రీవారి ఆలయానికి అనుబంధంగా రథమండపం, వాహన మండపం, అన్నదాన భవనం, అధికారులు, సిబ్బంది క్వార్టర్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.15 కోట్లు కేటాయించారు. ఈ పనులు టెండర్ల దశలో ఉన్నాయి.