Nigeria students
-
లంగర్‌హౌజ్‌లో డ్రగ్స్ కలకలం
-
లంగర్‌హౌజ్‌లో డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: సిటీ యువతను టార్గెట్ చేసుకుని విదేశీయులు కొందరు డ్రగ్స్ దందాకు తెరలేపారు. హైదరాబాద్‌లోని వెస్ట్ జోన్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. లంగర్‌హౌజ్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియా వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్టూడెంట్ వీసా మీద భారత్‌కు వచ్చిన డానియల్ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసుల గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 6 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. (చదవండి: తెలంగాణకు సినీ ప్రముఖుల విరాళాలు) -
ఘనంగా నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం
-
మద్యం మత్తులో రెచ్చిపోయిన నైజీరియన్స్
-
మద్యం మత్తులో రెచ్చిపోయిన నైజీరియా విద్యార్థులు
యువకుడిపై కత్తితో దాడి.. వడ్డేశ్వరంలో ఉద్రిక్త పరిస్థితి తాడేపల్లి రూరల్: నైజీరియాకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఆదివారం మద్యం మత్తులో రెచ్చిపోయి స్థానిక యువకుడిపై దాడికి పాల్పడ్డారు.కేఎల్‌యూలో బీటెక్ సెకండియర్ చదువుతున్న నైజీరియాకు చెందిన అడిల్, మహ్మద్, క్రిస్టాఫర్, అహ్మద్, బీసీఏ సెకండియర్ చదువుతున్న వలిద్లు మద్యం సేవించేందుకు వడ్డేశ్వరంలోని ఓ వైన్‌షాపునకు వెళ్లారు. స్థానికులైన బురదగుంట సునీల్, మరో యువకుడు కూడా వైన్‌షాపునకు వెళ్లారు. ఈక్రమంలో వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసిన నైజీరియా విద్యార్థులు తమను చూసే నవ్వుతున్నారని భావించి, వారిపై తిరగబడ్డారు. మద్యం బాటిళ్లు పగలగొట్టి సునీల్‌పై కత్తితో దాడి చేశారు.అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానికులు నైజీరియా విద్యార్థులను చితకబాదారు. వారిలో అహ్మద్ అనే విద్యార్థి గాయపడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సునీల్‌తో పాటు అహ్మద్‌ను వైద్యశాలకు తరలించారు. చివరికి పారిపోయిన నలుగురు విద్యార్థులను అదుపులోనికి తీసుకొని వారికి కేఎల్ వర్సిటీ హాస్టళ్లకు తరలించారు. -
మద్యం మత్తులో నైజీరియన్ల వీరంగం
బెంగళూరు(బనశంకరి) : నైజీరియా విద్యార్థులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. బైక్‌లపై సంచరిస్తూ ప్రజలను ఢీకొన్నారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి కృష్ణరాజపుర ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.... నైజీరియాకు చెందిన 9 మంది విద్యార్థులు మద్యం సేవించి అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో 6 బైకుల్లో కృష్ణరాజపురకు బయలుదేరారు. టిన్ ఫ్యాక్టరీ వద్ద బైకులు అడ్డదిడ్డంగా నడుపుతూ కోలారు కు చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తిని ఢీకొన్నారు. ప్రశ్నించిన అతడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అతడి తల, కాలు తీవ్రగాయాలయ్యాయి. కృష్ణరాజపుర ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో మూడు ద్విచక్రవాహనాల్లో ముగ్గురు పారిపోగా మరో ఆరుగురిని రామమూర్తినగర పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు.