బెంగళూరు(బనశంకరి) : నైజీరియా విద్యార్థులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. బైక్‌లపై సంచరిస్తూ ప్రజలను ఢీకొన్నారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి కృష్ణరాజపుర ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.... నైజీరియాకు చెందిన 9 మంది విద్యార్థులు మద్యం సేవించి అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో 6 బైకుల్లో కృష్ణరాజపురకు బయలుదేరారు. టిన్ ఫ్యాక్టరీ వద్ద బైకులు అడ్డదిడ్డంగా నడుపుతూ కోలారు కు చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తిని ఢీకొన్నారు.
ప్రశ్నించిన అతడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అతడి తల, కాలు తీవ్రగాయాలయ్యాయి. కృష్ణరాజపుర ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో మూడు ద్విచక్రవాహనాల్లో ముగ్గురు పారిపోగా మరో ఆరుగురిని రామమూర్తినగర పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు.