‘బాయ్ మీట్స్ గర్ల్’
‘‘తొలి ప్రేమ అనేది ఓ తియ్యని అనుభూతి. కచ్చితంగా అందరూ ఆ తొలి ప్రేమను ఆస్వాదించే ఉంటారు. ఇందులో హీరో కూడా తన తొలి ప్రేమ తాలూకు ఆనుభవాల్లోకి ప్రయాణిస్తాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని వినోదాత్మకంగా, ప్రణయాత్మకంగా తీస్తున్నాం’’ అని దర్శకుడు వసంత్ దయాకర్ చెప్పారు.
‘ఎల్.బి.డబ్ల్యూ’ ఫేమ్ సిద్ధు, కనికా తివారి, నిఖితా అనిల్ కాంబినేషన్లో ప్రసన్నకుమార్ సమర్పణలో సునీత నిర్మిస్తున్న చిత్రం ‘బాయ్ మీట్స్ గర్ల్’. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
త్వరలో పాటలను, వచ్చే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గురు రాజా, కెమెరా: దుర్గాకిషోర్, రచనా సహకారం: తోటప్రసాద్, ఆకెళ్ల శివప్రసాద్, శ్రీధర్.