‘బాయ్ మీట్స్ గర్ల్’ | 'Boy meets girl' is entertaing movie, says director | Sakshi
Sakshi News home page

‘బాయ్ మీట్స్ గర్ల్’

Published Fri, Aug 30 2013 1:07 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

‘బాయ్ మీట్స్ గర్ల్’ - Sakshi

‘బాయ్ మీట్స్ గర్ల్’

‘‘తొలి ప్రేమ అనేది ఓ తియ్యని అనుభూతి. కచ్చితంగా అందరూ ఆ తొలి ప్రేమను ఆస్వాదించే ఉంటారు. ఇందులో హీరో కూడా తన తొలి ప్రేమ తాలూకు ఆనుభవాల్లోకి ప్రయాణిస్తాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని వినోదాత్మకంగా, ప్రణయాత్మకంగా తీస్తున్నాం’’ అని దర్శకుడు వసంత్ దయాకర్ చెప్పారు. 
 
 ‘ఎల్.బి.డబ్ల్యూ’ ఫేమ్ సిద్ధు, కనికా తివారి, నిఖితా అనిల్ కాంబినేషన్‌లో ప్రసన్నకుమార్ సమర్పణలో సునీత నిర్మిస్తున్న చిత్రం ‘బాయ్ మీట్స్ గర్ల్’. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
 
 త్వరలో పాటలను, వచ్చే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గురు రాజా, కెమెరా: దుర్గాకిషోర్, రచనా సహకారం: తోటప్రసాద్, ఆకెళ్ల శివప్రసాద్, శ్రీధర్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement