Niko Resources
-
నికో రిసోర్స్‌కు నోటీసులు పంపిన రిలయన్స్
-
ఎన్ఈసీ గ్యాస్ బ్లాక్‌లో విక్రయానికి నికో వాటాలు
న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న నికో రిసోర్సెస్ .. ఎన్ఈసీ-25 గ్యాస్ బ్లాక్ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఇందులో తనకున్న 10 శాతం వాటాలను భాగస్వామ్య సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీకి విక్రయించనున్నట్లు 2016 రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపింది. ఎన్ఈసీ-25 బ్లాక్‌లో 60% వాటాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన ఆపరేటర్‌గా ఉంది. బీపీకి 30%, నికో రిసోర్సెస్‌కు 10% వాటాలున్నాయి. ఒడిషాలో తీరానికి దగ్గర్లోని ఎన్ఈసీ-25 బ్లాక్‌లో సుమారు 1.032 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఆర్థిక కష్టాల్లో ఉన్న నికో.. సమస్యల నుంచి గట్టెక్కేందుకు కేజీ-డీ6 చమురు, గ్యాస్ క్షేత్రంలో కూడా తనకున్న వాటాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది. -
మరో రెండు రిలయన్స్ గ్యాస్ క్షేత్రాలు వెనక్కి
న్యూఢిల్లీ : తూర్పు తీరంలో మరో రెండు గ్యాస్ క్షేత్రాలను రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేయనుంది. ఒడిశా తీరంలోని ఎన్ఈసీ-25 బ్లాక్‌లో ఒకటి, కేజీ-డీ6 బ్లాక్‌లోని డీ-31 క్షేత్రాన్ని ఆర్ఐఎల్, దీని భాగస్వామ్య సంస్థలు నికో రిసోర్సెస్, బ్రిటిష్ పెట్రోలియం(బీపీ) నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరోపక్క, ప్రభుత్వం నిర్దేశించినట్లు గ్యాస్ నిక్షేపాల ధ్రువీకరణ కోసం మూడు క్షేత్రాల్లో డ్రిల్ స్టెమ్ టెస్ట్(డీఎస్టీ)ను చేపట్టేందుకు కూడా ఆర్ఐఎల్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీటిలో ఎన్ఈసీ-25 బ్లాక్‌లోని డీ-32 క్షేత్రం, కేజీ-డీ6 బ్లాక్‌లోని డీ-29, డీ-30 క్షేత్రాలు ఇందులో ఉన్నాయి. గ్యాస్ క్షేత్రాలను భవిష్యత్తులో అభివృద్ధికోసం అట్టిపెట్టుకోవాలంటే.. అందులో నిక్షేపాల వెలికితీత వాణిజ్యపరంగా లాభసాటేనని ధ్రువీకరించాల్సి ఉంటుంది. -
విక్రయానికి కేజీ బ్లాక్ నికో వాటా
న్యూఢిల్లీ: కృష్ణా-గోదావరి బేసిన్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 గ్యాస్ బ్లాక్‌లో వాటాను నికో రిసోర్సెస్ అమ్మకానికి పెట్టింది. మొత్తం 20 చమురు, సహజవాయువు నిక్షేపాలు ఈ బ్లాక్‌లో వున్నాయి. కెనడాకు చెందిన నికోకు ఇందులో 10 శాతం వాటా వుంది. సహజవాయువు ధరను ప్రభుత్వం అంచనాలకంటే తక్కువగా పెంచడం, భారత్‌లో గ్యాస్ వ్యాపారం భవిష్యత్ అనిశ్చితంగా వుంటుందని భావించడంతో తమ వాటాను విక్రయించాలని నిర్ణయించినట్లు నికో రిసోర్సెస్ చైర్మన్ కెవిన్ జే క్లార్క్ చెప్పారు. ఇటీవల కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటా విక్రయానికి ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా జెఫ్రీస్ సంస్థను నియమించామన్నారు. కేజీ గ్యాస్ ధరను ఎంబీటీయూ (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్)కు 4.2 డాలర్ల నుంచి 5.61 డాలర్లకు గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం పెంచింది. పరిశ్రమ ఆశించిన ధర 8.4 డాలర్లకంటే ఇది తక్కువ. ఆ వాటా కావాలనుకుంటే దానిని కొనుగోలుచేసే తొలి హక్కు రిలయన్స్‌కే వుంటుంది. ఈ హక్కును రిలయన్స్ వినియోగించుకుంటుందో లేదో చూడాల్సివుంటుంది. ఈ బ్లాక్‌లో 60 శాతం ప్రధాన వాటా రిలయన్స్ వద్ద, మరో 30 శాతం ప్రపంచ ప్రసిద్ధ చమురు సంస్థ బీపీ వద్ద వుంది. -
ఆ గ్యాస్ నిక్షేపాలను ఆర్‌ఐఎల్‌కే ఇవ్వండి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు చెందిన కేజీ డీ6 బ్లాకులో కనుగొన్న మూడు గ్యాస్ బావుల అభివృద్ధి సాంకేతిక వివాదంతో నిలిచిపోయిన నేపథ్యంలో... గడువు సడలించి, ఉత్పత్తి చేసుకోవడానికి ఆర్ఐఎల్ను అనుమతించాలని చమురు శాఖ కేంద్ర మంత్రివర్గాన్ని కోరనుంది. ధీరూభాయ్ 29, 30, 31 అనే పేర్లు పెట్టిన ఈ బావుల్లో 145 కోట్ల డాలర్ల విలువైన నిక్షేపాలున్నట్లు అంచనా. వీటిలో వాణిజ్య కార్యకలాపాలకు అనుమతించాలని కోరుతూ 2010లో ఆర్ఐఎల్ లాంఛనంగా చమురు శాఖకు దరఖాస్తు పంపింది. అయితే నిర్ణీత ధ్రువీకరణ పరీక్షలు నిర్వహించని కారణంగా ఆర్ఐఎల్ అభ్యర్థనను డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) తిరస్కరించింది. డ్రిల్ స్టెమ్ టెస్ట్ (డీఎస్టీ) నిర్వహణకు రిలయన్స్ అంగీకరించినప్పటికీ, గడువు ముగిసిపోయిందని డీజీహెచ్ పేర్కొంది. దాదాపు 34,500 కోట్ల ఘనపు అడుగుల మేర ఉన్న గ్యాస్ నిక్షేపాల వెలికితీతకు ఆర్ఐఎల్ను నిరాకరించడం, కొత్తగా బిడ్డింగ్ నిర్వహించడం వల్ల బావుల అభివృద్ధి ఆలస్యమవుతుందని చమురు శాఖ భావిస్తోంది. ఆర్ఐఎల్ ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం)ను కోరితే ఉత్పత్తి మరింత జాప్యమవుతుందని యోచిస్తోంది. కనుక, ఉత్పత్తి పంపిణీ ఒప్పందం(పీఎస్సీ)లోని గడువులను సవరించి, ఆర్ఐఎల్కు అవకాశం ఇవ్వాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీని చమురు శాఖ కోరనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
గ్యాస్ ధర పెంచకుంటే పెట్టుబడులు నిలిచిపోతాయ్
న్యూఢిల్లీ: సవరించిన సహజ వాయువు ధరల అమల్లో జాప్యం వల్ల కృష్ణ-గోదావరి బేసిన్‌లోని కేజీ డీ6లో ప్రతిపాదిత రూ.24,000 కోట్ల పెట్టుబడులు నిలిచిపోతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. డీ34 క్షేత్రం అభివృద్ధికై ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ డిజైన్‌ను పూర్తి చేసినట్టు తెలిపింది. నవంబరు నుంచి పనులు ప్రారంభించి, 2017లో గ్యాస్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో కావాల్సిన పరికరాలకు టెండర్లను ఆహ్వానించినట్టు పేర్కొంది. ‘రాబోయే రోజుల్లో సహజ వాయువు ధరపై స్పష్టత లేదు. ప్రస్తుత, భవిష్యత్ పెట్టుబడి ప్రణాళికలు సంకటంలో పడ్డాయి. దీని వల్ల లక్ష్యం మరో ఏడాది ఆలస్యం అవుతుంది’ అని రిలయన్స్ వెల్లడించింది. సవరించిన సహజ వాయువు ధరల అమల్లో జాప్యంపై రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్‌లు భారత ప్రభుత్వానికి ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వ) నోటీసు జారీచేసిన సంగతి తెలిసిందే. కేజీ డీ6 క్షేత్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌కు పెంచిన ధర ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఐదేళ్లపాటు మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్లకు 4.205 డాలర్లు చెల్లించాలన్న ఒప్పందం గడువు ఇప్పటికే ముగిసింది. ఈలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త రేటు ప్రకటనను వాయిదావేయాలని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం కోరింది. -
కేజీ డీ6లో పెరగనున్న గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ ఉత్పత్తిని రిలయున్స్ ఇండస్ట్రీస్ ఈ నెల నుంచి రోజుకు 1-3 మిలియున్ స్టాండర్ట్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) మేర పెంచనుంది. ఉత్పత్తి క్షీణతకు అడ్డుకట్ట వేసే ప్రక్రియును సంస్థ చేపట్టడంతో ఇది సాధ్యం కానుంది. ఆర్ఐఎల్ తన భాగస్వావుులు బీపీ పీఎల్సీ (యుూకే), నికో రిసోర్సెస్ (కెనడా)లతో కలసి కేజీ డీ6 బ్లాకులో ఎంఏ క్షేత్రాన్ని తవ్వింది. ఎంఏ-8 పేరుగల ఈ క్షేత్రంలో ఈనెల నుంచే ఉత్పత్తి ప్రారంభవుయ్యే అవకాశవుుందని విశ్వసనీయు వర్గాలు వెల్లడించారుు. ఈ క్షేత్రంలో 1-3 ఎంసీఎండీల గ్యాస్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఎంఏ-8లో 3 ఎంసీఎండీల గ్యాస్ లభిస్తే కేజీ డీ6లో అత్యధికంగా గ్యాస్ ఉత్పత్తి అయ్యే బావి ఇదే అవుతుంది. గత వుూడేళ్లలో కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తి నానాటికీ తగ్గుతూ ప్రస్తుతం 12 ఎంసీఎండీలకు చేరింది. డీ1, డీ3 క్షేత్రంలో వుూసేసిన బావుల్లో వుూడో వంతుకు వురవ్ముతులు చేయూలనీ, తద్వారా వూర్చి నాటికి ఉత్పత్తిని వురింత పెంచాలనీ ఆర్ఐఎల్ యుత్నిస్తోంది. ఇసుక, నీరు వస్తుండడంతో డీ1, డీ3ల్లోని మొత్తం 18 బావుల్లో పదింటిని సంస్థ వుూసివేసింది. ఎంఏ క్షేత్రంలోని 6 బావుల్లో రెండు కూడా ఇదే కారణంతో వుూతపడ్డారుు. కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తి 2010 వూర్చి నాటికి ఉత్పత్తి 69.43 ఎంసీఎండీల గరిష్ట స్థారుుకి చేరింది.