Nine days
-
తొమ్మిది రోజుల పూల బతుకమ్మలు నైవేద్యాలు..! (ఫొటోలు)
-
వింత శబ్దాల మిస్టరీ వీడింది
సరిగ్గా ఏడాది క్రితం ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా దాకా ప్రపంచమంతటా 9 రోజులపాటు తరచుగా వినిపించిన వింత శబ్దాల రహస్యం వీడిపోయింది. ఈ శబ్దాలకు భూప్రకంపనలు కారణం కాదని పరిశోధకులు తేల్చారు. గ్రీన్లాండ్లోని మారుమూల ప్రాంతం డిక్సన్ ఫోర్డ్లో భారీగా మంచు చరియలు విరిగిపడడం వల్ల భూమి స్వల్పంగా కంపించడంతో ఉత్పత్తి అయిన శబ్దాలుగా గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. భూకంపాలను అధ్యయనం చేసే పరిశోధకులు 2023 సెపె్టంబర్లో రహస్య శబ్ద సంకేతాలను గుర్తించారు. గతంలో ఇలాంటి సంకేతాలు ఎన్నడూ కనిపెట్టలేదు. ఇవి సాధారణ భూప్రకంపనల్లాంటివి కాకపోవడంతో వారిలో ఆసక్తి పెరిగింది. ఒకే వైబ్రేషన్ ప్రీక్వెన్సీతో శబ్దాలు వినిపించాయి. దీనిపై అధ్యయనం కొనసాగించి, గుట్టు విప్పారు. డిక్సన్ ఫోర్డ్లో మంచు కొండల నుంచి విరిగిపడిన మంచు, రాళ్లతో 10 వేల ఒలింపిక్ ఈత కొలనులు నింపవచ్చని తెలిపారు. మంచు చరియల వల్ల మెగా సునామీ సంభవించి, సముద్రంలో 200 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడ్డాయని చెప్పారు. లండన్‌లోని బిగ్ బెన్ గడియారం కంటే రెండు రెట్ల ఎత్తుకు అలలు ఎగిశాయని వెల్లడించారు. భారీ అలల ప్రభావం ఏకంగా 9 రోజులపాటు కొనసాగిందని అన్నారు. దీనికారణంగానే వింత శబ్దాలు వినిపించినట్లు స్పష్టంచేశారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గ్రీన్లాండ్లో మంచు కరుగుతోంది. సముద్రంలో దశాబ్దాలపాటు స్థిరంగా నిలిచి ఉన్న భారీ మంచు పర్వతాలు సైతం చిక్కిపోతున్నాయి. అవి బలహీనపడి, మంచు ముక్కలు జారిపడుతున్నాయి. వాతావరణ మార్పులు, భూతాపం వల్ల హిమానీనదాలు గత కొన్ని దశాబ్దాల్లో పదుల మీటర్ల పరిమాణంలో చిక్కిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూ ధ్రువ ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడడం, సునామీలు ఇక సాధారణ అంశంగా మారిపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. భూగోళం వేడెక్కడం ఇంకా కొనసాగితే అవాంఛనీయ పరిణామాలు సంభవించడం తథ్యమని పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'నవ'వేద్యాలు
పండుగ అంటే ప్రతివారికీ ఆనందం. కానీ విజయదశమి విషయమే వేరు. మిగతా పండుగల్లో వేడుకలు ఒకటి రెండు రోజులే. దసరాకు... తొమ్మిది రోజుల పాటు సరదాలు, సంబరాలు, సంభ్రమాలు. రుచులు ఆరు మాత్రమే అనే బెంగ వద్దు. ఈ నవరాత్రులూ అమ్మవారి నైవేద్యానికి ‘ఫ్యామిలీ’ అందిస్తున్న నవవిధ ప్రసాదాలివి! 1. చక్కెర పొంగలి కావలసినవి: బియ్యం - కప్పు పాలు - 2 కప్పులు; పంచదార - 4 కప్పులు నీళ్లు - 3 కప్పులు; పెసర పప్పు - అర కప్పు పచ్చి కొబ్బరి ముక్కులు - కప్పు; కిస్మిస్ - 15 జీడిపప్పులు - పది; నెయ్యి - అర కప్పు తయారి: బియ్యం, పెసర పప్పులను విడివిడిగా నూనె లేకుండా బాణలిలో వేయించి తీసి పక్కన ఉంచాలి. * ఒక గిన్నెలో మూడు గ్లాసుల నీళ్లు, రెండు గ్లాసుల పాలు పోసి కాగాక వేయించి ఉంచుకున్న బియ్యం, పెసరపప్పు వేసి బాగా కలిపి ఉడికించాలి. * పూర్తిగా ఉడికిన తరవాత పంచదార వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉంచాలి. * బాణలిలో నెయ్యి వేసి కాగాక జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు విడివిడిగా వేసి దోరగా వేయించి ఉడికిన చక్కెరపొంగలిలో వేసి కలిపి దించేయాలి. * నెయ్యి ఎంత ఎక్కువ వాడితే అంత రుచిగా ఉంటుంది. 2. కట్టె పొంగలి కావలసినవి: బియ్యం - కప్పు; పెసరపప్పు - కప్పు జీలకర్ర - టీ స్పూను; మిరియాల పొడి - టీ స్పూను కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు - గుప్పెడు తయారి: * ముందుగా ఒక గిన్నెలో బియ్యం, పెసరపప్పు వేసి నీళ్లతో బాగా కడిగి నీరు ఒంపేయాలి. * ఆరు కప్పుల నీరు జత చేసి, కుకర్‌లో ఉంచి, నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి. * బాణలిలో నెయ్యి వేసి కరిగాక ముందుగా జీలకర్ర వేసి చిటపటలాడించాలి. * మిరియాల పొడి వేసి వేగుతుండగానే, జీడిపప్పు వేసి బాగా వేయించాలి. * కరివేపాకు వేసి వేయించి వెంటనే దించేయాలి. * ఉడికించుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా మెదపాలి. * నేతిలో వేయించి ఉంచుకున్న పదార్థాలను వేసి బాగా కలిపి వేడివేడిగా వడ్డించాలి. 3. పులిహోర... కావలసినవి: బియ్యం - 4 కప్పులు చింతపండు - 100 గ్రా.; పచ్చి సెనగపప్పు-టేబుల్ స్పూను మినప్పప్పు - టేబుల్ స్పూను ఆవాలు - 2 టీ స్పూన్లు; జీలకర్ర - 2 టీస్పూన్లు ఎండుమిర్చి - 15; పచ్చి మిర్చి - 10; కరివేపాకు - 4 రెమ్మలు పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (వేయించినవి) నువ్వుల పొడి - 2 టేబుల్ స్పూన్లు (నువ్వులు వేయించి పొడికొట్టాలి) జీడిపప్పులు - 15; నూనె - 100 గ్రా.; ఇంగువ - టీ స్పూను పసుపు - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారి: ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి, నీరు ఒంపేసి, 7 కప్పుల నీరు జత చేసి బియ్యం ఉడికించాలి. * ఉడికిన అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక పెద్ద పళ్లెంలోకి తిరగబోసి, గరిటెతో పొడిపొడిగా అయ్యేలా కలపాలి. * ఒక గిన్నెలో చింతపండులో తగినంత నీరు పోసి నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచుకోవాలి. * బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి దోరగా వేయించాలి. చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి, ఉడికించి దించేయాలి. * అన్నంలో చింతపండురసం, పోపు వేసి బాగా కలపాలి. * నువ్వులపొడి, పల్లీలు, జీడిపప్పులు వేసి బాగా కలిపి సుమారు గంటసేపు ఊరిన తరవాత తింటే ప్రసాదాన్ని రుచిగా ఆస్వాదించవచ్చు. 4. రవ్వకేసరి కావలసినవి: బొంబాయి రవ్వ - కప్పు (నూనె లేకుండా దోరగా వేయించాలి) పంచదార - 2 కప్పులు నీళ్లు - 3 కప్పులు నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు - 10 కిస్మిస్ - గుప్పెడు ఏలకుల పొడి - టీ స్పూను తయారి: * ఒక పాత్రలో రవ్వ, పంచదార వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. * పెద్ద బాణలిలో నీళ్లు పోసి మరిగాక, రవ్వ పంచదార మిశ్రమం వేసి ఉండకట్టకుండా కలుపుతుండాలి. * ఉడుకుతుండగా మధ్యమధ్యలో నెయ్యి వేస్తుండాలి. * ఏలకుల పొడి వేసి కలపాలి. * బాగా ఉడికిన తర్వాత దింపేయాలి. * ఒక బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి. * రవ్వ కేసరిలో వేసి కలపాలి. * రవ్వకేసరి చేశామంటే పండుగ ఇంటికి వ చ్చేసినట్లే. * పండుగ అంటే నోరు తీపి చేసుకోవడమే. * అందునా అమ్మవారి వాహనమైన కేసరి ఈ మధుర పదార్థంలోనే ఉంది సుమా. 5. అల్లం గారెలు కావలసినవి: మినప్పప్పు - పావు కేజీ అల్లం ముక్కలు - 2 టీ స్పూన్లు జీలకర్ర - టీ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట నూనె - డీప్ ఫ్రైకి తగినంత; ఉప్పు - తగినంత తయారి: * మినప్పప్పును నాలుగు గంటలు నానబెట్టి, నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి గారెల పిండి అనువుగా గట్టిగా పిండి పట్టాలి. * ఉప్పు, అల్లం ముక్కలు, ఉల్లి తరుగు, జీలకర్ర, కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలపాలి. * స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పిండిని చేతిలోకి తీసుకుని గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేగాక తీసేయాలి. 6. దద్ధ్యోదనం కావలసినవి బియ్యం - రెండు కప్పులు అల్లం - చిన్న ముక్క; పచ్చి మిర్చి - 10 ఎండు మిర్చి - 5; సెనగ పప్పు - టీ స్పూను ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను కరివేపాకు - 2 రెమ్మలు కొత్తిమీర - చిన్న కట్ట దానిమ్మ గింజలు - టేబుల్ స్పూను చిన్న ద్రాక్ష లేదా కిస్మిస్ ద్రాక్ష - కప్పు జీడి పప్పులు - 10; నెయ్యి - టేబుల్ స్పూను తయారి * ముందుగా బియ్యం కడిగి నీళ్లు ఒంపేసి, ఐదు కప్పుల నీరు జత చేసి ఉడికించాలి. * అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా దంచి పక్కన ఉంచాలి. * బాణలిలో నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. * ఒక పెద్దపాత్రలో అన్నం వేసి, అందులో వేయించిన పోపు సామాను వేసి బాగా కలపాలి. * తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలపాలి. * చివరగా దానిమ్మ గింజలు, దానిమ్మ గింజలు చిన్న ద్రాక్ష లేదా కిస్మిస్ ద్రాక్ష, చెర్రీ ముక్కలు, టూటీ ఫ్రూటీ ముక్కలు, జీడి పప్పులు వేసి బాగా కలపాలి. 7. కదంబం కావలసినవి: బాస్మతి బియ్యం - రెండు కప్పులు క్యారట్, బీన్స్, పచ్చి బఠాణీ, క్యాప్సికమ్, ఉల్లికాడలు, ఉల్లిపాయలు, బంగాళదుంప, మెంతి కూర, పుదీనా - అన్నీ కలిపి ఒక కప్పు; పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను; ఏలకులు - 2 లవంగాలు - 2; దాల్చినచెక్క - చిన్న ముక్క కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - చిన్న కట్ట ఉప్పు - తగినంత; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు - గుప్పెడు; కిస్మిస్ - టేబుల్ స్పూను దానిమ్మ గింజలు - టేబుల్ స్పూను తయారి: ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉడికించి పక్కన ఉంచాలి. * బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క వరుసగా వేసి కొద్దిగా వేయించాలి. * తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి తీసేయాలి. * ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి విడివిడిలాడేలా చేయాలి. * కూర ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. * జీడిపప్పు, కిస్మిస్, దానిమ్మ గింజలు జత చేసి బాగా కలపాలి. * కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. 8. బెల్లమన్నం కావలసినవి: బియ్యం - కప్పు బెల్లం తరుగు - కప్పున్నర నెయ్యి - టేబుల్ స్పూను కొబ్బరి ముక్కలు - అర కప్పు (నేతిలో వేయించాలి) పచ్చ కర్పూరం - టీ స్పూను ఏలకుల పొడి - అర టీస్పూను తయారి: ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి రెండున్నర కప్పుల నీరు జత చేసి ఉడికించాలి. * అన్నం పూర్తిగా ఉడికిన తరువాత బెల్లం తరుగు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి. * ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. * నెయ్యి, వేయించిన కొబ్బరి ముక్కలు, పచ్చ కర్పూరం వేసి బాగా కలిపి దించేయాలి. 9. పరమాన్నం కావలసినవి: బియ్యం - కప్పు పంచదార - 4 కప్పులు పాలు - 2 కప్పులు నెయ్యి - టేబుల్ స్పూను జీడిపప్పు - 10 కిస్మిస్ - గుప్పెడు కొబ్బరి తురుము - పావు కప్పు ఏలకుల పొడి - అర టీస్పూను తయారి: బియ్యం శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. పాలు స్టౌ మీద పెట్టి, మరుగుతుండగా అందులో బియ్యం పోసి బాగా క లపాలి. బాగా ఉడికిన తరువాత పంచదార వేసి కలిపి కొద్దిసేపు స్టౌ మీదే ఉంచాలి. బాణలిలో నెయ్యి వేసి కాగాక జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి. ఉడుకుతున్న పరమాన్నంలో పచ్చి కొబ్బరి తురుము, వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసి బాగా కలపాలి. ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించేయాలి. -
వెళ్లిరా గణేశా..
తొమ్మిది రోజులుగా భక్తుల పూజలు అందుకున్న గణనాథులు బుధవారం రాత్రి గంగమ్మ ఒడికి చేరారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో డప్పు చప్పుళ్లు, కోలాటాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అన్నదానాలు, లడ్డూ వేలం పాటల్లో కులమతాల కతీతంగా అన్ని వర్గాల వారు పాల్గొన్నారు -
అక్టోబర్ 10 వరకు అసెంబ్లీ సమావేశాలు
-
నేటి నుంచి దసరా మహోత్సవాలు
-
లబ్ డబ్.. లబ్ డబ్..
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు తొమ్మిది రోజులుగా నిద్ర లేని రాత్రులు గడిపారు. మరికొందరైతే రెండు మూడు రోజులుగా సరిగా భోజనం కూడా చేయలేదు. పోటీ చేసిన అభ్యర్థుల పరిస్థితి ఇలా వుంటే వారి గెలుపు ఓటములపై బెట్టింగ్‌లు వేసిన వారు తాము పందెం కాసిన అభ్యర్థి గెలుస్తాడో లేదోననే ఆందోళనలతో సతమతమయ్యారు. అప్పుడప్పుడు కొంత ఉపశమనం పొందేందుకు వీలుగా వారికి ఎదురుపడిన ప్రతి ఒక్కరినీ విజయం ఎవరి వైపు ఉంటుందనే సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమయ్యారు. చాలా మందికి గురువారం రాత్రి నిద్రకరువైంది. అర్ధరాత్రి దాటినా సెల్ ఫోన్లలో చర్చలే చర్చలు. కూడికలు.. తీసివేతలు.. ఏది ఏమైనా ఇటు పోటీ చేసిన అభ్యర్థులు.. అటు బెట్టింగ్ వేసిన వారి ఉత్కంఠకు శుక్రవారంతో తెరపడనుంది. ఈ నెల 7వ తేదీన జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో 188 మంది అసెంబ్లీ, 25 మంది పార్లమెంటు స్థానాలకు పోటీ చేశారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మధ్యనే రసవత్తర పోరు కొనసాగింది. అభ్యర్థుల్లో కొందరు టెన్షన్ తగ్గించుకునేందుకు విహార యాత్ర పేరుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి గురువారం సాయంత్రానికి వారి వారి ప్రాంతాలకు చేరుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ శాతం పెరగడంతో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారన్నది చర్చనీయాంశమైంది. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అనంతపురం నియోజకవరగలో 60.30 శాతం, ఉరకొండలో 85.34, గుంతకల్లులో 74.11, తాడిపత్రిలో 79.35, శింగనమలలో 83.48, ధర్మవరంలో 84.02, రాప్తాడులో 83.88, కదిరిలో 74.90, పుట్టపర్తిలో 81.59, హిందూపురంలో 76.20, పెనుకొండలో 82.99, మడకశిరలో 83.88, కళ్యాణదుర్గంలో 85.47, రాయదుర్గంలో 85.11 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో ఎక్కువ భాగం యువకులు ఓటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాలపైనే ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. జిల్లా కేంద్రమైన అనంతపురంలో హోటళ్లు, టీ కొట్లు, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్‌తో పాటు ప్రధాన రోడ్లపై ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కన్పిస్తే చాలు ఫలితాలపైనే చర్చ. విజయావకాశాలపై ఇటు వైఎస్సార్ కాంగ్రెస్, అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ స్థానాలు తమ పార్టీకి దక్కుతాయంటే కాదు మా పార్టీకి దక్కుతాయనే రీతిలో చ ర్చించుకోవడం కనిపించింది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయనే విషయంలో రాజకీయ పార్టీ నాయకులు చెప్పే మాటల్లో నమ్మకం సన్నగిల్లడంతో ఇంటెలిజెన్స్ శాఖ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎక్కువ స్థానాల్లో మేమే గెలుస్తామంటూ ప్రధానంగా రెండు పార్టీల్లోనూ చర్చ సాగింది. మున్సిపల్, జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో ఈ ఫలితాలు కూడా తమకే అనుకూలంగా వస్తాయని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతుండగా... సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అధిక శాతం ఓటర్లు తమ పార్టీని ఆదరించినందున అధిక సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయినప్పటికీ మొన్నటి వరకు మంత్రులుగా కొనసాగిన ఎన్.రఘువీరారెడ్డి, శైలజానాథ్‌లు తిరిగి పోటీ చేయడంతో ఆ ఇద్దరు గెలుపు గురించి కాకుండా అసలు డిపాజిట్టు దక్కుతుందా లేదా అనే విషయంపై చర్చ సాగుతోంది. ఏది ఏమైనా కొద్ది గంటల్లో అందరి ఉత్కంఠకు తెరపడనుంది. -
వైభవంగా దసరా సంబరాలు
మహబూబ్‌నగర్ కల్చరల్, న్యూస్‌లైన్: గత తొమ్మిది రోజులుగా దుర్గామాతను వివిధ రూపాల్లో దర్శించి తరిం చిన ప్రజలు ఆదివారం అచ్చంపేట, కల్వకుర్తి, మక్తల్, గద్వాల, అలంపూర్, జడ్చర్ల, షాద్‌నగర్, కొడంగల్, నా రాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో దసరా పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. నవమి, దశమి ఒకేరోజు వచ్చినప్పటికీ ఆదివారమే విజ యదశమిని జరుపుకోవాలని నిర్ణయించడంతో ఉద యం నుంచే పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. పై-లీన్ ప్రభావంతో భారీవర్షాలు కురుస్తాయన్న సమాచారం కొంత కలవరపెట్టినప్పటికీ వాతావరణం అనుకూలించడంతో పాలమూరు పట్టణప్రజలు దసరా ధ్వజం ఊరేగింపులో భారీసంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక దసరాఉత్సవ కమిటీ, ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో బ్రాహ్మణవాడిలోని మందిరంలో ఉదయం 8గంటలకు దేవయజ్ఞం, వే దోపదేశం నిర్విహ ంచారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రా రంభమైన ఊరేగింపులో గౌలి వెంకటేశ్ నాయకత్వంలో రాయిచూర్నుంచి వచ్చిన సుమారు 100మంది గౌలి సమాజం ప్రతినిధులు, హనుమాన్ వ్యాయామశాల నిర్వాహకులు వివిధ దేవతల వేషధారణ, కోలాట ప్రదర్శనలు నిర్వహించారు. ధ్వజధారిగా న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి వ్యవహరించారు. 3 గంటలకు రాంమందిర్ చౌరస్తాలో ఉన్న దసరాకట్ట దగ్గర జనసమ్మేళనాన్ని నిర్వహించి ధ్వజారోహణం చేశారు. అక్కడి నుంచి బయలుదేరిన ర్యాలీ పాన్‌చౌరస్తా, క్లాక్‌టవర్, అశోక్‌టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం ద్వారా జిల్లా పరిషత్ క్రీడామైదానానికి చేరింది. వే లాది మంది పాల్గొన్న బహిరంగసభలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన అనంతరం పర్వదిన ప్రాముఖ్యతను వారణాసిలోని స్యాతక పాణిని కన్యాగురుకులం ఉపన్యాసకురాలు రావికంటి జ్యోతిశ్రీ సందేశమిచ్చారు. నవరాత్రులకు చిహ్నంగా బెలూన్ల ద్వారా ఆకాశంలోకి పంపిన 9 రకాల జ్యోతులు అలరించాయి. తదుపరి టంగుటూరు నుంచి వచ్చిన హరనాథ్ బృందం వివిధ రంగులు, ఆకృతుల్లో పేల్చిన బాణాసంచా ముచ్చట గొలిపింది. అనంతరం రావణాసుర దహన ప్రక్రియను పూర్తిచేశారు. విజయానికి స్ఫూర్తి దసరా చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అన్యాయంపై న్యాయం గెలుస్తుందని ఈ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ఎం. గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ విఠల్‌రావు, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ తదితరులు తమ సందేశాల్లో వెల్లడించారు. విజయానికి స్ఫూర్తిగా నవరాత్రులు, విజయదశమి వేడుకలు నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో ఏజీసీ డాక్టర్ రాజారాం, ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు, ఆర్టీఓ హన్మంత్‌రావు, డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్, మునిసిపల్ మాజీ చైర్మన్ సహదేవ్‌యాదవ్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు డాక్టర్ మురళీధర్‌రావు, ముత్యాల ప్రకాశ్, కేఎస్ రవికుమార్, చంద్రయ్య, సత్తూరు రాములుగౌడ్, గోపాల్ యాదవ్, చంద్రకుమార్ గౌడ్, పులి అంజనమ్మతోపాటు పట్టణ ప్రముఖులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.