‘భ్రూణ హత్యల నియంత్రణలో నిర్లక్ష్యం’
న్యూఢిల్లీ: ఆడ శిశువుల భ్రూణ హత్యలను అరికట్టడంలో కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు విరుచుకుపడింది. చట్టాలను ప్రభుత్వం అమలు చేయకుండా విధికి వదిలేస్తోందని దుయ్యబట్టింది. లింగ నిర్ధరణ నిషేధ చట్టం అమలుకుతీసుకున్న చర్యలు, వాటి వల్ల వచ్చిన ఫలితాలు ఏమిటో నాలుగు వారాల్లో చెప్పాలని కేంద్రంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలో ఆరేళ్లలోపు బాలబాలికల నిష్పత్తి తగ్గిపోతోందంటూ ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిల్‌పై ఈ ఆదేశాలు జారీ చేసింది. 2011 సెన్సస్ ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 914 మంది బాలికలే ఉన్నారు.
వారిపై చర్యలెందుకు తీసుకోకూడదు?
ఆయుధాలను అక్రమంగా అమ్ముతూ పట్టుబడి నామమాత్రపు జరిమానాతో బయటపడ్డ సైనికాధుకారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది