nirmal dipo
-
ఆర్టీసీ డిపో ఎదుట టీఎంయూ ధర్నా
నిర్మల్అర్బన్ : జీతభత్యాల సవరణ వెంటనే చేపట్టాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూని యన్ రాష్ట్ర కార్యదర్శి ఎల్.రమేశ్ డిమాండ్ చేశారు. వేతన సవరణపై యాజమాన్యం అవలంభిస్తున్న మొండి వైఖరి, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో టీఎంయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్‌డిపో వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, క్లరికల్, సూపర్వైజర్లతో పాటు అన్ని కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. పెంచిన కిలోమీటర్లను తగ్గించి, తగ్గించిన ఓటిని రన్నింగ్ టైమ్‌ను పునరుద్ధరించాలన్నారు. సర్క్యులర్ ప్రకారం రూటు సర్వే చేసి, రన్నింగ్ టైమ్ ఇవ్వాలన్నారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించేందకు మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. సర్క్యులర్ 01/2018ని రద్దు చేయాలన్నారు. గ్యారేజీ కార్మికులపై పెంచిన పని భారాన్ని తగ్గించాల ని, అధునాతన పనిముట్లు, విడిభాగాలు సరఫరా చేయాలన్నారు. తార్నాక హాస్పిటల్లో డాక్టర్లను నియమించాలని, మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలన్నారు. మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కాలం చెల్లిన రెగ్యులేషన్స్ మార్చాలన్నారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, అద్దె బస్సులు రద్దు చేసి కొత్త బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7వ తేదీన ‘చలో బస్ భవన్’ చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంఘం నాయకుడు కేఎంరెడ్డి, నిర్మల్ డిపో సెక్రెటరీ గంగాధర్, నాయకులు ఆర్ఎన్ రెడ్డి, పీవీఎస్‌రెడ్డి, శేఖర్, నారాయణ, అసదుల్ల, నర్సయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదేమిటి ఆర్టీసీ!
కామారెడ్డి: ఆర్టీసీ బస్సు ప్రయాణం క్షేమం అన్న నినాదం ఏమోగాని ఆ బస్సుల్లో ఎక్కితే క్షవరం తప్పదని ప్రయాణికులు వాపోతున్నారు. 44వ జాతీయ రహదారిపై నిత్యం వందలాది బస్సులు తిరుగుతుంటాయి. కొన్ని బస్సులు మాత్రం నాన్స్టాప్వి ఉంటుండగా, ఎక్కువ బస్సులు కామారెడ్డి మీదుగా వెళతాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ డిపోకు సంబందించిన 22 బస్సులు నిత్యం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో 13 బస్సులు సెమి లగ్జరీ, తొమ్మిది డీలక్స్ బస్సులు నిర్దేశిత సమయాల ప్రకారంగా నడుస్తున్నాయి. ఆదిలాబాద్ డిపోకు చెందిన బస్సులు 25కి పైగా నడుస్తున్నాయి. రాను, పోను కలిపితే రెండు డిపోలకు వంద ట్రిప్పులవుతాయి. ఇందులో చాలా బస్సులు కామారెడ్డి మీదుగా వెళ్లడంతో ఇక్కడి ప్రయాణికులు ఆ బస్సులనే ఆశ్రయిస్తారు. అక్కడే ఆగుతాయి హైదరాబాద్ రూట్లో తూప్రాన్ సమీపంలోని ఓ దాబా హోటల్ వద్దకు రాగానే బస్సులు ఆగిపోతున్నాయి. దీంతో అత్యవసర పనుల నిమిత్తం సెమి లగ్జరీ, డీలక్స్ బస్సులు ఎక్కిన ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డ్రైవర్లను నిలదీస్తే పై అధికారుల నుంచి ఆదేశాలున్నాయంటున్నారు. ఓ ప్రయాణికుడు గట్టిగా అడిగితే డ్రైవర్ తనకు డిపో మేనేజర్ ఇచ్చిన కాపీని చూపించాడు. అందులో బస్సులు బయలుదేరే సమయంతోపాటు గమ్యస్థానానికి చేరే సమయాలను పొందుపరిచారు. తూప్రాన్ వద్ద ఉన్న ఓ దాబా పేరును కూడా అందులో చేర్చారు. లంచ్, డిన్నర్‌కు బస్సులకు పర్మిషన్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్టీసీకి సంబంధించిన క్యాంటీన్ల వద్ద బస్సులు ఆపినా అర్థం ఉండేది. క్యాంటీన్లలో సంస్థ నిర్ణయించిన ధరల ప్రకారం ఆహార పదార్థాలు అందిస్తారు. దాబాల వద్ద బస్సులు ఆపితే, నిర్వాహకులు అందినం త దండుకుంటున్నారు. హోటళ్లు, క్యాంటీన్లలో అంతా రెడీమేడ్‌గా పదార్థాలు లభిస్తాయి. దాబాలలో ఆర్డర్ తీసుకుని తయారు చేసి ఇస్తారు. బస్సులు దాబాల వద్ద ఆపడంతో ఒక్కోసారి గంట సమయం కూడా వృథా అవుతోంది. హైదరబాద్ నుంచి కామారెడ్డి వైపు వచ్చే ప్రయాణికులు తెలియక నిర్మల్ డిపో బస్సు ఎక్కితే సమ యానికి గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నారు. అధికారులకు మామూళ్లు నిర్మల్ డిపో అధికారులు ఇచ్చిన ఆదేశాల మూలంగా ప్రయాణికులు నష్టపోవాల్సి వస్తోంది. జాతీయ రహదారిపై ఎన్నో దాబాలున్నా, ఫలానా దాబా వద్దనే ఆపా ల నే ఆదేశాల వెనుక మామూళ్ల దందా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆదిలాబాద్ డిపో బస్సులు కూడా అదే దాబా వద్ద ఆపుతున్నారు. రోజూ వంద ట్రిప్పులలో క లిపితే దాదాపు వేల మంది ప్రయాణిస్తారు. అందులో సగం మంది అంటే రెండు వేల మంది దాబాలో ఏదో ఒకటి తింటారు. తద్వారా దాబా నిర్వహకునికి రోజూ గి రాకీ లక్షల రూపాయలలో ఉంటోంది. కామారెడ్డి నుంచి జూబ్లీకి నేరుగా వెళ్లడానికి అనేక బస్సు సర్వీసులున్నాయి. రెండు గంటలలో బస్సు చేరుకుంటుంది. పై బస్సుల లో ఎక్కితే అరగంటకు పైగా సమయం దాబా వద్ద గడచిపోవడంతో, పనులకు ఆటంకం కలుగుతుందన్న భావనతో కొందరు ప్రయాణికులు ఇతర డిపోల బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.