Nitish Katara murder case
-
‘అతడు దోషి.. హక్కుల వాదన ఎక్కడిది’
న్యూఢిల్లీ : హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న యూపీ మాజీ మంత్రి ధరమ్‌పాల్ యాదవ్ తనయుడు వికాస్ యాదవ్ పెరోల్ విఙ్ఞప్తిపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతనికి విధించిన 25 సంవత్సరాల శిక్ష పూర్తి చేయాల్సిందేనని, పెరోల్ సాధ్యం కాదని స్పష్టం చేసింది. పెరోల్ పొందడం తన క్లైంట్ ప్రాథమిక హక్కు అని అడ్వొకేట్ వాదించగా.. ‘అతనొక దోషి. మళ్లీ హక్కుల వాదన ఎక్కడిది’ అని పేర్కొంది. కాగా, యూపీకి చెందిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నితీష్ కటారా (25)ను హతమార్చిన కేసులో వికాస్ 2002 నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు. తన సోదరి భారతీ యాదవ్‌తో నితీష్ డేటింగ్ చేస్తున్నాడనే కోపంతో అతన్ని దారుణంగా హతమార్చాడు. పెళ్లి మండపం నుంచి నితీష్‌ను ఎత్తుకెళ్లిన వికాస్, విశాల్ అతన్ని హత్య చేశారు. వీరిద్దరికీ 2002లో ఢిల్లీ హైకోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. 2016లో సుప్రీం తలుపు తట్టారు. వారి శిక్షను 25 ఏళ్లకు తగ్గిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. -
వికాస్ సోదరులకు అయిదేళ్ల జైలుశిక్ష తగ్గింపు
న్యూఢిల్లీ : 2002లో సంచలనం సృష్టించిన నితీష్ కఠారా హత్యకేసులో దోషులకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సోదరిని ప్రేమించాడన్న కారణంగా బిజినెస్ ఎగ్జిక్యూటీవ్ నితీష్‌ను దారుణంగా హతమార్చిన వికాస్ యాదవ్, విశాల్ యాదవ్‌లకు న్యాయస్థానం అయిదేళ్ల శిక్ష కాలాన్ని తగ్గించింది. ఆ కేసుతో గత ఏడాది ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ముఫ్పై ఏళ్ల జైలుశిక్షను పాతికేళ్లకు తగ్గిస్తూ సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే ఈ కేసులో మరో దోషిగా ఉన్న సుఖ్‌దేవ్ పెహల్వాన్‌కు ఇరవై ఏళ్లు జైలు శిక్షను సమర్థించింది. కాగా 2002లో నితీష్, వికాస్ యాదవ్ సోదరి భారతి ఢిల్లీ శివారులో ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అయితే తన సోదరితో సన్నిహితంగా ఉండటాన్ని సహించలేని యాదవ్ సోదరులు నితీష్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. వీరికి సుఖ్‌దేవ్ పెహల్వాన్ సహకరించాడు. యాదవ్ సోదరులు మాజీ ఎంపీ డీపీ యాదవ్ కుమారులు కాగా, నితీష్ విశ్రాంత ఐఏఎస్ అధికారి కుమారుడు. ఈ కేసును విచారించిన మేజిస్ట్రేట్ కోర్టు యాదవ్ సోదరులతో పాటు సుఖ్‌దేవ్‌కు జీవిత శిక్ష విధించింది. వీరికి మరణశిక్ష విధించాలని నితీష్ తల్లి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నితీష్ తల్లి అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. నిందితులకు 30 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. నిందితులు ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈకేసులో తీర్పును వెల్లడించిన కోర్టు శిక్షా కాలాన్ని అయిదేళ్లు తగ్గించింది. -
కటారా కేసు: వికాస్, విశాల్ లకు 25ఏళ్లు జైలు శిక్ష
న్యూఢిల్లీ: నితీశ్ కటారా హత్య కేసు దోషుల శిక్షాకాలన్ని ఇరవై ఐదేళ్ల కాలనికి తగ్గిస్తూ సోమవారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో హత్య కేసులో దోషులుగా తేలిన సోదరులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ లకు ఢిల్లీ హైకోర్టు 30ఏళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. కాగా, తమ శిక్షా కాలన్ని తగ్గించాలని కోరుతూ సోదరులిద్దరూ అత్యున్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. కేసును విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు కేవలం ముద్దాయిలే న్యాయం కోసం వేడుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇరువురు సోదరులకు 25ఏళ్లు, నితీశ్ ను చంపడానికి సాయం చేసిన సుఖ్ దేవ్ పహిల్వాన్ కు 20ఏళ్లపాటు శిక్షను విధిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. నితీశ్ కటారా(25)ను ఘజియాబాద్ లో వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ లు నిప్పంటించి చంపారు. తమ చెల్లెలు భారతి యాదవ్ తో నితీశ్ సన్నిహితంగా మెలుగుతుండటాన్ని ఓర్వలేని ఇరువురు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు పరువుహత్యగా పేర్కొంది. అరుదైన కేసుగా పరిగణలోకి తీసుకుని దోషులకు 30ఏళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. తన కొడుకును చంపిన ఇరువురు సోదరులకు ఉరి శిక్ష వేయాలని నితీశ్ తల్లి వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. -
'పథకం ప్రకారమే నితీష్‌ను చంపారు'
న్యూఢిల్లీ: నితీష్ కఠారా హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్‌లను దోషులుగా ప్రకటించడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. యాదవ్ సోదరులు ఓ పథకం ప్రకారం కఠారాను హత్య చేశారని పేర్కొంది. కాగా ఈ కేసులో దోషులకు శిక్షను తగ్గించే విషయం పరిశీలిస్తామని వెల్లడించింది. వికాస్, విశాల్‌ల సోదరి భారతీ యాదవ్‌ను నితీష్ ప్రేమించాడు. 2002లో నితీష్, భారతి ఢిల్లీ శివారులో ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు. ఆ సమయంలో యాదవ్ సోదరులు నితీష్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. వీరికి సుఖ్‌దేవ్ పెహల్వాన్ సహకరించాడు. యాదవ్ సోదరులు మాజీ ఎంపీ డీపీ యాదవ్ కుమారులు కాగా, నితీష్ విశ్రాంత ఐఏఎస్ అధికారి కుమారుడు. ఈ కేసును విచారించిన మేజిస్ట్రేట్ కోర్టు యాదవ్ సోదరులతో పాటు సుఖ్‌దేవ్‌కు జీవిత శిక్ష విధించింది. వీరికి మరణశిక్ష విధించాలని నితీష్ తల్లి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నితీష్ తల్లి అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. నిందితులకు 30 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. నిందితులు ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్టులోనూ వీరిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెలువడింది. కాగా వీరి శిక్ష తగ్గించే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.