No bail
-
మాట్రిమోనియల్ సైట్ల ద్వారా మహిళలకు ఎర..
ముంబై: మ్యాట్రిమోనియల్ సైట్లలో అవివాహిత మహిళలను వేధిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఓ ఘరానా మోసగాడికి కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని పబ్బం గడుపుకోవడమే అలవాటుగా మార్చుకున్నాడంటూ మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లా వసాయ్‌కి చెందిన ఇమాదుద్దీన్ ఇర్ఫాన్ షేక్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అడిషనల్ సెషన్స్ జడ్జి జయేంద్ర జగ్దలే వ్యాఖ్యానించారు. మోసం, వేధింపులు, లైంగిక దాడికి యత్నం తదితర సెక్షన్ల కింద పోలీసులు ఇతడిపై కేసు పెట్టారు. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా వైద్యురాలైన బాధితురాలికి నిందితుడు ఇర్ఫాన్ షేక్ పరిచయమయ్యాడు. అనంతరం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇర్ఫాన్ షేక్‌కు అప్పటికే పెళ్లయి, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ విషయం మాత్రం బాధితురాలికి చెప్పకుండా దాచాడు. కొన్ని రోజుల తర్వాత మోసం బయటపడింది. అప్పటి నుంచి అతడి నుంచి వేరుగా ఉంటోంది. నిందితుడు మాత్రం వాట్సాప్ కాల్స్‌తో వేధించడం మానలేదు. ఆమె వ్యక్తిగత ఫొటోలను బయటపెడతానంటూ బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో 2024 జూన్‌లో బాధితురాలి కారులోకి బలవంతంగా చొరబడ్డ ఇర్ఫాన్ షేక్ తుపాకీ లాంటి ఆయుధంతో బెదిరించి, లైంగిక దాడికి యతి్నంచాడు. తనను కాదని వేరెవరిని పెళ్లి చేసుకున్నా పరిణామాలు దారుణంగా ఉంటాయని వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ఇర్ఫాన్ షేక్ గతంలో మ్యాట్రిమోనియల్ సైట్లలో బ్యాంక్ ఉద్యోగినంటూ ఒకరిని మోసం చేసినట్లు గుర్తించారు. పోలీసు అధికారి పేరుతో, న్యాయశాఖ చిహ్నాన్ని తన వాహనంపై అతికించుకుని వసూళ్లకు పాల్పడ్డాడని తేల్చారు.మ్యాట్రిమోనియల్ సైట్‌కు సంబంధించిన మరో కేసులో తెలంగాణ పోలీసులు ఇతడిని అరెస్ట్ కూడా చేశారని కోర్టుకు పోలీసులు నివేదించారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న జడ్జి జయేంద్ర..ఇతడి నేర చరిత్రను వెలికి తీసేందుకు, మున్ముందు ఇతడి ఇటువంటి నేరాలకు పాల్పడకుండా కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇతడిపై అభియోగాలు తీవ్రమైనవని, అందుకు తగు ఆధారాలు సైతం ఉన్నాయన్నారు. బెయిలిస్తే విచారణకు అవరోధం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించారు. -
కవితకు బిగ్ షాక్...నో బెయిల్
-
కవితకు దక్కని ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తన అరెస్టు అక్రమమంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. కేసులో రాజకీయ నేత ప్రమేయం ఉన్న కారణంగా చట్టబద్ధమైన పరిష్కారాలు దాటవేయలేమని వ్యాఖ్యానించింది. పిటిషన్లో లేవనెత్తిన రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలు మాత్రమే విచారిస్తామని స్పష్టం చేసింది. కవిత పిటిషన్ శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు ప్రారంభిస్తూ.. హైకోర్టుకు వెళ్లాలని సూచించొద్దని, అనుకూలమైనా, ప్రతికూలమైనా సుప్రీంకోర్టు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏం జరుగుతోందో గమనించాలని, కవితకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేదని, ఒక అప్రూవర్ ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా అరెస్టు చేశారని, ఇలా చేయడం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని చెప్పారు. అయితే, బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. దీంతో, హేమంత్ సోరెన్ కేసులో ట్రయల్ కోర్టులో ఏమైందో చూశామని, ఇది జరిగే పని కాదని సిబల్ పేర్కొన్నారు. రాజకీయ వ్యక్తి ప్రమేయం ఉన్నందున చట్టబద్ధమైన పరిష్కారాలు దాటవేయలేమని «బెంచ్ అభిప్రాయపడిందని జస్టిస్ సంజీవ్‌ఖన్నా తెలిపారు. ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా కవితకు సమన్లు జారీ చేశారని సిబల్ చెప్పగా, అయినప్పటికీ ఆర్టీకల్ 32 ప్రకారం బెయిల్ ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు లేవనెత్తిన కారణంగా ఇప్పటికే విచారణలో ఉన్న విజయ్ మదన్‌లాల్ కేసుకు జత చేస్తామని పేర్కొంది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేస్తూ ఆరు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని పేర్కొంది. ‘నోటీసులు జారీ చేస్తున్నాం. ట్రయల్ కోర్టు లేదా ఇతర మార్గాల ద్వారా పరిష్కారానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ కల్పింస్తున్నాం. బెయిల్ అప్లికేషన్‌ను ట్రయల్ కోర్టు త్వరితంగా పరిష్కరించాలి’అని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా సిబల్ వ్యాఖ్యల్ని గమనించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా భావోద్వేగాలకు గురికావొద్దని సూచించారు. కోర్టు ఆదేశాల అనంతరం ఇది స్వర్ణయుగం కాదన్న సిబల్ వ్యాఖ్యలకు జస్టిస్ ఖన్నా స్పందిస్తూ.. వేచి చూద్దామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విజయ్ మదన్‌లాల్ కేసు విచారణను జూలైలో చేపట్టనుంది. ఈ నేపథ్యలో ఇదే కేసుకు కవిత పిటిషన్ జత చేయడంతో తదుపరి విచారణ జూలైలోనే జరగనుంది. నేటితో ముగియనున్న కస్టడీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఈడీ కస్టడీ ఆదేశాలు శనివారంతో ముగియనున్నా యి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్నా రు. కాగా, ఈడీ కస్టడీలో ఉన్న కవితతో శుక్రవారం సాయంత్రం ఆమె కుమారుడు ఆర్య, మరదలు అఖిల, స్నేహితురాలు వినూత ములాఖత్ అయ్యారు. మరోవైపు, ఈడీ అధికారులు ఆరో రోజూ కవితను సుదీర్ఘంగా విచారించారు. -
ఇన్నర్ రింగ్ రోడ్, అంగుళ్లు కేసుల్లో బెయిల్ పిటిషన్ తిరస్కరణ
-
సీపీఐ రామకృష్ణకు బెయిల్ నిరాకరణ
అనంతపురం: అనంతపురంలో అరెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు బెయిల్ ఇచ్చేందుకు స్థానిక కోర్టు మంగళవారం నిరాకరించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ సీపీఐ మార్చి 11న రాష్ట్రంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడించి...తమ నిరసన తెలపాలని సీపీఐ నిర్ణయించింది. అందులోభాగంగా 11వ తేదీన నిరసన చేపట్టిన కె.రామకృష్ణ పోలీసులు అనంతపురంలో అరెస్ట్ చేసి... పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయిన తరపు న్యాయవాది బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే రామకృష్ణకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.