no budget
-
ఏ‘మార్చి’
మార్చి నెలాఖరు వస్తున్నా దరి చేరని లక్ష్యం ప్రతి విభాగంలోనూ వెంటాడిన నిర్లక్ష్యం నిధులూ విడుదల కాని దుస్థితి... అంకెల గారడీ ... చరమాంకంలోనూ ఇదేమి బురిడీ ఓ చిన్న కుటుంబం ... ఆ నెలలో ఇల్లు గడవాలంటే మొదటి వారంలోనే ఓ బుల్లి ప్రణాళిక వేసుకుంటారు. ఏడాదిపాటు నెట్టుకు రావాలంటే భార్య, భర్తతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఖాళీ సమయంలో ఓ దగ్గర కూర్చొని బియ్యం, పప్పులతోపాటు ముఖ్య నిత్యావసర వస్తువులతో భారీ ప్రణాళికనే రచించుకొని ఆ ప్రకారం క్రయ, విక్రయాలు ఉండేటట్టు చూసుకుంటారు. ఇల్లు ... కుటుంబానికే ఇంత ముందు చూపుతో అడుగులేస్తుంటే 54 లక్షల జనాభా ఉన్న జిల్లాను పరిపాలిస్తున్న అధికారులు, పాలకులు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి. ఆర్భాటంగా నిధులైతే కేటాయించి ఏడాదవుతున్నా సగం సొమ్ము కూడా విదల్చకుండా జిల్లా ప్రజలను ఏమార్చిన తీరుపట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాలు ... విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రగతికి నిధులు, పేద, మధ్య తరగతికి ఇళ్లు, కాపులకే ఇవ్వాల్సిన రూ.90 కోట్లు...ఇలా ఏ ఒక్క లక్ష్యం దరిదాపులకు చేరుకోని దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విదల్చకపోతే తామేమి చేయగలమని కొంతమంది అధికారుల ప్రశ్న. డ్వాక్రాకు టోకరా... 2016–17 ఆర్థిక సంవత్సరంలో 59,587 సంఘాలకు రూ.1346.24 కోట్లు రుణాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. అలక్ష్యం : ఆర్థిక సంవత్సరం ముగిసే రోజు దగ్గరపడ్డా ఇంత వరకు కేవలం 23,861 సంఘాలకు రూ.601.45 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు.. ఎస్సీలకు మొండిచేయే... లక్ష్యం: జిల్లాలో షెడ్యూల్ కులాల్లో ఉన్న నిరుద్యోగులు, యువతకు 5,053 మందిని ఎంపిక చేసి ఉపాధి కల్పిస్తామంటూ 4,775 యూనిట్లకు రూ.95.27 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలక్ష్యం: ఇంకా లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేయలేకపో యారు. ఒక్క ఇల్లు కడితే ఒట్టు... లక్ష్యం: గూడులేని వారికి నీడ కల్పిస్తాం. అలక్ష్యం: జిల్లాకు 24,198 ఇళ్లు కేటాయించగా కేవలం 11,896 ఇళ్లు మాత్రమే నిర్మాణం చేపట్టారు. కాపులకూ హామీల కాటే... లక్ష్యం: కాపు కార్పొరేష¯ŒS ద్వారా 4 వేల మంది లబ్ధిదారులకు సబ్సిడీతో కలిపి రూ.80 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యం. అలక్ష్యం: కానీ ఒక్క రూపాయి కూడా అందజేసిన దాఖలాలు లేవు. బ్యాంకుల మధ్యే దరఖాస్తులు తిరుగుతున్నాయి. బీసీలకూ అదే మోసం... లక్ష్యం: జిల్లాలో బీసీలకు రూ.74.38 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యం. అలక్ష్యం: ఇప్పటివరకు ఒక్కరిని కూడా ఇంతవరకూ ఎంపిక చేయలేదు. క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలు పూర్తి చేసి బ్యాంకుల ఆమోదం కోసం దరఖాస్తులు పంపించిన స్థాయిలోనే ఉండిపోయింది. ఒట్టి వ్యవ‘సాయం’ లక్ష్యం : జిల్లాలో రైతులకు బంగారం,పంట రుణాలుగా రూ.7,084 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. అలక్ష్యం : 60 శాతం మించి రుణాలు ఇవ్వలేకపోయారు. -
నిధులకువైకల్యం
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలో వికలాంగులకు ఫిజియోథెరపీ (మర్దన), ఇతర చికిత్సలు నామమాత్రంగా మిగిలిపోతున్నాయి. గతేడాది అందించిన సేవలు ఈ ఏడాది లేకపోవడంపై వికలాంగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిధుల్లో కోతలు విధించడం వల్ల ఈ చర్యలు తీసుకోక తప్పడం లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. జిల్లా పరిధిలోని 66 మండలాల్లో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో 2011 సెప్టెంబర్ నుంచి ఫిజియోథెరపీ చికిత్సా విధానాన్ని అమలులోకి తెచ్చారు. మండల వనరుల కేంద్రాల్లో (ఎమ్మార్సీ) వీటిని ఏర్పాటుచేశారు. కాళ్లు, చేతులు వంకరపోవడం, నడవలేని స్థితిలో ఉన్న వికలాంగ పిల్లలు వైకల్య శాతాన్ని బట్టి చికిత్స పొందేవారు. ఇవి కొంతమేర సత్ఫలితాలను ఇచ్చాయి. చికిత్స పొందిన వికలాంగునికి రవాణా భత్యం కింద రూ.100 చెల్లించేవారు. ప్రతి సోమవారమూ చికిత్స అందించేవారు. మండలానికి 20 నుంచి 30 మంది వికలాంగులు వచ్చేవా రు. జిల్లా వ్యాప్తంగా వారానికి 1,110 మంది చొప్పున నెలకు 4,440 మంది వికలాంగ పిల్లలు చికిత్స పొందేవారు. ఇలా 2011 సెప్టెంబర్ నుంచి 2013 ఏప్రిల్ దాకా 20 నెలల కాలంలో 88,800 మంది చికిత్స పొందారు. తద్వారా వికలాంగులకు రూ.90 లక్షల వరకు చెల్లించారు. నిధులు లేవన్న కారణంగా మే నుంచి సేవలను కుదించారు. శిబిరాలను నెలలో రెండు రోజులకే పరిమితం చేశారు. రవాణాభత్యం రూ.100 పూర్తిగా నిలిపివేశారు. చికిత్స కావాలంటే వికలాంగులే ఖర్చులు భరించుకోవాలని అధికారులు ఖరాఖండీగా చెప్పేశారు. ఈ నేపథ్యంలో చికిత్స కోసం వచ్చే వికలాంగుల సంఖ్య వారానికి 600కు పడిపోయింది. మిగిలిన 500 మంది దూరమయ్యారు. 2012-13లో దీనికోసం రూ.2.4 కోట్లు కేటాయించగా రూ.1.7 కోట్లు ఖర్చు చేశారు. 2013-14 సంవత్సరానికి రూ.1.02 కోట్లను మాత్రమే కేటాయించారు. జిల్లాలో మొత్తం12,792మంది వికలాలగులు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. 1,772మంది నరాల బలహీనత, 1,452మంది వినికిడి లోపం, 1,035మందికి పాక్షిక దృష్టి లోపం, 3,444మంది బుద్ధిమాంద్యం, 1,653మంది అంగవైకల్యం, 785మందికి మాటలు రాకపోవడం, 181 మందికి పూర్తి దృష్టి లోపం, 59మంది ఆర్డిజం, 276 మంది నేర్చుకోలేని లోపంతో బాధపడుతున్నారు. ప్రతివారమూ చికిత్సకు వచ్చే 1,110 మందిలో సగం మంది చికిత్సకు దూరంగా ఉన్నారు. రవాణా భత్యం రూ.100 ఇచ్చేటప్పుడు పేదలకు బస్సు చార్జీలు, మధ్యాహ్న భోజనానికి డబ్బు సరిపోయేది. ఇవ్వకపోవడంతో చికిత్సకు ఆసక్తి చూపడంలేదు.