no clarity
-
డిజె టిల్లు 2 విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వని సిద్దు...
-
బతుకుబాటతో ఆట
రాయవరం (మండపేట): ప్రభుత్వం డీఎస్సీపై దోబూచులాడుతోందనే విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. పూటకో మాట..రోజుకో నిర్ణయంతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోందని శిక్షణ పొందిన నిరుద్యోగ బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు మండిపడుతున్నారు. డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు కచ్చితమైన షెడ్యూల్ ప్రకటించక పోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. వాయిదాలు పడుతూ వస్తున్న ప్రభుత్వ నిర్ణయంతో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న శిక్షణ పొందిన బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల్లో అసహనం పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే డీఎస్సీ అభ్యర్థులకు పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తామంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించారు. పరీక్ష నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేయాలని, ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించాలంటూ పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ వద్దు.. డీఎస్సీ–2018 నియామకం కోసం ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్లో పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో ఎస్జీటీ పరీక్షను ఆన్లైన్లో వారం రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. వారం రోజుల్లో ఒకరోజు సులభంగా, మరొక రోజు కఠినంగా పరీక్ష పేపర్ వస్తుందని గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థులు పేర్కొంటున్నారు. పరీక్ష పారదర్శకంగా జరిగినా కొంతమంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనే వాదన బలంగా విన్పిస్తోంది. డీఎస్సీ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించడం వల్ల అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. స్పష్టం చేయాలి డీఎస్సీ అభ్యర్థులకు పరీక్ష విధానం ఆన్‌లైనా, ఆఫ్‌లైనా అనేది ప్రభుత్వం ప్రకటించాలని నిరుద్యోగ బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. చాలామందికి ఆన్లైన్ విధానంపై పూర్తి అవగాహన లేదు. దీంతో కొంతమంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. జిల్లాలో సుమారు 50వేల మందికి పైబడి శిక్షణ పొందిన డీఎడ్, బీఎడ్, పండిట్, వ్యాయామ అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అసలే తగ్గిన పోస్టులతో తీవ్ర ఆందోళన పడుతున్న అభ్యర్థులు పరీక్షా విధానంపై స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో మరింత గందరగోళ పడుతున్నారు. -
అంకెలు గొప్పలు
-
నో క్లారిటీ...నో వర్క్
-
మహిళా రుణాలేవీ?
ప్రశ్నార్థకంగా మారిన వడ్డీలేని రుణాలు సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మౌనముద్ర దాల్చాయి. ఈ పథకం అమలు అవుతుందో లేదో తెలియక బ్యాంకులు మాత్రం మహిళల నుంచి మొత్తం వడ్డీని వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ప్రభుత్వం నుంచి వడ్డీ చెల్లింపులు ఆగిపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దాదాపు రూ.600 కోట్లు మహిళా సంఘాలకు చెల్లించాల్సి ఉంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం రూ.225 కోట్లు, ఆంధ్ర ప్రభుత్వం రూ. 375 కోట్లను ఇరు రాష్ట్రాల్లోని దాదాపు తొమ్మిది లక్షలకుపైగా సంఘాల్లోని సభ్యులకు చెల్లించాల్సి ఉన్నా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వడ్డీ లేని రుణాల పథకం కింద 2012 నుంచి మహిళలు కేవలం అసలు చెల్లిస్తే చాలని, వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా సంఘాలు చెల్లించాల్సిన వడ్డీని ముందుగానే ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేస్తుందని, అందువల్ల మహిళా సంఘాలు తాము తీసుకున్న అసలు చెల్లిస్తే చాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ బ్యాంకులు మహిళల నుంచి వడ్డీని వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని బ్యాంకులు తిరిగి మహిళా సంఘాల అకౌంట్లలో జమ చేస్తూ వస్తున్నాయి. వారు తీసుకున్న రుణ మొత్తాలకు ప్రతినెలా దాదాపు రూ. 100 కోట్ల నుంచి రూ.110 కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి వస్తోంది. మహిళా సంఘాలు ఠంచన్‌గా అసలుతోపాటు, వడ్డీ చెల్లిస్తున్నాయి. తెలంగాణలో దాదాపు 4.5 లక్షల సంఘాలు ఉంటే.. ఆంధ్రా ప్రాంతంలో 6.5 లక్షల సంఘాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని మహిళా సంఘాలు జూలై 20వ తేదీనాటికి చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ. 16వేలకోట్లకు పైగా ఉంది. -
తెలంగాణ బిల్లులో స్పష్టత లేని ఫైనాన్షియల్ మెమోరాండం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు- 2014 ప్రతులను బుధవారం ఉదయం లోక్‌సభ సభ్యులకు అధికారులు పంపిణీ చేశారు. తొలుత రాష్ట్రపతి ఆమోదం పొంది అసెంబ్లీ అభిప్రాయం కోసం వెళ్లిన బిల్లును యథాతథంగా ఉంచారు. అదనంగా ఫైనాన్షియల్ మెమోరాండం జతపరిచినప్పటికీ.. అందులో స్పష్టత లేదు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే కేంద్ర ఖజానాకు ఎంత ఖర్చవుతుందన్న అంశం ఈ ఫైనాన్షియల్ మెమోరాండంలో ఉండాలి. కానీ కేవలం ఆర్థిక సంఘం అంచనాల అనంతరమే ఆర్థిక సహాయం ఉంటుందని ఈ ఫైనాన్షియల్ మెమోరాండంలో పేర్కొన్నారు. 13వ ఆర్థిక కమిషన్ కేటాయించిన నిధులను జనాభా, ఇతర అంశాల ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు కేటాయిస్తామని బిల్లులోని 47వ క్లాజులో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటుకు కావాల్సిన నిధులు అంచనా వేస్తామని 95వ క్లాజులో పేర్కొన్నారు. కొన్ని శాఖలు, విభాగాల నిర్వహణకు కొద్దిపాటి పెంపు తప్ప సంచిత నిధినుంచి అదనపు వ్యయమేదీ ఉండదని అందులో తెలిపారు.