no friends
-
మోదీ ట్విట్టర్‌తో అమెరికా కటీఫ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్విట్టర్’లో భారత ప్రధాని మోదీతో స్నేహానికి ముగింపు పలికారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్న అధ్యక్షుడి నివాసమైన వైట్‌హౌస్ ట్విట్టర్లో మోదీని అన్‌ఫాలో చేసింది. రాష్ట్రపతి కోవింద్‌ను, ప్రధాని కార్యాలయం(పీఎంవో), అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని అనుసరించడం మానేసింది. కొన్ని రోజుల క్రితం వరకు మోదీసహా 19 మంది భారతీయులను ట్విట్టర్లో ఫాలో అయ్యేది. తాజాగా ఆ సంఖ్య 13కు పడిపోయింది. ఈ 13 మంది అమెరికా పరిపాలనతో సంబంధం ఉన్న భారతీయులు. వైట్‌హౌస్ ట్విట్టర్ ఖాతాను 2.1కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. మూడు వారాల క్రితం మోదీ వైట్‌హౌస్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్న తొలి ప్రపంచస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి వైట్‌హౌస్ మోదీ ట్విట్టర్ ఖాతాను అనుసరించడం ప్రారంభించింది. మోదీ ట్విట్టర్ ఖాతాను వైట్‌హౌస్ అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఎందుకు చేసిందన్న స్పష్టం కాకపోయినప్పటికీ అమెరికా–భారత్ మధ్య దెబ్బతిన్న బంధాలకు ఇదొక నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. -
నాకు సన్నిహితులు ఎవరూ లేరు: కాజల్
మూడు పదులు దాటిన ముద్దుగుమ్మల పట్టికలో నటి కాజల్‌అగర్వాల్ చేరింది. ఈమె ఇప్పుడు దక్షిణాదిలోని తమిళ, తెలుగు భాషల్లో అగ్రకథానాయకీ మణుల్లో ఒకరిగా రాణిస్తున్న నటి. అయితే తను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడిందనే చెప్పాలి. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే అపజయాలనుంచి విజయాల వైపు చేరుకున్న నాయకి కాజల్. అలా తన మైనస్‌లను ప్లస్‌లుగా మార్చుకుని నటనలో పరిణితి చెందిన కాజల్ ఇప్పుడు అగ్రనాయకులతో నటించే అవకాశాలను రాబట్టుకుంటోంది. ఆ మధ్య తెలుగులో చిరంజీవితో జత కట్టిన కాజల్‌అగర్వాల్‌కు తాజాగా కోలీవుడ్‌లో మరో బిగ్ ఛాన్స్ ఎదురుచూస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ లక్కీ హీరోయిన్ 33వ ఏటలోకి ప్రవేశించింది. మంగళవారం ఈ బ్యూటీ పుట్టిన రోజు. పలువురు సన్నిహితులు, సినీ ప్రముఖల శుభాకాంక్షలతో తడిసి ముద్దయిపోతున్న కాజల్‌అగర్వాల్‌తో కోలీవుడ్, టాలీవుడ్లో స్టార్ హీరోలందరితోనూ దాదాపు నటించేశారు. ఇంకా మీకు డ్రీమ్ పాత్ర అంటూ ఏదైనా ఉందా అన్న ప్రశ్నకు అలా ఏమీ ఫిక్స్ చేసుకోలేదు అని బదులిచ్చింది. ఒక నటిగా సినీరంగం నుంచి ఏం కోరుకుంటున్నారన్న ప్రశ్నకు కాజల్ ఎలాంటి పాత్ర అయినా చక్కగా నటించగలదు అనే పేరు తెచ్చుకోవాలనే నేను కోరుకునేది అని చెప్పింది. ఒక చిత్రాన్ని అంగీకరించే ముందు దాని కథ, తన పాత్రపై దృష్టి సారిస్తానంది. ఆ తరువాతే ఇతర విషయాల గురించి చర్చిస్తానని అంది. మీకు నచ్చిన హీరో, హీరోయిన్లు ఎవరన్న ప్రశ్నకు రజనీకాంత్, శ్రీదేవి అని టక్కున చెప్పింది. అయితే ఈ తరం నటీమణుల్లో నిత్యామీనన్ అంటే చాలా ఇష్టం అని పేర్కొంది. సరే చిత్రపరిశ్రమలో మీకు సన్నిహితులు ఎవరని అడగ్గా నిజం చెప్పాలంటే తనకు సినీరంగంలో సన్నిహితులంటూ ఎవరూ లేరని చెప్పింది. తన స్నేహితులందరూ ముంబయిలోనే ఉన్నారని కాజల్ అంటున్న కాజల్ ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్యారిస్ ప్యారిస్ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. ఇది హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. -
మిత్రులు లేకుంటే.. పొగ తాగినట్లే!
బోస్టన్: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అన్నాడో కవి. నిజమైన మిత్రులకు మించిన ఆస్తిలేదు. మంచి మిత్రుడు తోడుంటే ఆ ధైర్యమే వేరు. జీవితంలో మిత్రులు లేకున్నా.. ధూమపానం చేసినా.. శరీరానికి ఒకే రకమైన హాని కలుగుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఒంటరితనం వల్ల ఒత్తిడి పెరిగి రక్తంలో ఫైబ్రోనోజిన్ ప్రోటీన్ స్థాయి పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రోటీన్ రక్తంలో కొవ్వు పేరుకునేలా చేసి రక్తపోటును పెంచుతుంది. దీనివల్ల గుండెపోటుతో పాటు తదితర వ్యాధులు వస్తాయి. కుటుంబంలోని వ్యక్తులు, వారికున్న స్నేహితులను బట్టి వారి రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయిలకు ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐదుగురు స్నేహితులు ఉన్న వారి రక్తంలో ఫైబ్రోజన్ స్థాయి 10 మంది స్నేహితులు ఉండే వారిలో కన్నా 20 శాతం అధికంగా ఉంది. ఐదుగురి కన్నా తక్కువ మంది స్నేహితులు ఉన్నవారిలో ధూమపానం చేస్తే పెరిగే స్థాయిలో రక్తంలో ఫైబ్రోజన్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు అన్నారు. సమాజంతో మనకున్న సంబంధాలు రక్తంలో ఫైబ్రోజన్ స్థాయి పెరుగుదలకు మధ్య సంబంధాలు ఉంటాయిని పరిశోధకులు తెలిపారు. హార్వార్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం ఫలితాలను విడుదల చేశారు. -
నాకు స్నేహితులెవరూ లేరు: సోనాక్షి
షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా కూతురిగా బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేసిన సోనాక్షి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ప్రత్యేక ముద్ర వేసుకుంది. బాలీవుడ్లో అయితే ఆమె తెలియనివాళ్లు అంటూ ఎవరూ లేరు. కానీ, తనకు మాత్రం పరిశ్రమలో స్నేహితులు ఎవరూ లేరని చెబుతోంది. ఇప్పటివరకు తాను ఏ నటితోనూ కలిసి చేయలేదని, అందువల్ల హీరోయిన్లెవరూ తనకు స్నేహితులు కాలేదని అంటోంది. తానన్నీ సింగిల్ హీరోయిన్ పాత్రలే చేశానని, ఇతర హీరోయిన్లను ఎక్కడా అవార్డు కార్యక్రమాల్లో కూడా కలవలేదని తెలిపింది. మల్టీస్టారర్ చిత్రాలు చేయడం ఇష్టమేనా అని అడిగితే, అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, తాను త్వరలో చేస్తున్న 'యాక్షన్ జాక్సన్' మల్టీస్టారర్ చిత్రమేనని తెలిపింది. బాక్సర్ పాత్ర చేయబోతున్నందున అక్షయ్ కుమార్ తనను తీసుకెళ్లి బాక్సర్ విజేందర్ సింగ్‌ను పరిచయం చేశారని, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూసి నేర్చుకోవడానికి అది భలే ఉపయోగపడిందని వివరించింది.