నాకు స్నేహితులెవరూ లేరు: సోనాక్షి | No friends in the industry, says Sonakshi Sinha | Sakshi
Sakshi News home page

నాకు స్నేహితులెవరూ లేరు: సోనాక్షి

Published Sun, Jun 1 2014 2:21 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నాకు స్నేహితులెవరూ లేరు: సోనాక్షి - Sakshi

నాకు స్నేహితులెవరూ లేరు: సోనాక్షి

షాట్గన్ శత్రుఘ్న సిన్హా కూతురిగా బాలీవుడ్లోకి రంగప్రవేశం చేసిన సోనాక్షి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ప్రత్యేక ముద్ర వేసుకుంది. బాలీవుడ్లో అయితే ఆమె తెలియనివాళ్లు అంటూ ఎవరూ లేరు. కానీ, తనకు మాత్రం పరిశ్రమలో స్నేహితులు ఎవరూ లేరని చెబుతోంది. ఇప్పటివరకు తాను ఏ నటితోనూ కలిసి చేయలేదని, అందువల్ల హీరోయిన్లెవరూ తనకు స్నేహితులు కాలేదని అంటోంది.

తానన్నీ సింగిల్ హీరోయిన్ పాత్రలే చేశానని, ఇతర హీరోయిన్లను ఎక్కడా అవార్డు కార్యక్రమాల్లో కూడా కలవలేదని తెలిపింది. మల్టీస్టారర్ చిత్రాలు చేయడం ఇష్టమేనా అని అడిగితే, అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, తాను త్వరలో చేస్తున్న 'యాక్షన్ జాక్సన్' మల్టీస్టారర్ చిత్రమేనని తెలిపింది. బాక్సర్ పాత్ర చేయబోతున్నందున అక్షయ్ కుమార్ తనను తీసుకెళ్లి బాక్సర్ విజేందర్ సింగ్ను పరిచయం చేశారని, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూసి నేర్చుకోవడానికి అది భలే ఉపయోగపడిందని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement