నాకు సన్నిహితులు ఎవరూ లేరు: కాజల్‌ | No Friends In Cinema Industry : Kajal Agarwal | Sakshi
Sakshi News home page

నాకు సన్నిహితులు ఎవరూ లేరు: కాజల్‌

Published Wed, Jun 20 2018 1:07 PM | Last Updated on Tue, Oct 30 2018 6:01 PM

No Friends In Cinema Industry : Kajal Agarwal - Sakshi

మూడు పదులు దాటిన ముద్దుగుమ్మల పట్టికలో నటి కాజల్‌అగర్వాల్‌ చేరింది. ఈమె ఇప్పుడు దక్షిణాదిలోని తమిళ, తెలుగు భాషల్లో అగ్రకథానాయకీ మణుల్లో ఒకరిగా రాణిస్తున్న నటి. అయితే తను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడిందనే చెప్పాలి. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే అపజయాలనుంచి విజయాల వైపు చేరుకున్న నాయకి కాజల్‌. అలా తన మైనస్‌లను ప్లస్‌లుగా మార్చుకుని నటనలో పరిణితి చెందిన కాజల్‌ ఇప్పుడు అగ్రనాయకులతో నటించే అవకాశాలను రాబట్టుకుంటోంది. 

ఆ మధ్య తెలుగులో చిరంజీవితో జత కట్టిన కాజల్‌అగర్వాల్‌కు తాజాగా కోలీవుడ్‌లో మరో బిగ్‌ ఛాన్స్‌ ఎదురుచూస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ లక్కీ హీరోయిన్‌ 33వ ఏటలోకి ప్రవేశించింది. మంగళవారం ఈ బ్యూటీ పుట్టిన రోజు. పలువురు సన్నిహితులు, సినీ ప్రముఖల శుభాకాంక్షలతో తడిసి ముద్దయిపోతున్న కాజల్‌అగర్వాల్‌తో కోలీవుడ్, టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలందరితోనూ దాదాపు నటించేశారు. ఇంకా మీకు డ్రీమ్‌ పాత్ర అంటూ ఏదైనా ఉందా అన్న ప్రశ్నకు అలా ఏమీ ఫిక్స్‌ చేసుకోలేదు అని బదులిచ్చింది.

 ఒక నటిగా సినీరంగం నుంచి ఏం కోరుకుంటున్నారన్న ప్రశ్నకు కాజల్‌ ఎలాంటి పాత్ర అయినా చక్కగా నటించగలదు అనే పేరు తెచ్చుకోవాలనే నేను కోరుకునేది అని చెప్పింది. ఒక చిత్రాన్ని అంగీకరించే ముందు దాని కథ, తన పాత్రపై దృష్టి సారిస్తానంది. ఆ తరువాతే ఇతర విషయాల గురించి చర్చిస్తానని అంది. మీకు నచ్చిన హీరో, హీరోయిన్లు ఎవరన్న ప్రశ్నకు రజనీకాంత్, శ్రీదేవి అని టక్కున చెప్పింది. 

అయితే ఈ తరం నటీమణుల్లో నిత్యామీనన్‌ అంటే చాలా ఇష్టం అని పేర్కొంది. సరే చిత్రపరిశ్రమలో మీకు సన్నిహితులు ఎవరని అడగ్గా నిజం చెప్పాలంటే తనకు సినీరంగంలో సన్నిహితులంటూ ఎవరూ లేరని చెప్పింది. తన స్నేహితులందరూ ముంబయిలోనే ఉన్నారని కాజల్‌ అంటున్న కాజల్‌ ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్యారిస్‌ ప్యారిస్‌ అనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటిస్తోంది. ఇది హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్‌ చిత్రానికి రీమేక్‌ అన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement