no politics
-
ప్రచారం లేదు.. పోటీ లేదు!
‘‘నేను ఎన్నికల్లో ప్రచారం చేయను. పోటీ చేయను’’ అని బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ స్పష్టం చేశారు. ఇటీవల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటింగ్ అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని జాతీయ స్థాయిలో చాలామంది సెలబ్రిటీలకు ట్వీట్స్ చేశారు. అందులో ఒకరైన సల్మాన్ ‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఓటు హక్కు ఉన్న ప్రతి భారతీయుడు ఎలక్షన్స్‌లో పాల్గొనాలి. మంచి ప్రభుత్వం వచ్చే ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి’’ అని గురువారం ట్వీట్ చేశారు. అంతే.. దేశంలో ఎన్నికల ఫీవర్ ఫుల్‌గా ఉండటంతో సల్మాన్ ఏదో ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలు ఫైనల్‌గా సల్మాన్ చెవిలో పడ్డాయి. ‘‘ప్రచారంలో ఉన్నట్లుగా నేను ఎలక్షన్స్‌లో పోటీ చేయడం లేదు. అలాగే ఏ రాజకీయ పార్టీకీ మద్దుతుగా ప్రచారం కూడా చేయను’’ అని పేర్కొన్నారు సల్మాన్. ఇక సినిమాల విషయానికి వస్తే... సల్మాన్‌ఖాన్ తాజా చిత్రం ‘భారత్’ ఈ రంజాన్‌కు రిలీజ్ కానుంది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా తెరకెక్కనున్న సినిమా సెప్టెంబర్‌లో స్టార్ట్ కానుంది. 2020 రంజాన్‌కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రాజకీయాల్లోకి రాను!
న్యూఢిల్లీ: రెండు ప్రపంచకప్ ఫైనల్స్ (టి20, వన్డే)లో జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లాడిన భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆటకు తెరపడింది. ఇటీవలే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన గౌతీ ఆంధ్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో చివరి సారిగా బరిలోకి దిగాడు. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సెంచరీతో తన కెరీర్‌కు బైబై చెప్పాడు. అయితే రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్తల్ని 37 ఏళ్ల గంభీర్ కొట్టిపారేశాడు. మీడియాతో అతను మాట్లాడుతూ ‘అవన్నీ వదంతులే. నేను ట్విట్టర్ వేదికగా సామాజిక, వర్తమాన వ్యవహారాలపై చురుగ్గా స్పందించడం వల్లే బహుశా కొందరు రాజకీయాల్లోకి వస్తాడేమోనని అనుకోవచ్చు. కానీ నాకు ఆ ఆలోచన లేదు. నేను ఏ పార్టీలో చేరను, ఎన్నికల్లో పోటీ చేయను. నాకు క్రికెట్లోనే సుదీర్ఘ అనుభవం ఉంది. రాజకీయాలనేవి పూర్తిగా భిన్నం. ఆటతో అనుబంధం కొనసాగించాలంటే క్రికెట్ వ్యాఖ్యాతగా ఏసీ గదుల్లో కూర్చొని కామెంట్రీ చేయడం మాత్రమే కాదనేది నా అభిప్రాయం. నేనో ముక్కుసూటి మనిషిని. నన్నెవరూ క్రికెట్ సంఘంలో సభ్యుడిగా కోరుకోరు. కోచింగ్‌పై మాత్రం ఆసక్తి ఉంది. కొంత విశ్రాంతి తర్వాత యువకులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతా’ అని అన్నాడు. -
రాజకీయాల్లోకి మళ్లీ రాను..
రాజకీయాల్లోకి వచ్చి పొరపాటు చేశానని, రాజకీయాలు తనకు సరిపడవని తెలుసుకున్నాక వాటి నుంచి బయటపడ్డానని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 1984లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన అమితాబ్, మూడేళ్లకే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్న సంగతి తెలిసిందే. అప్పట్లోని తన భావోద్వేగాలు తనను రాజకీయాల వైపు నడిపించాయని, నిజ జీవితానికి, భావోద్వేగాలకు వ్యత్యాసం ఉంటుందని తర్వాత తెలుసుకున్నానని అన్నారు.