సీఎం ఏం మాయ చేశారో!
వచ్చే ఏడాది నుంచి కోతలుండవ్: హరీశ్‌రావు
సిద్దిపేట రూరల్: సీఎం కేసీఆర్ ఏం మాయ చేశారోగానీ, వచ్చే ఏడాది నుంచి రెప్పపాటు కూడా కరెంటు పోదని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వేసవిలోనే కరెంట్ కోతలు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని, ఇది సీఎం పట్టుదల, పాలనాదక్షతకు నిదర్శనమన్నారు.
వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌తోపాటు 24 గంటల సింగిల్ ఫేజ్‌లో నాణ్యమైన కరెంటు అందజేయనున్నట్టు తెలిపారు. గ్రామాల్లో ఎర్రబుగ్గలు లేకుండా విద్యుత్ వాడుకోవాలని, దీంతో కరెంటు ఆదాతోపాటు బిల్లు కూడా తగ్గుతుందన్నారు. మంచి నీటి కొరత తీర్చేందుకు ఫెయిర్వాల్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికీ నీటిని అందజేస్తామన్నారు.