No tension
-
పెన్షన్.. నో టెన్షన్
ముకరంపుర : ‘‘ఆసరా పథకం అమలులో ఆందోళన వద్దు. అర్హులందరికీ పెన్షన్ మంజూరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామ స్థాయిలో వచ్చిన పింఛన్ దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. పట్టణాలు, నగరాల్లో పూర్తికావాల్సి ఉంది. ఇప్పటివరకు 2,80,126 మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించాం. నగరాలు, పట్టణాల్లో నాలుగు రోజుల్లో తుది జాబితా సిద్ధం కానుంది. ఈనెల 15లోగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విచారణ, కంప్యూటరీకరణ పూర్తి చేసి అర్హుల గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు కసరత్తు చేస్తున్నాం. సాంకేతిక లోపాల వల్ల పింఛన్లు రాని వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అర్హతలున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టం..’’ అని డీఆర్డీఏ పీడీ విజయగోపాల్ ‘సాక్షి’తో వివరించారు. కచ్చితమైన అర్హులను గుర్తిస్తున్నాం... జిల్లాలో గతంలో అన్ని పింఛన్లు కలిపి 3,56,692 ఉండేవి. ఇటీవల పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం పెంచిన ప్రభుత్వం కొత్తగా లబ్దిదారులను ఎంపిక చేసేందుకు అర్జీలు స్వీకరిం చాం. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అర్హులు, అనర్హుల నుంచి దరఖాస్తులు రావడంతో నిబంధనల ప్రకారం కచ్చితమైన అర్హులను గుర్తిస్తున్నాం. ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతాల్లో సీలింగ్ రిజర్వేషన్ ప్రకారమే లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు వచ్చాయి. సమగ్ర కుటుంబ సర్వేలో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా నిజనిర్దారణ సర్టిఫికెట్లు కలిగిన అర్హులను గుర్తించాం. ప్రతి గ్రామంలో వృద్ధులు 5శాతం, వితంతువులు 5శాతం, వికలాంగులు 3శాతానికి మించకుండా లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలున్నాయి. గ్రామంలో వివిధ కేటగిరీల జనాభాను అనుసరించి ఎస్సీలు 80శాతం, ఎస్టీలు 75శాతం, బీసీలు 50శాతం, ఓసీలు 20శాతం మేర పింఛన్లు పొందేందుకు అర్హులుగా నిర్ణయిం చారు. క్షేత్రస్థాయిలో నిబంధనలు అనుకూలించకపోయినా అరులను గుర్తిస్తున్నాం. 5,57,057 దరఖాస్తులు జిల్లావ్యాప్తంగా పింఛన్ల కోసం 5,57,057 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతంలో వచ్చిన 4,73,487 దరఖాస్తుల విచారణ, కంప్యూటరీకరణ దాదాపు పూర్తయ్యింది. పట్టణ, నగర ప్రాంతంలో వచ్చిన 83,570 దరఖాస్తులపై విచారణ, కంప్యూటరీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతంలో 2,71,875 మందిని, పట్టణ ప్రాంతంలో 8751 మందిని కంప్యూటరీకరించి అర్హులుగా గుర్తించాం. పట్టణ ప్రాంతాల్లో విచారణ అనంతరం జిల్లావ్యాప్తంగా పింఛన్ లబ్దిదారుల సంఖ్య 3.10 లక్షలకు చేరే అవకాశాలున్నాయి. గతంలోని 3,56,692 మంది పెన్షన్ లబ్దిదారుల్లో అభయహస్తం పింఛనుదారులు 41,780 మంది, బోగస్ వికలాంగులు, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ కొంతమందిని మినహాయిస్తే ఇప్పుడు అర్హులయ్యే వారి సంఖ్య ఇంచుమించు అంతే ఉంటుందేమో.. మరోసారి దరఖాస్తుకు అవకాశం.. లబ్దిదారుల జాబితాను ఈనెల 15లోగా సిద్ధం చేయడానికి కసరత్తు చేస్తున్నాం. సమగ్ర సర్వేలో నమోదు కానివారు, తప్పుడు సమాచారం ఇచ్చినవారు, ఆధార్‌కార్డు లేనివారు, డాటాఎంట్రీలో తప్పుగా నమోదైన వారిని పునఃపరిశీలించి అర్హులుగా గుర్తించనున్నాం. జాబితాలో పేరులేని అర్హులు తిరిగి ఆర్డీవోలు, ఎంపీడీవోలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనికి తేదీలు ఇంకా నిర్ణయం కాలేదు కానీ.. పింఛన్ రాలేదని దరఖాస్తు చేసినవారందరి నుంచీ స్వీకరిస్తాం. అవసరమైతే ఐకేపీ సిబ్బందితో దరఖాస్తులు స్వీకరించి అర్హులకు న్యాయం చేస్తాం. రూ.23.86 కోట్ల అదనపు భారం గత ప్రభుత్వాలు వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు నెలకు రూ.200, వికలాంగులకు రూ.500 పింఛన్ ఇచ్చాయి. తెలంగాణ ప్రభ/త్వం ప్రకటించినట్లుగా ఈ పింఛన్లను రూ.1000, రూ.1500కు పెంచింది. ఇప్పటిదాకా ప్రతినెల పింఛన్ల రూపంలో నెలకు రూ.9.10 కోట్లు చెల్లించేవారు. ఇకపై ప్రతినెల రూ.32.96 కోట్లు చెల్లించనున్నారు. ఈ లెక్కన గతంతో పోలిస్తే ప్రభుత్వంపై ప్రతినెల రూ.23.86 కోట్ల అదనపు భారం పడుతోంది. సమగ్ర సర్వేలో కుటుంబాల సంఖ్య 12,35,851 గతంలో పింఛన్ల లబ్దిదారులు 3,56,692 కొత్తగా వచ్చిన దరఖాస్తులు 5,57,057 ఇప్పటివరకు అర్హులుగా గుర్తించినవి 2,80,026 పూర్తిస్థాయి విచారణ అనంతరం పెరిగేవి 25,000 -
నీటికి నో టెన్షన్
ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్‌కుమార్ సమ్మక్క-సారలమ్మ జారతకు వచ్చే భక్తుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని, జాతరలో నిరంతరం తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ వై.సురేష్‌కుమార్ తెలిపారు. కోటిమంది వస్తారన్న అంచనాతో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ఆయన పేర్కొన్నారు. చిలకలగుట్ట, శివరాంసాగర్, కన్నెపల్లి, కొత్తూరు, చింతల్, ఊరట్టం, నార్లాపూర్, జంపన్నవాగు బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో భక్తులు ఎక్కువగా బస చేసే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. జాతర సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. జాతరకొచ్చే భక్తులు నీటికోసం టెన్షన్ పడకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. నల్లాలకు, మరుగుదొడ్ల వద్ద ఉన్న నీటి టబ్‌లకు నిరంతరం నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జంపన్నవాగులో 9ఇన్‌ఫిల్టరేషన్ బావులు ఉండగా మరో రెండు కొత్తవి నిర్మిస్తున్నాం. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద కొత్తగా 52 కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మిస్తున్నాం. ఏర్పాటు చేసిన వాటికి ఇప్పటికే ట్రయల్న్ ్రనిర్వహించాం. భక్తుల తాగునీరు ఇబ్బందులు తీర్చేందుకు గతంలో ఉన్న 260కి అదనంగా మరో 63 నల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌కు నీటి సరఫరా కోసం 58గొట్టపు బావులతోపాటు మరో 20 కొత్తవి ఏర్పాటు చేస్తున్నాం. అక్కడి నుంచి 5హెచ్‌పీ పంపులతో నీరు అందిస్తాం. ఎక్కడైనా నీరు లభించేలా జాతీయ రహదారితోపాటు పస్రా-నార్లాపూర్-మేడారం వరకు చేతిపంపులు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే గతంలో 236 చేతిపంపులు ఉండగా ఈసారి మరో 45 కొత్తవి ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాక ఎక్కడైనా ఇబ్బందు లు తలెత్తి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా 50 ట్యాంకర్లను జాతర పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతున్నాం. మరుగుదొడ్ల నిర్మాణం గత జాతరలో 8800 మరుగుదొడ్లు ఏర్పాటు చేయ గా ఈసారి వాటి సంఖ్యను పదివేలకు పెంచాం. జాతీయ రహదారి వెంట ప్రతీ గ్రామ శివారులో మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం. ఆర్టీసీ బస్టాండ్, అలైటింగ్ పాయింట్, స్నానఘట్టాలు, పోలీస్ క్యాంపు, ఇంగ్లిషు మీడియం స్కూల్, హెలీప్యాడ్ తదితర ప్రాంతాల్లో పక్కా మరుగుదొడ్లు నిర్మించాలని జిల్లా యంత్రాంగం సూచించింది. వీటికి నిరంతరం నీటి సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా పైపులైన్లు నిర్మిస్తున్నాం. నిర్మించిన టాయిలెట్లను గుర్తించేందుకు ఈసారి జీపీఎస్ ద్వారా కోఆర్డినేట్స్(అక్షాంశాలు-రేఖాంశాలు ప్రకారం) గుర్తించి రికార్డు చేస్తున్నాం. ఈ వివరాలన్నీ అన్లైన్లో పెడుతున్నాం. ఆరు క్లస్టర్లుగా జాతర ప్రాంతం జాతర జరిగే ప్రాంతాలను ఆరు క్లస్టర్లుగా విభజించాం. ప్రతీ క్లస్టర్‌ను ఒక డీఈ పర్యవేక్షిస్తారు. ఆయన పరిధిలో ముగ్గురు ఏఈలు, ఒక పంపు మెకానిక్, ఒక ఎలక్ట్రీషియన్, ప్లంబర్ ఉంటారు. గతంలో తాగునీటికి, శానిటేషన్ పనులకు వేర్వేరుగా అధికారులు ఉండేవారు. ఈసారి ఈ రెండు విభాగాలను ఒకే అధికారి పర్యవేక్షిస్తారు. అలాగే జాతర జరిగే వారం రోజులపాటు ప్రత్యేకంగా ఓ మొబైల్ టీంను ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు మేడారంలో ఆర్టీసీ ఏర్పాటు చేయనున్న బస్టాండ్, అలైటింగ్ పాయింట్ ప్రాంతాల్లో రూ.15లక్షల వ్యయంతో 20వేల సామర్థ్యం కలిగిన రెండు గ్రౌండ్ లెవల్ స్టోరేజీ రిజర్వాయర్లు(జీఎల్ఎస్ఆర్) నిర్మించి వాటిచుట్టూ నల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇదే ప్రాంతంలో స్త్రీ, పురుషులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు కూడా నిర్మిస్తున్నాం. వీటి నిర్వహణకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తున్నాం. నిరంతరం పరీక్షలు, పర్యవేక్షణ సరఫరా చేసే తాగునీటిలో క్లోరిన్ కలుపుతాం. మరుగుదొడ్లకు ఉపయోగించే నీటిలోనూ క్లోరిన్ కలుపుతాం. క్లోరిన్ శాతాన్ని ప్రతి గంటకు పరీక్షించేందుకు సిబ్బందిని ఏర్పాటుచేస్తున్నాం. ఇతర జిల్లాల్లోని వాటర్ టెస్టింగ్ ల్యాబ్‌లలో పనిచేస్తున్న 150మంది టెక్నీషియన్ల సేవలను జాతరలో వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం జాతర పనులన్నీ హన్మకొండ ఈఈ శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జాతర గురించి వినడమే తప్ప ఎన్నడూ చూడలేదు. ఈసారి జాతరలో సేవ చేసే అదృష్టం దొరికినందుకు ఆనందంగా ఉంది.