nominations scrutiny
-
రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన..
-
‘బాఫ్తా’ నామినేషన్ల తుది జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’కు దక్కని చోటు
ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రతిష్ఠాత్మక ‘బాఫ్తా’ (బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డు కోసం లాంగ్లిస్ట్లో చేరిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్రకటించిన ‘బాఫ్తా’ తుది నామినేషన్ల జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి చోటు దక్కలేదు. రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ‘బాఫ్తా’ నాన్ ఇంగ్లిష్ లాంగ్లిస్ట్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. అయితే టాప్ 5తో కూడిన ఫైనల్ లిస్టులో స్థానం కోల్పోయింది. తుది నామినేషన్ల జాబితాలో ‘ఆల్ ౖక్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్, అర్జెంటీనా 1985, కోర్సేజ్, డెసిషన్ టు లీవ్, ద క్వయిట్ గర్ల్’ చిత్రాలు నిలిచాయి. కాగా ‘బెస్ట్ డాక్యుమెంటరీ’ విభాగంలో ఇండియన్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’కి నామినేషన్ దక్కింది. మొత్తం 24 విభాగాల్లో నామినేషన్లు ప్రకటించగా, భారతదేశం నుంచి ‘ఆల్ దట్ బ్రీత్స్’ మాత్రమే నామినేషన్ దక్కించుకుంది. షౌనక్ సేన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఫిబ్రవరి 19న ‘బాఫ్తా’ అవార్డుల వేడుక జరగనుంది. మరి.. ‘ఆల్ దట్ బ్రీత్స్’ అవార్డు కూడా గెలుచుకుంటుందా? చూడాలి. -
AP: ఆత్మకూరు ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి అయ్యింది. ఈ మేరకు వివరాలను వెల్లడించారు రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్. ఇవాళ(మంగళవారం) 28 నామినేషన్లకు స్క్రూట్ని ప్రక్రియ జరిగిందని, వివిధ కారణాల వల్ల 13 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఆత్మకూరు ఉపఎన్నికలో ప్రస్తుతానికి పదిహేను మంది ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఈ నెల 9వ తేదీ మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. చదవండి: రాజకీయాల్లో మచ్చలేని కుటుంబం అది! -
నామినేషన్లు ఓకే: ఈసీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రాజ్యసభకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ధ్రువీకరించారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించారు. నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని, వాటిని ఆమోదిస్తున్నామని భన్వర్ లాల్ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. తర్వాత ఎన్నికలపై అధికారిక ప్రకటన వెలువడనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వి.విజయసాయిరెడ్డి నామినేషన్ వేశారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థులుగా కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, కేంద్ర మంత్రి వై. సుజనాచౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి టీజీ వెంకటేష్ నామినేషన్లు వేశారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తరపున డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు నామినేషన్లు దాఖలు చేశారు.