పోలీసులు లేకపోయినా.. జరిమానా తప్పదు!
ద్విచక్ర వాహనాల మీద వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. పోలీసులు చూసినప్పుడు మాత్రమే పట్టుకుని ఫైన్ వేస్తారని ఇన్నాళ్లూ అనుకున్నా, ఇప్పుడు మరో కొత్త విధానం కూడా అమలులోకి వచ్చింది.
ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర మనం ఆగినప్పుడు.. ద్విచక్ర వాహనం మీద వెళ్తూ.. తలమీద హెల్మెట్ లేకపోతే సిగ్నళ్ల దగ్గరే ఉండే సీసీటీవీ కెమెరాలు మనల్ని ఫొటో తీస్తాయి. వాటి ద్వారా హెల్మెట్ ఈ-చలానా పంపాలని పోలీసులు నిర్ణయించారు. అది కూడా వందో, రెండు వందలో కాదు.. ఏకంగా రూ. 1500 వరకు ఫైన్ వేయాలని ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి, బండి మీద బయటకు వెళ్తుంటే మాత్రం హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోవద్దు!!