non-profit organizations
-
సోషల్ స్టాక్ ఎక్స్చేంజీలకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సోషల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎస్ఎస్ఈ)కి సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం విడుదల చేసింది. ఈ ఎక్సే్చంజీలో నమోదు చేసుకునేందుకు ఉండాల్సిన అర్హతా ప్రమాణాలు, వెల్లడించాల్సిన వివరాలు మొదలైన అంశాలను ఇందులో పొందుపర్చింది. లాభాపేక్ష లేని సంస్థలు (ఎన్పీవో) నిధులు సమీకరించుకునేందుకు అదనపు మార్గాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది జులైలో సెబీ కొన్ని నిబంధనలు ప్రతిపాదించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సమీకరించిన నిధుల వినియోగం గురించిన వివరాలను త్రైమాసికం ముగిసిన నాటి నుంచి 45 రోజుల్లోగా ఎస్‌ఎస్‌ఈకి ఎన్పీవో తెలియజేయాలి. అలాగే ఆర్థిక సంవత్సరం ముగిసిన 90 రోజుల్లోగా సదరు నిధుల వినియోగంతో సాధించిన సామాజిక ప్రయోజనాల వివరాలను (ఏఐఆర్)ను కూడా సమర్పించాలి. మరిన్ని వివరాలు .. ► చారిటబుల్ ట్రస్టుగా ఎన్పీవో నమోదై ఉండాలి. కనీసం మూడేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తుండాలి. క్రితం ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 10 లక్షల నిధులు సమీకరించుకుని, రూ. 50 లక్షల మేర వ్యయాలు చేసినదై ఉండాలి. ► అత్యధికంగా విరాళాలిచ్చిన టాప్ 5 దాతలు, ఇన్వెస్టర్ల వివరాలు వెల్లడించాలి. బడ్జెట్, కార్యకలాపాల స్థాయి, ఉద్యోగులు.. వాలంటీర్ల సంఖ్య, ప్రోగ్రామ్‌వారీగా నిధుల వినియోగం మొదలైనవి తెలియజేయాలి. ► నియంత్రణ సంస్థ నిర్దేశించిన 16 అంశాల్లో ఏదో ఒక దానిలో ఎన్పీవో కార్యకలాపాలు సాగిస్తున్నదై ఉండాలి. పేదరికం, అసమానతలు, పౌష్టికాహార లోపం మొదలైన వాటి నిర్మూలన, విద్య.. ఉపాధి కల్పనకు తోడ్పాటునివ్వడం మొదలైన అంశాలు వీటిలో ఉన్నాయి. ► అఫోర్డబుల్ హౌసింగ్ సంస్థలు తప్ప కార్పొరేట్ ఫౌండేషన్లు, రాజకీయ లేదా మతపర కార్యకలాపాలు సాగించే సంస్థలు, ట్రేడ్ అసోసియేషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే హౌసింగ్ కంపెనీలను సోషల్ ఎంటర్‌ప్రైజ్‌గా గుర్తించరు. స్టాక్ బ్రోకర్ల కట్టడికి నిబంధనలు.. క్లయింట్ల సెక్యూరిటీలు, నిధులను స్టాక్ బ్రోకర్లు దుర్వినియోగం చేయకుండా నివారించేందుకు సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం క్లయింట్ల డీమ్యాట్ ఖాతాల్లో నుంచి సెక్యూరిటీలను ట్రేడింగ్ మెంబరు పూల్ ఖాతాల్లోకి బదలాయించడాన్ని డిపాజిటరీలు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 25 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. -
విద్యార్థులకు కంటి పరీక్షలు
= దృష్టి లోపమున్న పిల్లలకు ఉచితంగా కంటి అద్దాలు = మంత్రి యు.టి.ఖాదర్ వెల్లడి సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించి, దృష్టి లోపాలున్న వారికి ఉచితంగా కంటి అద్దాలను అందజేయనున్నట్లు రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ వెళ్లడించారు. వరల్డ్ సైట్ డే సందర్భాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో గురువారం నిర్వహించిన వాకథాన్‌లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. కర్ణాటకను అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే ఐదేళ్ల వయస్సున్న చిన్నారులకు ఏడాదిలో రెండు సార్లు విటమిన్-ఎ ద్రావణాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని పాఠశాలల్లోని చిన్నారులకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించనుందని చెప్పారు. అంతేకాక దృష్టిలోపంతో బాధపడుతున్న వృద్ధులకు కూడా ఈ ఏడాది నుంచి ఉచితంగా కంటి అద్దాలను అందించనున్నట్లు మంత్రి ఖాదర్ వెళ్లడించారు. భారతదేశంలో ప్రస్తుతం 20శాతం మంది రెటినోపతి వ్యాధితో బాధపడుతున్నారని, సరైన ఆహార నియమాలు, తరచుగా కంటి పరీక్షలను చేయించుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.మదన్ గోపాల్, మింటో ఐ హాస్పిటల్ డెరైక్టర్ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవం.. ఉత్సాహం
సాక్షి, సిటీబ్యూరో/భోలక్‌పూర్, న్యూస్‌లైన్: నగరం ఉత్సవ శోభ సంతరించుకుంది. వినాయక చవితి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరంలో ఆబాలగోపాలాన్ని ఆనందింప చేసే అపురూప, అతిపెద్ద సామూహిక ఉత్సవాలు గణపతి నవరాత్రులే. ప్రత్యేకించి ‘గణపతి బప్పా మోరియా..’ అని స్మరిస్తూ ఆధ్యాత్మిక చైతన్యంతో ఊగిపోయే విద్యార్థులు, యువత ఉత్సాహానికి ఈ ఉత్సవాలు ప్రతీకగా నిలవనున్నాయి. ఇక, సోమవారం నాటి చవితి వేడుకల నిమిత్తం నగరవాసులు ఆదివారం తారస్థాయిలో కొనుగోళ్లు జరిపారు. ఫలాలు, పత్రి, పూలు ఇతర పూజా సామగ్రి అమ్మకాలు హోరెత్తాయి. కొనుగోలుదారులతో నగరం కిటకిటలాడింది. మండపాలకు విగ్రహాల తరలింపు పెద్ద ఎత్తున కొనసాగింది. మహానగరం పరిధిలోని కాలనీలు, బస్తీలు, వీధుల్లో ఈసారి 50 వేల నుంచి 80 వేల వరకు గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారని అంచనా. ఇళ్లలో ప్రతిష్ఠించేవి వీటికి అదనం. పర్యావరణ స్పృహ పెరగటంతో ఈసారి నగరవాసులు మట్టి ప్రతిమలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు వీటి పంపిణీపై శ్రద్ధపెట్టాయి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇళ్లలో పూజల నిమిత్తం 20 వేలు, మండపాల్లో ప్రతిష్ఠించేందుకు 150 (ఐదడుగుల) మట్టి విగ్రహాలను విక్రయించాయి. హెచ్ఎండీఏ చిన్నవి 30 వేలు, మూడడుగుల ఎత్తున్నవి 300 ప్రతిమలను విక్రయించింది. లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద 60 అడుగుల మట్టి వినాయక విగ్రహం ఆకట్టుకుంటోంది. నవరాత్రి పూజల అనంతరం అక్కడే నిమజ్జనం చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఇక 59 అడుగుల ఖైరతాబాద్ గణనాథుడు ఎలాగూ ప్రత్యేక ఆకర్షణే. పలుచోట్ల ఆకట్టుకునే రీతిలో, విభిన్న శైలిలో విగ్రహాలను రూపుదిద్దారు. ఆకర్షిస్తున్న మండపాలు గౌలిపురా, మెహిదీపట్నం, సైదాబాద్, పాతనగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న మండపాలను మహారాష్ట్ర, కోల్‌కతా నుంచి తరలి వచ్చిన కళాకారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తిరుమల తిరుపతి దేవస్థానం, పూరి గుడి, కేదార్నాథ్ జ్యోతిర్లింగం.. ఇలా దేశంలో ప్రముఖ ఆలయాలను పోలిన మండపాల డిజైన్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మరోపక్క హుస్సేన్‌సాగర్ నిమజ్జన ఘట్టానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది సాగర్‌లో 25 వేల నుంచి 30 వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని అంచనా. మూడో రోజైన బుధవారం నుంచే ఈ సందడి ప్రారంభమవుతుంది. ఈ లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. సాగర్ వద్ద, ఖైరతాబాద్ గణేషుడి వద్ద ఏర్పాట్లను మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఉత్సాహమే కానీ.. ధరలతో బెంబేలు భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి పండగ ఖర్చు భారంగానే పరిణమించనుంది. ఈసారి ఫలం, పత్రం, పుష్పం వంటి పూజా సామగ్రి ధరలు చుక్కలను తాకాయి. మంటపాల అలంకరణ, శోభాయాత్ర, పురోహితుడి సంభావనలు సైతం పెరిగాయి. మొత్తంగాగతేడాదితో పోలిస్తే అన్నింటి ధరలు సుమారు 50 శాతం పెరిగాయని మార్కెట్ వర్గాల అంచనా. పెరిగిన ధరలతో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, వినాయక మండపాల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. వినాయకుడి ప్రతిమల ధరలు ఈసారి భారీగా పెరిగాయి. ధూల్‌పేట, నాగోలు, ఉప్పల్, హయత్‌నగర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో రూ. 2 వేల నుంచి ప్రారంభమై రూ. లక్ష విలువచేసే విగ్రహాలు లభ్యమౌతున్నాయి. ఒకటిన్నర అడుగులుండే ప్రతిమ రూ.1500కు లభ్యమౌతుంది. ఐదారడుగులు మించితే ధర వేలల్లోనే.