nonstop
-
కర్నూలు-హైదరాబాద్ మధ్య నాన్‌స్టాప్ బస్సులు
కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు-హైదరాబాద్ మధ్య నాన్‌స్టాప్ బస్సులు నడుపుతున్నట్లు రోడ్డు రవాణా సంస్థ కర్నూలు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పి.ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన కొత్త బస్టాండ్‌లోని ఏటీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో తెల్లవారు జామున(సర్వీసు నంబర్ 6281) 5:30గంటలకు, ఉదయం 7:45 (నంబర్ 6289), 8 గంటలకు(51618), సాయంత్రం 5:30గంటలకు (6282), 6:30 గంటలకు(6284) సూపర్ లగ్జరీ బస్సులను.. సాయంత్రం 6గంటలకు (51602) ఇంద్ర ఏసీ బస్సును నాన్‌స్టాప్‌గా హైదరాబాద్‌కు నడుపుతామన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కర్నూలుకు ఉదయం 11:15(51103), మధ్యాహ్నం 1 గంటకు(51105), 1:30కి సూపర్ లగ్జరీ సర్వీసులు నాన్‌స్టాప్‌గా ఉంటాయన్నారు. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్నూలుకు వచ్చే బస్సు సర్వీసులను నగర శివారులోని నంద్యాల చెక్‌పోస్టు వరకు పొడిగించామన్నారు. హైదరాబాద్‌లో రాత్రి 10.30గంటలకు అల్ట్రా డీలక్స్ (51149), 11.55 గంటలకు (15110), 12.30గంటలకు (51626), అర్ధరాత్రి ఒంటి గంటకు (51607), 1.30గంటలకు (51137) సూపర్ లగ్జరీ సర్వీసులు.. తెల్లవారుజామున 3.30గంటలకు (6393) అల్ట్రా డీలక్స్ బస్సుల్లో ప్రయాణిస్తే ఈ అవకాశం ఉంటుందన్నారు. రాత్రి వేళల్లో రాజ్‌విహార్, బుధవారపేట, ప్రభుత్వ ఆసుపత్రి(కలెక్టరేట్), గాయత్రి ఎస్టేట్, మద్దూరు నగర్, సీ.క్యాంప్, మాధవీ నగర్, నంద్యాల చెక్‌పోస్టు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆటోల కొరత, అధిక చార్జీ వసూలు తదితర సమస్యలు ఎదుర్కొంటున్న దృష్టా్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీటిలో ప్రయాణానికి ఆన్లైన్ అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ బస్సులు
– పలు సర్వీసులు నంద్యాల చెక్‌పోస్టు వరకు పొడగింపు కర్నూలు(రాజ్‌విహార్): హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ బస్సులు నడుపుతున్నట్లు రోడ్డు రవాణ సంస్థ కర్నూలు–1డిపో మేనేజరు షేక్. అజ్మతుల్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్నూలుకు వచ్చే బస్సు సర్వీసులను నగర శివారులోని నంద్యాల చెక్‌పోస్టు వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. రాత్రి వేళల్లో రాజ్‌విహార్, బుధవారపేట, ప్రభుత్వ ఆసుపత్రి, గాయత్రి ఎస్టేట్, మద్దూరు నగర్, సీ.క్యాంప్, మాధవీ నగర్, నంద్యాల చెక్‌పోస్టు తదితర ప్రాంతాల వెళ్లే ప్రయాణికులకు ఆటో లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం వీటిని పొడగించినట్లు వెల్లడించారు. నాన్‌స్టాప్ బస్సుల వేళలు.. సూపర్ లగ్జరీ: తెల్లవారు జామున 05:30గంటలకు, ఉదయం 07:45 , 8గంటలకు, సాయంత్రం 05:30గంటలకు, 6:30గంటలకు సాయంత్రం 6గంటలకు ఇంద్ర ఏసీ బస్సు, హైదరాబాద్ నుంచి కర్నూలుకు నాన్‌స్టాప్ సూపర్ లగ్జరీ సర్వీసులు ఉదయం 11:15 , మధ్యాహ్నం 1గంటకు, 1:30కి నడుపుతున్నట్లు చెప్పారు. – నంద్యాల చెక్‌పోస్టు వరకు పొడిగించిన బస్సులు రాత్రి 10:30గంటలకు అల్ట్రా డీలక్స్, 11:55గంటలకు , 12:30గంటలకు, అర్ధరాత్రి ఒంటి గంటకు , 1:30గంటలకు సూపర్ లగ్జరీ సర్వీసులు, తెల్లవారుజామున 3:30గంటలకు అల్ట్రా డీలక్స్ బస్సులను నంద్యాల చెక్‌పోస్టు వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. -
ఎడతెరిపి లేని వాన
బెజ్జూర్ : బెజ్జూర్ మండలంలో గత రెండు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. సోమవారం 11 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రామాలకు వెళ్లే మార్గాల్లో ఉన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువుల్లో నీరు చేరి నిండు కుండను తలపిస్తున్నాయి. మండలంలో సాదారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.