హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ బస్సులు
– పలు సర్వీసులు నంద్యాల చెక్‌పోస్టు వరకు పొడగింపు
కర్నూలు(రాజ్‌విహార్): హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ బస్సులు నడుపుతున్నట్లు రోడ్డు రవాణ సంస్థ కర్నూలు–1డిపో మేనేజరు షేక్. అజ్మతుల్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్నూలుకు వచ్చే బస్సు సర్వీసులను నగర శివారులోని నంద్యాల చెక్‌పోస్టు వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. రాత్రి వేళల్లో రాజ్‌విహార్, బుధవారపేట, ప్రభుత్వ ఆసుపత్రి, గాయత్రి ఎస్టేట్, మద్దూరు నగర్, సీ.క్యాంప్, మాధవీ నగర్, నంద్యాల చెక్‌పోస్టు తదితర ప్రాంతాల వెళ్లే ప్రయాణికులకు ఆటో లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం వీటిని పొడగించినట్లు వెల్లడించారు.
నాన్‌స్టాప్ బస్సుల వేళలు..
సూపర్ లగ్జరీ: తెల్లవారు జామున 05:30గంటలకు, ఉదయం 07:45 , 8గంటలకు, సాయంత్రం 05:30గంటలకు, 6:30గంటలకు
సాయంత్రం 6గంటలకు ఇంద్ర ఏసీ బస్సు, హైదరాబాద్ నుంచి కర్నూలుకు నాన్‌స్టాప్ సూపర్ లగ్జరీ సర్వీసులు ఉదయం 11:15 , మధ్యాహ్నం 1గంటకు, 1:30కి నడుపుతున్నట్లు చెప్పారు.
– నంద్యాల చెక్‌పోస్టు వరకు పొడిగించిన బస్సులు
రాత్రి 10:30గంటలకు అల్ట్రా డీలక్స్, 11:55గంటలకు , 12:30గంటలకు, అర్ధరాత్రి ఒంటి గంటకు , 1:30గంటలకు సూపర్ లగ్జరీ సర్వీసులు, తెల్లవారుజామున 3:30గంటలకు అల్ట్రా డీలక్స్ బస్సులను నంద్యాల చెక్‌పోస్టు వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.