కర్నూలు-హైదరాబాద్ మధ్య నాన్‌స్టాప్ బస్సులు
Published Sat, Oct 15 2016 12:14 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు-హైదరాబాద్ మధ్య నాన్‌స్టాప్ బస్సులు నడుపుతున్నట్లు రోడ్డు రవాణా సంస్థ కర్నూలు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పి.ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన కొత్త బస్టాండ్‌లోని ఏటీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో తెల్లవారు జామున(సర్వీసు నంబర్ 6281) 5:30గంటలకు, ఉదయం 7:45 (నంబర్ 6289), 8 గంటలకు(51618), సాయంత్రం 5:30గంటలకు (6282), 6:30 గంటలకు(6284) సూపర్ లగ్జరీ బస్సులను.. సాయంత్రం 6గంటలకు (51602) ఇంద్ర ఏసీ బస్సును నాన్‌స్టాప్‌గా హైదరాబాద్‌కు నడుపుతామన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కర్నూలుకు ఉదయం 11:15(51103), మధ్యాహ్నం 1 గంటకు(51105), 1:30కి సూపర్ లగ్జరీ సర్వీసులు నాన్‌స్టాప్‌గా ఉంటాయన్నారు. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్నూలుకు వచ్చే బస్సు సర్వీసులను నగర శివారులోని నంద్యాల చెక్‌పోస్టు వరకు పొడిగించామన్నారు. హైదరాబాద్‌లో రాత్రి 10.30గంటలకు అల్ట్రా డీలక్స్ (51149), 11.55 గంటలకు (15110), 12.30గంటలకు (51626), అర్ధరాత్రి ఒంటి గంటకు (51607), 1.30గంటలకు (51137) సూపర్ లగ్జరీ సర్వీసులు.. తెల్లవారుజామున 3.30గంటలకు (6393) అల్ట్రా డీలక్స్ బస్సుల్లో ప్రయాణిస్తే ఈ అవకాశం ఉంటుందన్నారు. రాత్రి వేళల్లో రాజ్‌విహార్, బుధవారపేట, ప్రభుత్వ ఆసుపత్రి(కలెక్టరేట్), గాయత్రి ఎస్టేట్, మద్దూరు నగర్, సీ.క్యాంప్, మాధవీ నగర్, నంద్యాల చెక్‌పోస్టు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆటోల కొరత, అధిక చార్జీ వసూలు తదితర సమస్యలు ఎదుర్కొంటున్న దృష్టా్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీటిలో ప్రయాణానికి ఆన్‌లైన్ అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Advertisement