North korean leader kim jong un
-
కిమ్ అంటే అట్లుంటది! కొత్త ఏడాది తొలిరోజునే కీలక ప్రకటన
ప్యొంగ్యాంగ్: మిరుమిట్లు గొలిపే బాణసంచా, విద్యుత్తు దీపాల కాంతులతో ప్రపంచం మొత్తం కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. అయితే, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన రూటే సపరేట్ అని మరోమారు చాటుకున్నారు. తూర్పు జలాల్లోకి బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారం జరిగిన అధికార పార్టీ సమావేశంలో కీలక ప్రకటన చేశారు కిమ్. దేశంలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే శక్తిమంతమైన ఖండాంతర క్షిపణులు ఐసీఎంబీలను తయారు చేస్తామని తెలిపారు. అమెరికా సహా ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠపరుస్తామని స్పష్టం చేశారు. పరోక్షంగా అమెరికా, దక్షిణ కొరియాలపై విమర్శలు గుప్పించారు. మరోవైపు.. వేగవంతమైన, ప్రతీకార దాడి సామర్థ్యంతో కూడిన కొత్త తరం ఖండాంతర బాలిస్టిక్ మిసైల్‌ను తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలాగే.. తొలి స్పై శాటిలైట్‌ను త్వరలోనే ప్రయోగించే యోచనలో కిమ్ ఇన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: కాబూల్ ఆర్మీ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి -
కిమ్ జోంగ్ (ఉ.కొరియా అధ్యక్షుడు).. రాయని డైరీ
సౌత్ పాయాంగన్ ప్రావిన్సులో కాలి నడకన ఉన్నాం నేను, నా సొదరి కిమ్ యో జోంగ్. అంతకు క్రితమే ఎరువుల ప్లాంట్‌కి నేను రిబ్బన్ కట్ చేశాను. అయితే అది రిబ్బన్ని కట్ చేసినట్లుగా లేదు. పొడవైన వెడల్పాటి పల్చటి తివాచీని అడ్డంగా కట్టి, చేతికి చిన్న కత్తెర ఇచ్చారు. చేతికది ఆరో వేలులా ఉంది తప్ప కత్తెరలా లేదు. ‘‘నా సోదరి కిమ్ యో జోంగ్కి ఇవ్వండి. తనైతే తన సున్నితమైన వేళ్లతో ఒడుపుగా కత్తిరించగలదనే అనుకుంటున్నాను’’ అన్నాను ఆ ప్లాంటు వాళ్లతో.. రిబ్బన్ కటింగ్‌కి ముందు. ‘‘మీరైతే బాగుంటుంది’’ అన్నారు వాళ్లు! నా సోదరి ఉత్తర కొరియా అధ్యక్షురాలిగా ఉండి, నేను తన పక్కన ఒక సోదరుడిగా మాత్రమే ఉండి ఉంటే అప్పుడు రిబ్బన్ కట్ చేయమని నా సోదరికి కత్తెర ఇచ్చి ఉండేవాళ్లు కావచ్చు. వాళ్లకు కావలసింది అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు. అంతే తప్ప అన్నా చెల్లెళ్లు కాదు. కిమ్ జోంగ్ ఉన్ గానీ, కిమ్ యో జోంగ్ గానీ కాదు. అదే మాట నా సోదరితో అన్నాను. నవ్వింది. ‘‘కిమ్, ఈ ఎరువుల ప్లాంటువాళ్లకే కాదు, ఉత్తర కొరియా ప్రజలకు కూడా నువ్వో, నేనో కాదు కావలసింది. ఒక అధ్యక్షుడు. లేదా అధ్యక్షురాలు. మూడు వారాలు అయింది నువ్వు ఉత్తర కొరియా ప్రజలకు కనిపించక. వాళ్లేమీ కంగారు పడలేదు. నీ తర్వాత నేనే అంటున్నారు తప్ప, నువ్వు కనిపించడం లేదేమిటని నన్ను కూడా అడగడం లేదు’’ అని ఆశ్చర్యపడింది నా సోదరి. ఉత్తర కొరియా ప్రజలు కిమ్‌ని పట్టించుకోవడం లేదంటే ఉత్తర కొరియాను ఇంకెవరో పట్టించుకుంటున్నట్లు! ఎవరై ఉంటారు? దక్షిణ కొరియా? అమెరికా? అమెరికా అయితే అయి ఉండదు. నేను కనిపించనప్పటి నుంచీ నన్ను పట్టించుకుంటూనే ఉన్నాడు ట్రంప్. ‘కిమ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు కానీ నేను చెప్పను’ అని, కిమ్ ఎలా ఉన్నాడో నాకు తెలుసు కానీ నేను చెప్పను’ అని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. ఉత్తర కొరియా ప్రజలే.. ఏంటట? ఎవరట? అని అస్సలు పట్టనట్లే ఉండిపోయారు. మనిషి పోవడం అంటే డెడ్ అయ్యాడనో, బ్రెయిన్ డెడ్ అయిందనో కాదు. మనుషులకు పట్టకపోవడం. ‘‘ఏంటి కిమ్ ఆలోచిస్తున్నావు?’’ అంది నా సోదరి. ‘‘ఏం లేదు. ట్రంప్ మీద నాకు గౌరవ భావన కలుగుతోంది. నేననుకోవడం.. ఇన్నాళ్లూ నేను ఉండే ఉంటానని అనుకుని నాతో మాట్లాడేందుకు అనేకసార్లు ప్రయత్నించి ఉంటాడనీ, ఇప్పుడు ఉన్నానని తెలిసింది కాబట్టి నేను తనతో మాట్లాడ్డం కోసం ఎదురుచూస్తూ ఉండి ఉంటాడనీ..’’ అన్నాను. ‘‘నిజమే’’ అంది నా సోదరి. ‘‘ట్రంప్‌కి ఫోన్ చేసి మాట్లాడు కిమ్.. బాగుంటుంది’’ అని కూడా అంది. మరికొంత దూరం నడిచాం. నాతోపాటు మూడు వారాలుగా నా సోదరీ వాకింగ్ చేస్తూనే ఉంది. వెయిట్ తగ్గాలన్న విల్ పవర్‌ని నాలో తగ్గకుండా చూసేందుకు! ఎంతైనా నా సోదరి. ఒకరి కోసం ఒకరు ఎవరు నడుస్తున్నారిప్పుడు! ట్రంప్‌కు ఫోన్ చేయబోయాను. ట్రంప్ నుంచే కాల్! ట్రంప్ పెద్దగా ఇంగ్లిష్‌లో నవ్వుతున్నాడు. ‘‘కిమ్.. కిమ్‌లా ఉండాలి కిమ్ బ్రో..’’ అంటున్నాడు. ‘‘అవును. కొంచెం లాగేశాను కదా. డబుల్ చిన్ పోయింది. పొట్ట లోపలికి పోయింది. చూసే వుంటావ్ రిబ్బన్ కటింగ్ ఫొటోలో..’’ అన్నాను. ‘‘చూశాను బ్రో. అందుకే అంటున్నా.. కిమ్ కిమ్‌లా ఉండాలని. న్యూక్లియర్ ప్లాంట్‌కి రిబ్బన్ కట్ చేయవలసినవాడు, ఫెర్టిలైజర్ ఫ్లాంట్కి కట్ చేయడం ఏంటి!!’’ అన్నాడు.. మళ్లీ పెద్దగా నవ్వుతూ. -
మృత్యు బేహారి...
తండ్రి చనిపోయాక 2011లో వారసత్వంగా ఉత్తరకొరియా సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన కిమ్ జాంగ్ ఉన్ నిరంకుశుడిగా పేరుపడ్డారు. విలాసవంతమైన జీవితం గడిపే ఈ నియంతకు అభద్రతాభావం ఎక్కువ. అనుమానం పాలూ ఎక్కువే. తన అధికారాన్ని ఎవరు ప్రశ్నించినా, ఎదురు మాట్లాడినా సహించలేడు. ఎవరినీ నమ్మని ఈయన తన మంత్రివర్గంలోని పలువురని, సీనియర్ మిలటరీ అధికారులను దారుణంగా చంపించాడు. అధికారిక సమావేశాల్లో నిద్రపోయాడని, నిర్లక్ష్య ధోరణిలో కూర్చున్నాడని, అధినేత పట్ల అగౌరవం చూపాడని... ఇలా ఎన్నో కారణాలు. ఆయనకు కోపం వచ్చిందంటే అవతలివాడి ప్రాణాలు గాల్లో కలిసినట్లే. ఆఖరికి భార్య మాజీ కోలిగ్స్‌ను కూడా చంపించివేశాడు. ఉత్తరకొరియాకు తానే తిరుగులేని నేతనని చాటేందుకు కూడా కొందరిని హతమార్చాడు. దేశ రాజకీయాలపై, అధికారంపై ఏమాత్రం ఆసక్తి లేని, ఎక్కడో మకావులో జీవిస్తున్న సోదరుడు (మరో తల్లికి జన్మించారు) కిమ్ జాంగ్ నామ్ కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలో మంగళవారం విషప్రయోగం ద్వారా హత్యకు గురయ్యాడు. దీని వెనుక కూడా కిమ్ జాంగ్ ఉన్ హస్తం ఉందనే అనుమానాలున్నాయి. ఉన్ అధికారం చేపట్టిన ఐదేళ్లలో 300 మంది పైచిలుకు మరణదండనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఉత్తరకొరియా నియంత చేసిన కిరాతకాల్లో కొన్ని... జాంగ్ సాంగ్ తయెక్: ఉన్ మేనత్త కిమ్ కియాంగ్ హుయ్‌ని పెళ్లాడిన తయెక్ ఉత్తరకొరియా ప్రభుత్వంలో రెండోస్థానంలో ఉండేవారు. జాతీయ డిఫెన్స్ కమీషన్ వైస్–చైర్మన్‌గా కీలక పదవిలో ఉన్న ఈయన పాలనలో అనుభవం లేని ఉన్‌కు మార్గదర్శకుడిగా వ్యవహరించారు. 2013 డిసెంబరులో ప్రభుత్వాన్ని కూల్చడానికి, తిరుగుబాటుకు కుట్ర చేస్తున్నాడనే ఆరోపణలతో మిలటరీ కోర్టులో విచారించి కాల్చి చంపారు. తర్వాత తయెక్ సోదరిని, ఆమె భర్తను, వీరి కుమారుడిని, సోదరి భర్త తమ్ముడిని కూడా కడతేర్చారు. చివరకు మేనత్త హుయ్‌ని కూడా వదలకుండా నిర్ధయగా చంపించి వేశాడు. చోయ్ యాంగ్ గోన్ (వైస్ ప్రీమియర్): అధినేత అటవీ పాలసీతో విభేదించినందుకు మే, 2015లో ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియాతో మంచి సంబంధాలు కలిగిన ఈయనకు కొద్దినెలల కిందటే వైస్ ప్రీమియర్‌గా ప్రమోషన్ ఇచ్చి దయాదికి సానుకూల సంకేతాలు పంపిన ఉన్ తర్వాత కొంతకాలానికే ఆగ్రహించారు. కిమ్ యాంగ్ జిన్ (వైస్ ప్రీమియర్– విద్య): పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఫైరింగ్ స్క్వాడ్‌తో 2016 ఆగష్టులో కాల్చి చంపించారు. అసలు కారణం మాత్రం పార్లమెంటు సమావేశాల్లో సరిగా కూర్చొలేదని, నిర్లక్ష్యధోరణిలో ఆసీనుడయ్యాడని కిమ్ జిన్‌పై ఉత్తరకొరియా నియంతకు కోపం వచ్చిందట. హ్యోన్ యాంగ్ చోల్ (రక్షణ మంత్రి): ఉన్ హాజరైన ఒక మిలటరీ పరేడ్‌లో కునుకు తీస్తూ కెమెరాలకు చిక్కాడు. చోల్ తనకు సన్నిహితుడైనప్పటికీ ఉన్ దయ చూపలేదు. ప్యాంగ్యాంగ్కు సమీపంలోని మిలటరీ అకాడమీలో వందలాది మంది చూస్తుండగా ఏప్రిల్ 30, 2015న చోల్‌ను యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌తో కిరాతకంగా కాల్చి చంపించాడు. నిజానికి పలు విధానపరమైన నిర్ణయాలతో విబేధించినందుకే చోల్ ప్రాణాలు తీశారని కొన్ని వార్తా సంస్థలు రాశాయి. రి యాంగ్ హో (ఆర్మీ చీఫ్): కొరియా వర్కర్స్ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఈయన 2012లో కాల్పుల్లో చనిపోయారు. అనారోగ్యం కారణంగా యాంగ్ హోను అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు మాత్రమే ఉత్తరకొరియా ప్రకటించింది. అయితే అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన క్రమంలో ప్రతిఘటించిన హో సైనిక బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో చనిపోయారని వార్తలు వచ్చాయి. జనరల్ పియాన్ ఇన్ సన్ (ఆర్మీ ఆపరేషన్స్ హెడ్): తన అభిప్రాయాలతో విబేధించినందుకు ఈయన్ను కాల్చి చంపారు. ఇవి కాకుండా దక్షిణ కొరియా టీవీ సీరియల్స్‌ను చూశారని, ఇతరత్రా చిన్నచిన్న కారణాలతో కిమ్ జాంగ్ ఉన్ 100 మందికి పైగా సైనిక సిబ్బందిని (ఇందులో వివిధ హోదాలో ఉన్న వారు ఉన్నారు) చంపేశారని దక్షిణకొరియా నిఘావర్గాల అంచనా. వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించినపుడు అక్కడ సాకుతున్న తాబేళ్లు ఎందుకు చనిపోతున్నాయని ఉన్ ప్రశ్నించగా పాపం అక్కడి కేర్‌టేకర్ సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అంతే అతని ప్రాణాలు పోయాయి. ఉన్హాసు ఆర్కెస్ట్రాలోని నలుగురిని పొట్టనబెట్టుకున్నాడు. వాళ్లు చేసుకున్న పాపమేమిటంటే... ఉన్ భార్య రి సోజుకు ఒకప్పుడు కోలిగ్స్ కావడమే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్