Northern Knights
-
6,6,6,6,6,6
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ దేశవాళీ టి20 టోర్నీ ‘సూపర్ స్మాష్’లో భాగంగా ఆదివారం క్యాంటర్బరీ కింగ్స్, నార్తర్న్ నైట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. క్యాంటర్బరీ కింగ్స్ బ్యాట్స్‌మన్ లియో కార్టర్ ఒకే ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టాడు. క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. నార్తర్న్ నైట్స్ జట్టు స్పిన్నర్ ఆంటోన్ డెవ్రిచ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కార్టర్ ‘ఆరే’శాడు. కార్టర్ విధ్వంసంతో (29 బంతుల్లో 70 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఈ మ్యాచ్‌లో క్యాంటర్బరీ కింగ్స్ జట్టు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. అన్ని ఫార్మాట్లలో ఒకే ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన ఏడో బ్యాట్స్‌మన్‌గా కార్టర్ గుర్తింపు పొందాడు. గతంలో గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (భారత్), హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), యువరాజ్ (భారత్), వైట్లీ (ఇంగ్లండ్), హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) ఈ ఘనత సాధించారు. –సోబర్స్ (కౌంటీ క్రికెట్లో), రవిశాస్త్రి (రంజీ ట్రోఫీ) ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో... గిబ్స్ అంతర్జాతీయ వన్డే (2007 వరల్డ్ కప్) మ్యాచ్‌లో, యువరాజ్ (2007 వరల్డ్ కప్) అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో... వైట్లీ (నాట్‌వెస్ట్ ట్రోఫీ), హజ్రతుల్లా (అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్), కార్టర్ (సూపర్ స్మాష్ టోర్నీ) దేశవాళీ టి20 క్రికెట్లో ఈ ఘనత నమోదు చేశారు. -
వారెవ్వా... విలియమ్సన్!
49 బంతుల్లో 101 నాటౌట్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలోనార్తర్న్ డిస్ట్రిక్ట్స్ విజయం ఓడిన కేప్ కోబ్రాస్ చాంపియన్స్ లీగ్ టి20 రాయ్‌పూర్: చాంపియన్స్ లీగ్ టి20లో ఓపెనర్ కేన్ విలియమ్సన్ (49 బంతుల్లో 101 నాటౌట్: 8 ఫోర్లు; 5 సిక్సర్లు) చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలోనే తొలిసారిగా వేగవంతమైన సెంచరీతో అదరగొట్టడంతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 33 పరుగుల తేడాతో కేప్ కోబ్రాస్‌పై నెగ్గింది. శుక్రవారం ఇక్కడి షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రస్తుత సీజన్లో విలియమ్సన్‌దే తొలి సెంచరీ కావడంతో పాటు అతడి కెరీర్లోనూ ఇదే మొదటిది. ఈ కివీస్ స్టార్ తన ఇన్నింగ్స్‌లో కేవలం ఏడు బంతులనే వదిలేశాడు. మరో ఓపెనర్ డెవిసిచ్ (46 బంతుల్లో 67; 8 ఫోర్లు; 1 సిక్స్), వాట్లింగ్ (20 బంతుల్లో 32; 3 ఫోర్లు; 1 సిక్స్) మెరుగ్గా రాణించారు. లాంగెవెల్ట్, ఫిలాండర్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేప్ కోబ్రాస్ ఇన్నింగ్స్ 7.2 ఓవర్లలో 44/2 స్కోరు వద్ద భారీ వర్షం పడి మ్యాచ్‌కు వీలు కాలేదు. ఆ సమయంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన కోబ్రాస్ 77 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌ను విజేతగా ప్రకటించారు. విలియమ్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. విలియమ్సన్ దూకుడు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నార్తర్న్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ కేన్ విలియమ్సన్ పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ డెవిసిచ్ కూడా ఇదే ఆటతీరును చూపడంతో కోబ్రాస్ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. ప్రతీ ఓవర్లో కనీసం ఓ బౌండరీ ఉండేట్టు చూసుకున్న ఈ జోడి 11 ఓవర్లలో జట్టు స్కోరును 107 పరుగులకు చేర్చింది. అయితే 14వ ఓవర్లో డెవిసిచ్ రనౌట్ కావడంతో తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అదే ఓవర్లో కెప్టెన్ ఫ్లిన్ డకౌట్ అయినా వాట్లింగ్ వరుసగా 4,4,6 కొట్టి రన్‌రేట్ తగ్గకుండా చూశాడు. చివర్లో విలియమ్సన్ సెంచరీ చేయడంపై కాస్త ఆందోళన నెలకొంది. 18వ ఓవర్ అనంతరం 90 పరుగుల వద్ద ఉన్న విలియమ్సన్కు ఆతర్వాత ఓవర్లో రెండు వికెట్లు పడడంతో సెంచరీ పూర్తిచేస్తాడా అనే ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో తొమ్మిది పరుగులు చేయాల్సి ఉండగా ఫ్రీ హిట్ అవకాశాన్ని సిక్సర్‌గా మలిచి విలియమ్సన్ 48 బంతుల్లో శతకం అందుకున్నాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేప్ కోబ్రాస్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ఆమ్లా (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) అదే ఓవర్లో వెనుదిరిగాడు. అయితే వర్ష సూచనను అంచనా వేయకుండా నిదానంగా ఆడడంతో జట్టు మూల్యం చెల్లించుకుంది. స్కోరు వివరాలు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్: డెవిసిచ్ (రనౌట్) 67; విలియమ్సన్ నాటౌట్ 101; ఫ్లిన్ (సి) ఒన్‌టాంగ్ (బి) ఫిలాండర్ 0; వాట్లింగ్ (సి) వాన్ జిల్ (బి) లాంగెవెల్ట్ 32; స్టైరిస్ (సి) విలాస్ (బి) లాంగెవెల్ట్ 0; మిచెల్ (సి) కెంప్ (బి) ఫిలాండర్ 0; సాన్ట్నెర్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 206 వికెట్ల పతనం: 1-140; 2-140; 3-191; 4-192; 5-192. బౌలింగ్: లాంగెవెల్ట్ 4-0-27-2; ఫిలాండర్ 4-0-39-2; క్లీన్‌వెల్ట్ 3-0-37-0; పీటర్సన్ 3-0-32-0; జిజిమా 2-0-20-0; ఒన్‌టాంగ్ 2-0-17-0; కెంప్ 2-0-34-0. కేప్ కోబ్రాస్ ఇన్నింగ్స్: వాన్ జిల్ (బి) బౌల్ట్ 0; ఆమ్లా (సి) సబ్ విల్సన్ (బి) కుగ్గెలీన్ 20; పీటర్సన్ నాటౌట్ 17; రమేలా నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (7.2 ఓవర్లలో 2 వికెట్లకు) 44 వికెట్ల పతనం: 1-0; 2-38. బౌలింగ్: బౌల్ట్ 2-0-8-1; సౌతీ 2-0-10-0; స్టైరిస్ 2-0-13-0; కుగ్గెలీన్ 1-0-11-1; సోధి 0.2-0-1-0.