not aware
-
బిహార్‌లో న్యాయశాఖ మంత్రి అరెస్టు కలకలం... తెలియదన్న సీఎం
పాట్న: బిహార్‌లో నితీష్ కుమార్ బీజేపీ గుడ్ బై చెప్పీ ఆర్జేడితో కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీహార్ కొత్త ప్రభుత్వంలోని న్యాయశాఖ మంత్రి కార్తికేయ సింగ్‌ని అరెస్ట్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయమై విలేకరులు బిహార్ సీఎం నితీష్‌కుమార్‌ని ప్రశ్నించగా నాకు తెలియదని చెప్పారు. డిప్యూటీ సీఎం పార్టీకి చెందిన కార్తికేయ సింగ్‌ని కిడ్నాప్ కేసు విషయమై అరెస్టు చేశారా అంటూ మీడియా పలుమార్లు నిలదీయగా...నాకేమి తెలియదంటూ మాట దాటవేశారు. నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంలో కార్తికేయం ఆగస్టు 16న మంత్రిగా ప్రమాణా స్వీకార చేశారు. ఆ రోజునే ఆయన కోర్టులో సరెండర్ అయ్యారు. బిహార్ అసెంబ్లీ సభ్యుడైన కార్తికేయ సుమారు 17 మందితో కలిసి 2014లో ఒక బిల్డర్‌ని కిడ్నాప్‌చేసి హత్య చేసినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. ఐతే ఆయన మాత్రం తప్పుడు అభియోగాలతో తనపై కేసు పెట్టారని, తనపై ఎలాంటి వారెంట లేదని చెప్పడం గమనార్హం. (చదవండి: కొలువుదీరిన నితీశ్ కేబినెట్.. మంత్రులుగా 31 మంది ప్రమాణ స్వీకారం) -
98 శాతం మందికి ఆ టెక్నిక్ తెలియదు
న్యూఢిల్లీ: గుండెజబ్బులతో మృతిచెందేవారి సంఖ్య పెరిగిపోతున్న భారత్‌లో.. దానిపై అవగాహన మాత్రం దాదాపు శూన్యంగా ఉందని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. హఠాత్తుగా గుండెపోటు సంభవించినప్పుడు ప్రాణాలను కాపాడటంలో సహకరించే చిన్న చిన్న టెక్నిక్‌లు సైతం భారత్‌లో 98 శాతం మందికి తెలియవని లిబ్రేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 20 నగరాల్లోని 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న సుమారు లక్ష మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో యువతకు సైతం హార్ట్ ఎటాక్ సమయంలో ఎలా స్పందించాలనే అంశంలో స్పష్టతలేకపోవడం ఆందోళనకరమని లిబ్రేట్ సీఈవో సౌరబ్ అరోరా తెలిపారు. హార్ట్ ఎటాక్ సమయంలో ఎంతగానో ఉపకరించే కార్డియోపల్మొనరి రిసక్సిటేషన్(సీపీఆర్) టెక్నిక్ గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పించాల్సిన అవసరముందని సర్వే నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. హార్ట్ ఎటాక్ సంబంధిత కేసుల్లో ఆసుపత్రికి చేరేలోపే 60 శాతం మంది మృతి చెందుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో కీలక సమయంలో ఎలా స్పందించాలో తెలుసుకోవడం మంచిదన్నారు.