not clarity
-
ఖరారు కాని విత్తన పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్ : ఈ నెల 15వ తేదీ తర్వాత విత్తన వేరుశనగ పంపిణీ మొదలు పెడతామని వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించగా ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు విత్తన ధరలు, రాయితీలు ఖరారు కాకపోవడం విశేషం. ముందస్తు విత్తన పంపిణీ సన్నాహాలు అంటూ నెల రోజల నుంచే వ్యవసాయశాఖ హడావిడి చేస్తుండగా తీరా సమయం దగ్గర పడుతున్న కొద్దీ జాప్యం జరిగే పరిస్థితి నెలకొంది. దీంతో సకాలంలో రైతులకు విత్తన పంపిణీ అందడం కష్టంగా మారింది. గత ఐదారేళ్లుగా జూన్ మొదటి వారం నుంచే పంట సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. అంతకు మునుపు జూన్ నెలలో వేరుశనగ సాగు చేసే పరిస్థితి లేదంటున్నారు. అయితే వర్షాలు గతి తప్పడం, రుతుపవనాలు మొహం చాటేస్తుండటంతో ముందస్తు పంట సాగుకు రైతులు మొగ్గు చూపుతూ వర్షం వస్తే జూన్ మొదటి వారంలోనే మొదలు పెడుతున్నారు. అంతలోగా రైతులకు విత్తనకాయ ఇవ్వాల్సి ఉన్నా ధరలు ఖరారు కాకపోవడం, విత్తన సేకరణలో జాప్యం కావడం, ఇతరత్రా కారణాల వల్ల పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో చాలా మంది రైతులు ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాన్ని నమ్ముకోకుండా బయట ప్రాంతాల్లో కొనుగోలు చేసి సమకూర్చుకుంటున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ముందుగానే విత్తనం ఇస్తామని ప్రకటించడం, విత్తనశుద్ధి కార్యక్రమం, సేకరించి గోదాముల్లో నిల్వ చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. కానీ ధరలు, రాయితీలు ప్రభుత్వం ప్రకటించకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. కాగా గతేడాది ఏప్రిల్ మూడో వారంలోనే విత్తన ధరలు ప్రకటించారు. పూర్తీ ధర క్వింటాలు రూ.6,300 ఉండగా అందులో 33.3 శాతం సబ్సిడీ పోనూ రైతు వాటాగా రూ.4,200 ప్రకారం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
అ"సమగ్ర" సర్వే
– పెద్దలకో తీరు.. పేదలకో తీరు – వివరావ్విలని పచ్చ నేతలు ((((జిల్లాలో ఆయన అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి. ధనవంతుల్లో జాబితా సిద్ధం చేస్తే ముందువరుసలో ఉంటారు. ఇదే విధంగా అధికార పార్టీకి చెందిన మరొక ప్రజాప్రతినిధి ఆస్తుల విలువ లెక్కిస్తే ‘టాప్ టెన్’లో నిలుస్తారు. ఈయనకు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనే కాకుండా హైదరాబాద్‌లోనూ విలువైన భూములు, ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల్లో సమయంలో ఆయన ఇచ్చిన అఫిడివిట్ పరిశీలిస్తే ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తుల చిట్టా ఎంత పొడవుందో తెలుస్తుంది. ఇదే విధంగా అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కోట్లకు పడగలెత్తారు. అయితే వీరెవరూ స్మార్ట్ పల్స్ సర్వే(ప్రజా సాధికార సర్వే)లో తమకు సంబంధించిన ఆస్తుల వివరాలను సమగ్రంగా ఇవ్వలేదని తెలిసింది.))) అనంతపురం అర్బన్ : జిల్లాలో ప్రజా సా«ధికార సర్వే ‘చోద్యం’గా మారింది. పెద్దలకో తీరు... సామాన్యులకో తీరు చందంగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సామాన్యుల నుంచి గుచ్చి గుచ్చి వివరాలను సేకరిస్తున్నారు. అదే కోట్ల రూపాయలకు పడగలెత్తిన అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం సర్వేలో తమ వివరాలను సమగ్రమంగా ఇవ్వడం లేదు. ఏదో మొక్కుబడిగా కానిచ్చేస్తున్నట్లు తెలిసింది. ఒకవైపు ప్రజల సాధికారత కోసమే సర్వే అంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ప్రతి పౌరుడు తమకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలనీ చెప్పింది. ఇవ్వన్నీ సామాన్యులకే తప్ప అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు వర్తించడం లేదనేది సర్వే తీరు స్పష్టం చేస్తోంది. జిల్లాలో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల పేరున లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు తమ ఆస్తుల సమాచారాన్ని సర్వేలో వెల్లడించకుండా గోప్యంగా ఉంచుకున్నారని తెలిసింది. వాస్తవంగా 22 ఆధారాలను సర్వే సిబ్బందికి ప్రజలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పలువురు ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా కొన్ని వివరాలు చెప్పి ఎన్యుమరేటర్లను పంపుతున్నారని సమాచారం. కనీసం వరిని ఇళ్లలోకి కూడా రానివ్వట్లలేదని తెలుస్తోంది. ఆధార్‌తో అనుసంధానం కాని ఆస్తులెన్నో.. జిల్లాలో అధికార పార్టీకి చెందిన కొందరు ధనిక ప్రజాప్రతినిధుల ఆస్తులు చాలా వరకు ఆధార్‌తో అనుసంధానం కాలేదని తెలిసింది. ఆధార్ కార్డు విధానం అమలులోకి రాక ముందు ఉన్న ఆస్తులు ఆధార్ పరిధిలోకి రాలేదని సమాచారం. ఇలాంటి ఆస్తుల వివరాలను పచ్చనేతలు సర్వేలో వెల్లడించకుండా గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. కాగా సామాన్యుల నుంచి మాత్రం వివరాలను ఎన్యుమరేటర్లు పక్కాగా సేకరిస్తున్నారు. వారి ఇళ్లలోకి ప్రతి వస్తువునూ పరిశీలించి నమోదు చేసుకుంటున్నారు. దీంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. వాటి కారణంగానే ఎక్కడ ప్రభుత్వ పథకాలను దూరం చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.