not confirm
-
ట్రంప్ పర్యటన ఇంకా ఖరారు కాలేదు
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు సంబంధించి ఇరు దేశాల మధ్య దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగుతున్నాయని భారత విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. అంతకుమించి ఇప్పుడు ఈ విషయంపై ఇంకా ఏమీ చెప్పలేమని స్పష్టం చేసింది. ట్రంప్ పర్యటన ఖరారైన తరువాత వివరాలను వెల్లడిస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ట్రంప్ ఈ ఫిబ్రవరిలో భారత్ వస్తున్నారని, గుజరాత్‌లోని ఆసియాలోనే అత్యంత స్వచ్ఛమైన సబర్మతి నదిని సందర్శిస్తారనిగుజరాత్ సీఎం రూపానీ గతంలో అన్నారు. -
యూఏఈ అంబాసిడర్ సంచలన ప్రకటన
తిరువనంతపురం: వరదలతో అల్లాడిన కేరళకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీసాయాన్ని ప్రకటించడం ఆకర్షణీయంగా నిలిచింది. అయితే తాజాగా యూఏఈ ఆర్థికసాయంపై మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ భారీ సాయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనలేదని యూఏఈ అంబాసిడర్ ప్రకటించారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. కేరళకు అందించే ఆర్థిక సహాయం నిర్దిష్ట మొత్తాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని గల్ఫ్ దేశ రాయబారి ప్రకటించారు. వారికందించాల్సిన విరాళాలపై తమ అంచనా కొనసాగుతోందని అహ్మద్ అల్బన్నా చెప్పారని రిపోర్ట్ చేసింది. అయితే దాదాపు రూ.2వేల కోట్లకు పైగా నష్టపోయిన రాష్ట్రానికి కేవలం 600 కోట్ల రూపాయలిచ్చి కేంద్రం చేతులు దులుపుకోగా గల్ఫ్‌దేశం రూ.700 కోట్ల భారీ సాయం అందించిందంటూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు విదేశీ ఆర్థికసాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం కూడా భారీ చర్చకు తెరతీసిన సంగతి తెలిసిందే. విదేశీసాయంపై ఒకవైపు వివాదం కొనసాగుతుండగానే, యూఏఈ రాయబారి ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు యూఏఈ సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేయడం కూడా గమనార్హం. మరి తాజా గందరగోళంపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు గల్ఫ్ దేశం సాయాన్నితిరస్కరించడంపై పలువురు నాయకులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేరళ ఆర్థికమంత్రి థామస్ ఇసాక్ గల్ఫ్ దేశం ఇచ్చింది రుణంకాదు, సాయం, విపత్తు నివారణ విధానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే యూఏఈ సహాయాన్ని ఆమోదించేలా విధానంలో సవరణలు తేవాలంటూ ప్రధాని మోదీకి కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఒక లేఖ రాశారు. ప్రజల బాధలను నిర్మూలించేలా విధానాలు ఉండాలి, విదేశీ ఆర్థిక సహాయాన్ని ఆమోదించడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే, దయచేసి తగిన మార్పులను తీసుకురావాలని ఆయన కోరారు. కాగా కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ యూఏఈ సహాయంపై స్వయంగా మీడియాకు తెలియజేసారు. అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జావేద్ అల్ నహాన్ రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించారని వెల్లడించారు. -
ఖరారు కాని కొత్త పెన్షన్ల విధానం
-
ఖరారు కాని కొత్త పెన్షన్ల విధానం
సాక్షి, హైదరాబాద్: దసరా నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు ఇంకా విధానమే ఖరారు చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 31.67 లక్షల వరకు అన్ని రకాల పెన్షనర్లు ఉన్నారు. అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత ఆధార్‌కార్డు లేని దాదాపు నాలుగు లక్షల మందికి పెన్షన్లు నిలిపివేశారు. వారంతా ఆధార్‌కార్డులు తీసుకుని వస్తే తప్ప.. పెన్షన్లు మంజూరు చేసేది లేదంటూ అధికారులు కరాఖండీగా చెబుతున్నారు. పెన్షన్లలోనూ బోగస్ లబ్ధిదారులు చాలా మంది ఉన్నారని అంచనా వేస్తున్న ప్రభుత్వం, వారికి కొత్తకార్డులు జారీ చేస్తామని, అది దసరా నుంచి ప్రారంభిస్తామని చెప్పింది. కాని సామాజిక భద్రతా పెన్షన్లు ఇవ్వడానికి లేదా ప్రస్తుతం ఉన్న వారి నుంచి పెన్షన్ తొలగించడానికి అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో, కొత్త పెన్షన్‌కార్డుల జారీలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే దాదాపు రెండులక్షలవరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారవర్గాలు వివరించాయి. ప్రస్తుతం ఉన్న సామాజిక భద్రతా పెన్షన్ల విధానాన్ని సమూలంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైనవారికి మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ ‘అర్హులు’ అనే పదానికి నిర్వచనం కోసం గ్రామీణాభివృద్ధి శాఖ ఎదురుచూస్తోంది. సామాజిక భద్రతా పెన్షన్లను ప్రస్తుతం ఉన్న రూ.200ల నుంచి వెయ్యి రూపాయలకు, వికలాంగుల పెన్షన్లు రూ.500 నుంచి రూ. 1,500 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది, అంతేకాక ఈ పథకం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. గతంలో జరిగిన చర్చల సమయంలో... ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇవ్వొద్దని, పెన్షన్ తీసుకునే వారి పిల్లలు ఉద్యోగస్తులైనా.. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా.. ట్యాక్సీ నడుపుకొంటున్న వారికీ సామాజిక భద్రతా పెన్షన్లు ఇవ్వరాదని నిర్ణయించారు. వార్షిక ఆదాయానికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతమున్న 31.67 లక్షల పెన్షన్లలో 2.16 లక్షలు అభయ హస్తం పెన్షన్లు ఉన్నాయి. బోగస్‌లు ఏరివేస్తే, నాలుగైదులక్షల పెన్షన్లు తగ్గిపోతాయనే అంచనాలో అధికారులున్నారు. అయితే వీరి తొలగింపునకు ముఖ్యమంత్రి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. సమగ్ర ఇంటింటి సర్వే వివరాలు అందితే తప్ప ఎవరు అర్హులో, అనర్హులో తేల్చడానికి వీలవుతుందంటున్నారు. అంతవరకు ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.