
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు సంబంధించి ఇరు దేశాల మధ్య దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగుతున్నాయని భారత విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. అంతకుమించి ఇప్పుడు ఈ విషయంపై ఇంకా ఏమీ చెప్పలేమని స్పష్టం చేసింది. ట్రంప్ పర్యటన ఖరారైన తరువాత వివరాలను వెల్లడిస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ట్రంప్ ఈ ఫిబ్రవరిలో భారత్ వస్తున్నారని, గుజరాత్‌లోని ఆసియాలోనే అత్యంత స్వచ్ఛమైన సబర్మతి నదిని సందర్శిస్తారనిగుజరాత్ సీఎం రూపానీ గతంలో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment