'అది లోక్‌పాల్ కాదు... జోక్పాల్'
ఢిల్లీ: కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లుపై స్వరాజ్ అభియాన్ నాయకులు ప్రశాంత్ భూషణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును పెద్ద జోక్‌గా ఆయన అభివర్ణించారు. అవినీతికి వ్యతిరేకంగా బలమైన లోక్‌పాల్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ అందులో విఫలమయ్యాడని దీనికి గాను ముఖ్యమంత్రి పదవి నుండి తక్షణమే వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో స్వతంత్ర్య విధానాలు గల సంస్థ ప్రస్తావన లేకపోవడాన్ని ప్రశాంత్ భూషణ్ తప్పు పట్టారు. గతంలో డిమాండ్ చేసిన జన్‌లోక్ పాల్ బిల్లుకు తూట్లు పొడిచి కొత్త బిల్లును ప్రవేశపెట్టారని, దీని వలన ప్రజలకు వచ్చే ప్రయోజనం లేదన్నారు. నిజాయితీతో కూడిన లోక్‌పాల్‌ను ప్రజలకు కేజ్రీవాల్ ఇవ్వలేకపోయాడని ఆరోపించిన ఆయన ఇదో పెద్ద జోక్పాల్ అని ఎద్దేవా చేశారు.