not release
-
మార్కుల డివిజన్ ప్రకటించం
సాక్షి, న్యూఢిల్లీ: 10, 12 తరగతుల మార్కుల ఫలితాల్లో ఇకపై డివిజన్, డిస్టింక్షన్‌ను ప్రకటించబోమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పేర్కొంది. మెరిట్ లిస్టును ప్రకటించే విధానానికి గతంలోనే స్వస్తి చెప్పిన బోర్డు తాజాగా డివిజన్, డిస్టింక్షన్‌పై నిర్ణయాన్ని వెలువరించింది. ఈమేరకు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కుల శాతాన్ని లెక్కించడం, ప్రకటించడం వంటివి బోర్డు ఇకపై చేయదని స్పష్టం చేశారు. ఉన్నత చదువులకు మార్కుల శాతం అవసరమనిపిస్తే సదరు సంస్థ వాటిని గణించుకోవచ్చని వివరించింది. ఒకవేళ విద్యార్థి అయిదుకు మించి సబ్జెక్టులను ఎంచుకున్నట్లయితే..వాటిలో అయిదు ఉత్తమ సబ్జెక్టులను గుర్తించడంపై సంబంధిత ఉన్నత విద్యా సంస్థ లేదా యజమాని నిర్ణయం తీసుకోవచ్చని భరద్వాజ్ తెలిపారు. 10, 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలవుతాయని తెలిపారు. -
అప్పుడు పెద్ద పండగలా ఉంటుంది
ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రం నుంచి ఎన్టీఆర్‌కి చెందిన టీజర్ లేదా ఫస్ట్ లుక్ విడుదలవుతుందని ఆశించినవారికి నిరాశే ఎదురైంది. ఫస్ట్ లుక్, టీజర్.. ఏదీ విడుదల చేయడం లేదని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం సోమవారం అధికారికంగా తెలిపింది. ‘‘లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో మా పని ముందుకు సాగలేదు. ఎన్టీఆర్ బర్త్ డే గ్లిమ్స్ వీడియో కోసం మా వంతు ప్రయత్నం చేశాం. కానీ ఫస్ట్ లుక్ లేదా వీడియోను విడుదల చేయడం కుదరడం లేదు. కానీ ఇవి విడుదలైనప్పుడు మాత్రం మనందరికీ ఓ పెద్ద పండగలా ఉంటుంది. అభిమానుల ఎదురుచూపులకు తప్పక ఫలితం ఉంటుంది’’ అని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం పేర్కొంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. 1920 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. అదే మీరు నాకు ఇచ్చే బహుమతి: ఎన్టీఆర్ ‘‘ప్రియమైన సోదరులకు ఓ విన్నపం. ఈ విపత్తు (కరోనా పరిస్థితులను ఉద్దేశించి) సమయంలో మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. అందరం కలిసి పోరాడితే ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడతాం అని నమ్ముతున్నాను. ప్రతి ఏటా నా పుట్టినరోజున మీరు (అభిమానులు) చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలను ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ, అధికారుల సూచనలను పాటిస్తూ, భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం. ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమతి. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి నా బర్త్ డే సందర్భంగా ఎటువంటి ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదల కావడం లేదు అనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని నేను అర్థం చేసుకోగలను. మీ ఆనందం కోసం ఫస్ట్ లుక్ లేదా టీజర్‌ను సిద్ధం చేయాలని చిత్రబృందం ఎంత కష్టపడింది అనేది నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వలన అది కుదరలేదు. రాజమౌళిగారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఓ సంచలనం అవుతుందన్న నమ్మకం నాకు ఉంది’’ అని పేర్కొన్నారు ఎన్టీఆర్. -
వారిది పాపం... వీరికి శాపం...
గత పాలకుల పాపం ఇంకా వెంటాడుతోంది. విద్యార్థుల జీవితాలను అవస్థల మయం చేసింది. వారికి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పంగనామాలు పెట్టింది. స్కాలర్‌షిప్‌లకు చెల్లు చెప్పింది. మెస్‌బిల్లులను ఎగ్గొట్టింది. తీరా వాటిగురించి అడిగేందుకు సాహసిస్తే హౌస్ అరెస్టులు చేసి అణగదొక్కింది. ఇప్పుడు ప్రజాసంక్షేమ పాలనలో తమ కోర్కెలు తీరుతాయని ఆశపడిన విద్యార్థి లోకం మరోసారి గళమెత్తింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళనకు దిగింది. స్వేచ్ఛగా చేపట్టిన ఆందోళన అనుకోకుండా గతితప్పింది. చట్ట ఉల్లంఘనకు దారితీసింది. ఫలితంగా చట్టం తన పనితాను చేసుకుపోయింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యార్థిలోకానికి గత ప్రభుత్వం ఇవ్వాల్సిన పలు రకాల నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేసింది. మెస్ బిల్లులు, మౌలిక సదుపాయాల నిధులు, ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు వంటివి చెల్లించకుండా మొండిచెయ్యి చూపింది. ఇప్పుడు ఆ మొత్తం భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడింది. వాటిని చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో వసతులు మెరుగుపరచాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు జ్వరాలలో మగ్గిపోతుంటే జిల్లా కలెక్టర్, అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరి ష్కరించకపోతే కలెక్టరేట్ నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. అప్పటికే అధికారులతో సమావేశంలో ఉన్న కలెక్టర్ బయటకు రాకపోవడంతో ఎస్ఎఫ్ఐ నాయకులు మరింత కోపోద్రిక్తులయ్యారు. కలెక్టరేట్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ విద్యార్థులతో మా ట్లాడాల్సిందిగా జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావును పంపించారు. కానీ ఆయనతో మాట్లాడేందుకు విద్యార్థులు అంగీకరించలేదు. రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం.. కలెక్టర్ తమతో మాట్లాడేంతవరకూ కదిలేది లేదంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. నాలుగు రోడ్ల కూడలిలో దాదాపు రెండు గంట ల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవడంతో అక్కడి నుంచి వెళ్లి పోవాల్సిందిగా పోలీసులు విద్యార్ధులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఎస్ ఎఫ్ఐ నాయకులు శాంతించకపోవడంతో వారి ని బలవంతంగా అక్కడి నుంచి పంపిం చేందుకు పోలీసులు ఉపక్రమించారు. విద్యార్థులు ప్రతిఘటించడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక చేసేది లేక వారిని బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్, ఆటోల్లో ఎక్కించారు. వాటిని కూడా విద్యార్థులు అడ్డగించడంతో పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో 47మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి జామి పోలీస్‌స్టేషన్‌కు 36మందిని, ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కి 11 మందిని తరలించారు. గత ప్రభుత్వ బకాయి రూ. 102కోట్లు.. జిల్లా వ్యాప్తంగా 61 బీసీ హాస్టళ్లు, 37 ఎస్సీ హాస్ట ళ్లు ఉండగా ఎస్సీ హాస్టల్స్‌లో 3400 మంది, బీసీ హాస్టళ్లలో 5537 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరికి 2018–19 విద్యా సంవత్సరానికి బీసీలకు రూ.73 కోట్లు, ఎస్సీలకు రూ.29 కోట్లు చొప్పున మొత్తం దాదాపు రూ.102 కోట్లు బకాయిలను గత ప్రభుత్వం విడుదల చేయలేదు. వీటిని అప్పుడే టీడీపీ ప్రభుత్వం విడుదల చేసి ఉంటే ఈ రోజు విద్యార్థులు ఇలా రోడ్డు మీదకు రావాల్సి వచ్చేది కాదు. మాట్లాడటానికి పిలిచినా రాలేదు.. ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమైన సమావేశంలో ఉన్నందున విద్యార్థులను నా వద్దకు రావాల్సిందిగా సూచించాను. 20 మంది వరకూ వచ్చి వారి సమస్యలు చెప్పుకోవచ్చని అవకాశం ఇచ్చాను. కానీ వారు రాలేదు. జిల్లా మెజిస్ట్రేట్, అందునా ముఖ్యమైన ఇరిగేషన్ సమావేశాన్ని, జిల్లా అధికారులను వదిలి రావాలని కోరడం వెనుక ఉద్దేశం వేరుగా ఉన్నట్లు కనిపించింది. అయినప్పటికీ డీఆర్ఓను, జాయింట్ కలెక్టర్‌ను విద్యార్థులతో మాట్లాడాలనీ, వారి సమస్యలు వినాలని పంపించాను. విద్యార్థులు లెక్కచేయలేదు. వాస్తవానికి ప్రతి సోమవారం జరిగే ‘స్పందన’ కార్యక్రమంలో తమ సమస్య చెప్పుకోవచ్చు. ఆ పని కూడా చేయలేదు. ప్రభుత్వం వారి విషయంలో సానుకూలంగా ఉంటోంది. వారి సమస్యలు పరిష్కరించేందుకు యత్నిస్తోంది. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లా కలెక్టర్ శాంతిభద్రతల పరిరక్షణకే విద్యార్థుల ముందస్తు అరెస్టు.. కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం జ రిగిన ధర్నాలో ఎటువంటి లాఠీ చార్జీ చేయలేదు. సుమారు 1500 మందికి పైగా విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు. ఎ లాంటి హింసాత్మక సంఘటనలు జరగకుం డా ఉండేందుకు ముందుగానే పోలీసులను లాఠీలు ఉపయోగించ వద్దని, సంయమనం పాటించాలని ఆదేశించాం. అయితే ఎస్ఎఫ్ఐ నాయకులు, కొందరు విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి, వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగించడంతో, వారిని శాంతి యుతంగానే పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొంతమంది విద్యార్థుల ముసుగులో దురుద్దేశంతోనే వాహనంపైకి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. మరి కొంతమంది విద్యార్థులు కలెక్టరేట్ ప్రాంగణంలోకి వెళ్లేందుకు యత్నించారు. ఇక శాంతిభద్రతల పరిరక్షణకు తప్పనిసరి పరిస్థితుల్లో కొందర్ని 151 సీఆర్పీసీ కింద ముందస్తు అరెస్టు చేశాం. – బి.రాజకుమారి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ -
కేంద్ర పథకాల నిధులు రావట్లేదు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వివిధ పథకాలకు సంబంధించి ఇవ్వాల్సిన నిధులు రావడం లేదని, దీనిపై వెంటనే కేంద్రానికి లేఖలు రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పలు శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. రెండో దశలో కేంద్రం తెలంగాణ కు విడుదల చేసే నిధులు పాత బకాయిలతో సహా ఇచ్చేలా చూడాలని ఆ లేఖల్లో కోరాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రావాల్సిన నిధుల అంశంపై మంగళవారం సీఎస్ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని నిధులు విడుదలయ్యాయని, అయితే విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ వాటా నిధులు వెళుతున్నాయని అధికారులు సీఎస్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ. 15 వేల కోట్ల వరకూ నిధులు వస్తాయని ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉందని.. వాస్తవంగా రూ. పదివేల కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు అధికారులు వివరించారు. అందులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు కేవలం రూ. 1,126 కోట్లు మాత్రమేనని చెప్పారు. జూన్‌లో సర్వశిక్షా అభియాన్ కింద రూ. 1,454 కోట్ల కేంద్ర నిధులు విడుదల కాగా.. అందులో తెలంగాణకు రూ. 142 కోట్లు మాత్రమే వచ్చాయని, వాస్తవానికి ఈ పథకం కింద రూ. 600 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందని తెలిపారు. అలాగే వ్యవసాయ పథకాల కింద రూ. 986 కోట్లు రావాల్సి ఉండగా.. తెలంగాణకు ఇప్పటివరకు కేవలం రూ. 92 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఏఐబీపీ, ఈజీఎస్, సర్వశిక్షా అభియాన్, వ్యవసాయం, పట్టణ నవీకరణ పథకం, జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం, జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం వంటివాటి కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర నిధులు వస్తున్నాయని.. అందులో నిష్పత్తి ప్రతిపాదికన టీ సర్కారుకు రావాల్సిన నిధులు అందడం లేదని వివరించారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం రూ. 2,250 కోట్లు విడుదల చేసిందని.. అయితే తెలంగాణలో మాత్రం ఆ పథకం కింద నిధులను రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు సీఎస్‌కు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎస్... ఈ మేరకు నిధులు ఇవ్వాలంటూ కేంద్ర శాఖల కార్యదర్శులకు తక్షణమే లేఖలు రాయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జోషి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.