Note vote
-
‘ఓటుకు నోటు’లో ఇద్దరు సీఎంలు దోషులే
వరంగల్ అర్బన్/హన్మకొండ : ఓటుకు నోటు వ్యవహరంలో ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరూ దోషులేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హన్మకొండ నయూంనగర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు విషయంలో చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోలేకపోతున్నారన్నారు. రాజ్యాం గాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. రాష్ట్రంలో దేవాలయాల వద్దకు విస్తృత పర్యటనలు చేస్తున్న కేసీఆర్ మసీదులు, చర్చిల వద్దకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. అండర్‌డ్రైనేజీ కోసం ఉద్యమిస్తాం వరంగల్ నగరంలో అండర్‌డ్రైనేజీ కోసం ప్రజ లతో కలిసి ఉద్యమం చేస్తామని మంద కృష్ణ మాదిగ తెలిపారు. స్టేషన్ రోడ్డులోని మహేశ్వరీ గార్డెన్లో శుక్రవారం ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎన్నికల పర్యటనలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరమని, తమ పార్టీకి అధికారం ఇస్తే వంద రోజుల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడ్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఏడాది గడిచినా అండర్ డ్రైనేజీ ఊసెత్తడం లేదని విమర్శించారు. ప్రత్యేకంగా దళితమంత్రిని నియమించి దళిత సంక్షేమ శాఖను అప్పగించాలని సూచించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రమేష్ మాదిగ, సభ అధ్యక్షుడు కొయ్యడ మల్లేష్ మాదిగ, జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్‌మాదిగ, నాయకులు వేల్పుల వీరన్న, నకిరకంటి యాకయ్య, పుట్ట రవి, వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ ఈర్ల కుమార్, మహిళ నేతలు సింగిరెడ్డి కృష్ణ, దామెర కరుణ, తూర్పు నాయకులు సింగారపు చిరంజీవి, ప్రమోద్ పాల్గొన్నారు. -
ఇక గరికపాటి!
- నేడో రేపో నోటీసులు జారీ - విచారణ.. అరెస్టుకు అవకాశం - నరేందర్‌రెడ్డిని విచారించిన ఏసీబీ సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవడానికి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చిన ‘ఓటుకు నోటు’ కేసు జిల్లా నేతలకు చుట్టుకుంటోంది. రోజుకు ఒకరు చొప్పున ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. టీడీపీ తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం విచారించింది. సుమారు ఐదు గంటలపాటు ఏసీబీ అధికారులు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిని ఓటుకు నోటు కేసులో లోతుగా ప్రశ్నలు అడిగి నట్లు తెలిసింది. వేం నరేందర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకుంటారని భావించినా సాయంత్రం ఆయనను ఇంటికి పంపిం చారు. విచారణకు అవసరమైనప్పుడు రావాలని సూచించారు. నరేందర్‌రెడ్డి విచారణకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డి విచారణకు హాజరైన నేపథ్యంలో ఆయన ఏసీబీ అధికారులకు ఏం విషయాలు తెలియజేసి ఉంటారనే విషయంపై టీడీపీలోని పలువురు జిల్లా ముఖ్య నేతలు టెన్షన్ పడుతున్నారు. ఓటుకు నోటు కేసు వ్యవహారం తమకు ఎక్కడ చుట్టుకుంటుందో అని ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలను ఏసీబీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. మోహన్‌రావుకు నోటీసులు ఇచ్చే అవకాశం ‘ఓటుకు నోటు’ కేసులో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుకు సంబంధం ఉందనే ఆరోపణలతో ఆయనకు నోటీసు ఇవ్వాలని ఏసీబీ ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. గరికపాటికి గురువారం నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలో డబ్బు సర్దుబాటు చేసిన అంశంలో ఈయనకు సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నారు. టీడీపీ జిల్లా ముఖ్యనేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మన జిల్లాకు చెందిన నాయకుడే కావడంతో ఈ వ్యవహారంలో గరికపాటి పాత్ర ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు కావడంతో అన్ని అంశాలను పరిశీలించి గరికపాటికి నోటీసులు జారీ కానున్నాయని.. విచారణ కోసం అవసరమైతే కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వేం నరేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్రావులతోపాటు జిల్లాలోని మరికొందరు టీడీపీ నాయకులకు ఓటుకు నోటు అంశంలో సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. వీరు ఎవరెవరనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.