nourishing SAILAJANATH
-
పింఛన్ల తొలగింపుపై పునర్విచారణ చేపట్టాలి
అనంతపురం అర్బన్: సామాజిక పింఛన్ల జాబితాలో అర్హులను తొలగించడంపై వెంటనే విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యంతో కలిసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇస్తున్న రూ.200 పింఛన్‌ను రూ.వెయ్యికి పెంపు చేస్తూనే.. మరోవైపు స్వల్ప కారణాలతో ఏక పక్షంగా జిల్లా వ్యాప్తంగా అర్హులను తొలగించడం సమంజసం కాదని, తొలగించిన వాటిపై పునర్విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ తరహాలో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏవీఆర్ హంద్రీ-నీవా మొదటి దశ కాలువ పనులను 80 శాతం పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీటిని తీసుకొచ్చామని, ప్రభుత్వం మొదటి దశ పనులు పూర్తి చేసి, రెండో దశ పనులనూ యుద్ధ ప్రాతిపదికన ముగించి అనంతపురంతో పాటు చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు అందించాలన్నారు. ఈ పనులు పూర్తయితేనే జిల్లాలోని చెరువులు జల కళను సంతరించుకుంటాయన్నారు. జిల్లాలో రూ.7,676 కోట్లతో రూపొందించిన ‘ప్రాజెక్టు అనంత’ను తక్షణం అమలు చేయాలన్నారు. రైతులకు అందాల్సిన రూ.618 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, రూ.184 కోట్ల పంటల బీమా మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని, గతంలో చంద్రబాబు డిమాండ్ చేసిన మేరకు ప్రస్తుతం ఎకరాకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.1800 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రాజధానిపై ప్రకటన చేసిన సందర్భంలో వివిధ జిల్లాలకు ప్రకటించిన ప్రణాళికలో భాగంగా అనంతపురం జిల్లాకు కేటాయించిన ఏవీఆర్ హంద్రీ-నీవా, కుద్రే ముఖ్ ప్రాజెక్టు, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి, పుట్టపర్తిలో విమానశ్రయం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ను అమలు చేయాలన్నారు. జిల్లాలో ఎయిమ్స్ బదులు, దాని అనుబంధ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ప్రజల ఆశలపై నీళు చల్లారన్నారు. రాష్ట్ర విభజన చట్టం మేరకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వెనుకబడిన జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సోమర జయచంద్రనాయుడు, నాయకులు నాగరాజు, దాదాగాంధీ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలే నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయ్..
అనంతపురం అర్బన్: వంచనచేసి అధికార పీఠం ఎక్కిన టీడీపీ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. జిల్లాలో రైతులకు పంట నష్టపరిహారం, ఇన్సూరెన్స్, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు, తదితర డిమాండ్లతో జిల్లా కాంగ్రెస్ కమి టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహిం చారు. ధర్నాను ఉద్దేశించి శైలజానాథ్ మా ట్లాడారు. వర్షాభావంతో పంటలులేక సంక్షోభంలో చిక్కుకుని జిల్లా రైతు లు విలవిల లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పశువులకు గడ్డి కూడా కరువైందన్నారు. అయినా అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లైనా లేదన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి అక్రమసంపాదనలో మునిగితేలుతున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే చంద్రబాబునాయుడు రాజకీయాల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకునే వారని శైలజానాథ్ ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు తెస్తే.. ఆ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని చంద్రబాబు సూచించారని మంత్రి దేవినేని ఉమా చెప్పడం ఎంతో దౌర్భాగ్యం అని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీ నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో రౌడిషీటర్లకు ఎమ్మెల్యే పదవులు, జెడ్పీ చైర్మన్ పదవులు, ఇస్తుంటే ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంటుందో అర్థం అవుతోందన్నారు. నారాయణ, సీఎం రమేష్, సుజనచౌదరి, చంద్రమోహన్ లాంటి ప్రజా దోపిడీదారులకు మంత్రి పదవులు అంటగట్టారని విమర్శించారు. రైతులకు, డ్వాక్రా మహిళాలకు, నేతన్నల రుణాలు వెంటనే మాఫీ చేయాలని, జిల్లా రైతులకు న్యాయం చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి యత్నించగా పో లీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, నియోజకవర్గ ఇన్చార్జ్ గోవర్ధన్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జయచంద్రనాయుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, కుండ్ల నరసింహరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాళ్లు లక్ష్మిదేవి, నాగలక్ష్మి, పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.