చెట్లు పెంచితేనే భవిష్యత్తు
నిజామాబాద్: చెట్లు పెంచితేనే మనకు భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు. నిజామాబాద్ మండలం సారంగపూర్ పాండురంగా రైస్‌మిల్ ఆవరణలో శుక్రవారం జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా రైస్‌మిల్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మొ క్కలు నాటాలని సూచించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు దయానంద్‌గుప్త, కార్యదర్శి మోహన్‌రెడ్డి తది తరులు కలెక్టర్ యోగితారాణాను, జేసీ రవీందర్‌రెడ్డి సత్కరించారు.
భావితరాలకు స్వచ్ఛమైన గాలిని ఇద్దాం
గాంధారి: ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి భావితరాలకు స్వచ్ఛమైన గాలిని ఇద్దామని కలెక్టర్ అన్నారు. గాంధారి మండ లం యాచారం తండాలో స్థానిక పాఠశా ల ఆవరణలో తండావాసులతో మాట్లాడారు. భావి తరాలకు మనం ఆస్తులు ఇవ్వకపోయినా కనీసం స్వచ్ఛమైన గాలి నైనా ఇచ్చేందుకు చెట్లను పెం చుదామన్నారు. ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మిం చుకోవాలని సూచించారు. నెలరోజుల్లో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. తండావాసులు వినతి పత్రాలు ఇవ్వగా వంద శాతం మరుగుదొడ్లు నిర్మించే వరకు వినతిపత్రాలు స్వీ కరించేదిలేదని తిరస్కరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేకాధికారి ఉపేందర్ రెడ్డి, ఎంపీడీవో సాయాగౌడ్ పాల్గొన్నారు.
ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటాలి
తాడ్వాయి: హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాటాలని కలెక్టర్ సూచించారు. బ్రహ్మాజివాడిలో హరితహారాన్ని పరిశీలించా రు. ఒక్కొక్క గ్రామంలో 40 వేల మొక్కలను నాటాల్సి ఉండగా 50 శాతం కూ డా ఎందుకు పూర్తికాలేదని అధికారుల ను నిల దీశారు. అధికారులు, ప్రజాప్రతి నిధులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో లక్ష్మి, ఏవో శ్రీకాంత్, ఈవోపీఆర్డీ నారాయణ, ఎంఈవో పాతసత్యం,సర్పంచ్ శాంతాబాయి ఉన్నారు.