NRI Jailed
-
రూ. 300 కోట్ల మోసానికి పాల్పడ్డ భారత సంతతి వ్యక్తి అరెస్ట్
$45 Million Investment Fraud: నీల్ చంద్రన్ అనే భారత సంతతి అమెరికన్ దాదాపు రూ. 300 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డాడని అమెరికా న్యాయస్థానం పేర్కొంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపింది. చంద్రన్ తన కంపెనీలలోని పెట్టుబడుదారులకు అధిక ఆదాయం వస్తుందంటూ తప్పుడూ ఆధారాలను చూపి సుమారు 10 వేలమందిని మోసం చేశాడని పేర్కొంది. నేరారోపణ ప్రకారం..."తన కంపెనీలలోని ఒకటి లేదా రెండు కంపెనీలను 'ViRSE' అనే బ్యానర్‌తో నిర్వహిచడమేక కాకుండా ఎక్కువ ఆదాయం వస్తున్నట్లుగా చూపించే సాంకేతిక కంపెనీలను చంద్రన్ కలిగి ఉన్నాడు. పైగా ఈ కంపెనీలు సంపన్న కొనుగొలుదారుల కన్సార్టియం ద్వారా కొనగోలు చేయబడుతోందంటూ తప్పుడు సాక్ష్యాలు చూపాడు. వాస్తవానికి అతని కంపెనీలో సంపన్న కొనుగోలుదారులు ఉంటేనే పెట్టుబడుదారలకు ఆదాయం వస్తుంది. కానీ చంద్రన్ కంపెనీలో అలాంటి సంపన్న కొనుగోలుదారులు ఎవరు లేరు. చంద్రన్ పై మూడు ఫ్రాడ్ కేసులు, అక్రమంగా పొందిన ఆస్తిలో లావాదేవీలు జరిపినందుకుగానూ అదనంగా మరో రెండు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ చంద్రన్ పై మోపబడిన ఈ అబియోగాలు రూజువైతే మూడు ఫ్రాడ్ కేసుల్లో ఒక్కొక్క ఫ్రాడ్ కేసుకి 20 ఏళ్లు చొప్పున జైలు శిక్ష , అలాగా అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన రెండు కేసుల్లో ఒక్కొక్క కేసుకి 10 ఏళ్లు చొప్పున శిక్ష పడుతుందని అమెరికా న్యాయస్థానం పేర్కొంది. అంతేకాదు చంద్రన్ వద్ద ఉన్న 39 టెస్లా వాహనాలతో సహా 100 వేర్వేరు ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, రియల్ ఎస్టేట్ తదితర ఆస్తులు మోసాలు ద్వారా సంపాదించిన ఆస్తులుగా జప్తు చేయబడతాయని స్పష్టం చేసింది. (చదవండి: పాక్‌లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు! కారణం ఏంటంటే..) -
అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఏడుగురు భారతీయులు!
న్యూయార్క్: ఇన్సైడర్ ట్రేడింగ్ స్కీముతో అక్రమంగా ఒక మిలియన్ డాలర్లు(దాదాపు రూ.7.5 కోట్లు) పైగా లాభాలు ఆర్జించారంటూ భారత సంతతికి చెందిన ఏడుగురిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్(ఎస్ఈసీ) ప్రకారం.. శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ ట్విలియోలో హరి ప్రసాద్ సూరి, లోకేష్ లగుడు, ఛోటు ప్రభు తేజ్ పులగం సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేసేవారు. కంపెనీకి సంబంధించిన అంతర్గత వివరాలను వీరు తమ స్నేహితులైన దిలీప్ కుమార్ రెడ్డి కముజుల, సాయి నెక్కలపూడి, అభిషేక్ ధర్మపురికర్, చేతన్ ప్రభు పులగంలకు చేరవేసేవారు. ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని వీరంతా ట్విలియో ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేశారు. 2020 తొలి త్రైమాసికం ఫలితాలను ప్రకటించడానికి ముందు ఈ విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వీరు 1 మిలియన్ డాలర్ల పైగా లాభాలు అక్రమంగా ఆర్జించినట్లు ఎస్ఈసీ అభియోగాలు మోపింది. సూరి, లోకేష్, ఛోటులు ప్రత్యేకంగా చాటింగ్ కోసం కంపెనీలో ప్రైవేట్ చానల్ ఏర్పాటు చేసుకుని .. 2020 మార్చి-మే మధ్య కాలంలో కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాల అంచనాల గురించి తెలుగులో చర్చించుకున్నారని తెలిపింది. అప్పట్లో 110 డాలర్లుగా ఉన్న షేరు 150 డాలర్లకు వెడుతుందని వారు అంచనాకు వచ్చారని ఎస్ఈసీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందేందుకు, తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు వీరంతా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను ఉపయోగించుకున్నారని తెలిపింది. నిందితులు ఇలా సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ యాక్ట్‌ను ఉల్లంఘించారంటూ నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా న్యాయస్థానంలో దాఖలైన కేసులో ఎస్ఈసీ పేర్కొంది. (చదవండి: హమ్మ బాబోయ్! ఈ బైక్ ధరకు కారు వచ్చేస్తుందిగా) -
డేవిడ్ బెక్‌హమ్ కోసం సెర్చ్ చేస్తే.. సస్పెండ్ చేశారు!
లండన్: భారత సంతతికి చెందిన ఓ పోలీస్ అధికారి తన అధికారాన్ని దుర్వినియోగ పరచినందుకుగాను విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు. దీనికి కారణం.. అతను ఆఫీస్‌లోని కంప్యూటర్లో దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హమ్, అతని భార్య విక్టోరియా బెక్హమ్లకు సంబంధించిన సమాచారాన్ని వెతకడమే. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని లీసెస్టర్‌షైర్ ప్రాంతానికి చెందిన పోలీసు విభాగంలో అజిత్ సింగ్(48) పనిచేస్తున్నాడు. అయితే విధుల్లో ఉండి, అధికారాన్ని దుర్వినియోగపరచి బెక్‌హమ్, అతని భార్య విక్టోరియా బెక్‌హమ్‌కు సంబంధించిన సమాచారాన్ని వెతకడంతో పోలీస్ విభాగ అధికారులు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అజిత్ సింగ్ 2002, 2018 సంవత్సరాల్లో కంప్యూటర్లో సమాచారాన్ని దుర్వినియోగపరచాడని తేటతెల్లమైంది. లీసెస్టర్‌లోని మాన్స్ఫీల్డ్ హౌస్ పోలీస్ స్టేషన్లో అజిత్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు కంప్యూటర్ను ఉపయోగించి మొత్తం 146 సార్లు పోలీస్ డేటాబేస్‌ను అనాధికారికంగా వినియోగించాడని రుజువైంది. అందులో ఎక్కువగా డేవిడ్ బెక్‌హమ్, అతని భార్య విక్టోరియా బెక్‌హమ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, ఆస్తి పాస్తులను గూర్చి ఎక్కువగా వివరాలను సేకరించే ప్రయత్నం చేశాడని రుజువైంది. ఇందుకుగాను లీసెస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం దుష్ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన కింద మూడు నెలల జైలు శిక్షతో పాటు ఎటువంటి విధులు నిర్వర్తించకుండా సంవత్సరంపాటు సస్పెండ్ చేసింది. అంతేకాక చట్టపరమైన ఖర్చులకు 300 పౌండ్లు, బాధితులకు సర్‌చార్జీ కింద 115 పౌండ్లు చెల్లించాలని ఆదేశించారు. కాగా అజిత్ సింగ్ (48) ప్రస్తుతం అనారోగ్య సెలవుపై ఉన్నారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జూలియన్ లెస్టర్ మాట్లాడుతూ.. ఇటువంటి ప్రవర్తన పోలీసు శాఖలో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నేరారోపణలు రుజువైన పక్షంలో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే అజిత్ సింగ్‌కు ఇతరులకు ఎటువంటి హానిచేసే ఉద్దేశం లేదని, కంప్యూటర్‌తో తను శోధించిన సమాచరంతో తనకు చిల్లిగవ్వంత ఆస్తి కూడా సంపాదించలేదని అతని తరపున లాయర్ అలెగ్జాండర్ బార్బర్ కోర్టుకు విన్నవించారు. -
భార్యను కొట్టిన ఎన్నారైకు 16 ఏళ్ల జైలు
లండన్: కట్టుకున్న భార్యను, కన్న కొడుకును విచక్షణారహితంగా కొట్టినందుకు ప్రవాస భారతీయుడొకరికి బ్రిటన్ కోర్టు 16 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధించింది. దక్షిణ యార్క్‌షైర్‌లోని బమ్స్లే ప్రాంతంలో ఉంటున్న అజిత్ శేఖన్ గతేడాది అక్టోబర్‌లో తన భార్య మంజీత్ కౌర్ శేఖన్(55), కుమారుడు పాల్(31)పై దాడికి పాల్పడ్డాడు. టీవీ చూస్తున్నారనే కోపంతో లోహపు పాత్రతో వీరిపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో అజిత్ భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ జరిపిన కోర్టు అజిత్‌ను దోషిగా తేల్చింది. కొడుకును కొట్టినందుకు 9 ఏళ్ల నెలలు, భార్యను గాయపరిచినందుకు 6 ఏళ్ల 9 నెలల జైలు శిక్ష విధించింది. ఈనెల 9న షిఫీల్డ్ క్రౌన్ కోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది.