nri supports
-
వైఎస్సార్ 14వ వర్థంతి: న్యూజిలాండ్‌లో రక్తదాన శిబిరం
సెప్టెంబర్ 2, రోజులానే తెల్లారింది ఎవరి పనుల్లో వాళ్ళు నిమిత్తం అయ్యి ఉన్నారు. కొద్దిసేపటికే వైయస్సార్ గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయ్యిందని వార్తలు. జనాల్లో ఆందోళన ఎక్కడో ఒక చోట వాతావరణం అనుకూలించక ల్యాండ్ అయ్యి ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి గారికి ఏమి కాదు ఇంత మంది జనహృదయాల్లో నిలిచిన రాజశేఖర్ రెడ్డికి ఏమి కాదన్న భరోసా ఒకవైపు. నల్లమల కొండల్లో వెతుకులాట కోసం వేలాది జనాలు మంది వెళ్లారు. చివరికి నేవి హెలికాప్టర్ల గాలింపులో సెప్టెంబర్ 3న ఆచూకీ తెల్సింది కానీ.. అభిమానుల గుండె పగిలింది. చరిత్రలో సెప్టెంబర్ 2, 3 అలా చెరగని గుర్తు వేశాయి. పెద్దాయన అంత్యక్రియలకు దారులన్ని మూసుకుపోయాయి. అభిమానం పోటెత్తింది. కడసారి చూపు కోసం రోదించింది. గొంతు మూగబోయింది, మాకు దిక్కెవరని కన్నీరు పెట్టనివారు లేరు. అందుకే దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారు.. ఆయన్ను స్మరించుకుంటూనే ఉంటారు. ఆ మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం నివాళులు అర్పించింది. శనివారం సెప్టెంబర్ 2వ తేదీన ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు బుజ్జిబాబు(కన్వీనర్), ఆనంద్ ఎద్దుల(రీజినల్ కో ఆర్డినేటర్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం న్యూజిలాండ్‌లో ఆక్లాండ్‌లోని వెస్టీ కమ్యూనిటీ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్ ఎద్దుల, సుస్మిత చిన్నమల్రెడ్డి, సమంత్ డేగపూడి, ప్రభాకర్ వాసిపల్లి, విజయ్ అల్లా, పవన్ రెడ్డిచెర్ల, ప్రణవ్ అన్నమరాజు, ఆరోన్ శామ్యూల్ తదితర ఎన్నారైలు రక్తదానం చేశారు. న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం సభ్యుల కృషిని ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ బాబు, శ్రీకాహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, ఏపీ ఎన్నారై సొసైటీ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి, తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి, ఏపీ ప్రెస్ అకాడమీ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు అలీ తదితరులంతా అభినందించారు. ఒక మనిషి మరణం ఎంతో మందిని చీకట్లోకి నెట్టివేసింది. బహుశా ఇవాళ్టికి కూడా చాలా మంది ఆయన గురించి ఆలోచిస్తున్నారంటే అది ఆయన చేసిన పరిపాలన, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం. డబ్బు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం అని చేతల్లో నిరూపించిన నాయకుడు వైఎస్సార్. ఇంకో 100 ఏళ్ళు అయిన రాజశేఖర్ రెడ్డి మాత్రం మరువలేరేమో. (చదవండి: ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్ ఎన్నారైల భావోద్వేగం) -
జ్ఞానసాయికి అండగా మేముంటాం!
జ్ఞానసాయికి వైద్యం చేయించడానికి ముందుకు వచ్చిన ప్రవాస భారతీయులు రూ.5 లక్షల మేర ఆర్థిక సహాయం కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే, సీఐ ములకలచెరువు: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జ్ఞానసాయికి వైద్యం చేయించడానికి అండగా మేముంటామంటూ గల్ఫ్‌దేశాల్లో స్థిరపడిన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పలువురు ప్రవాస భారతీయులు ముందుకు వచ్చారు. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, దుబాయ్, అబుదాబీ, అలాగే లండన్ లో స్థిరపడిన ప్రవాస భారతీయులు పత్రికల్లో, టీవీల్లో ప్రసారమైన కథనాలకు భారీగా స్పందించారు. బాధితులతో నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించి చిన్నారి తల్లి జే.సరస్వతి బ్యాంకు ఖాతాలో రూ.5,01,800 వరకు జమ చేశారు. చిన్నారి వైద్యం కోసం సహాయం చేసిన దాతలకు చిన్నారి కుటుంబ సభ్యులు పేరు పేరున చేతులెత్తి దండం పెట్టారు. శనివారం చిన్నారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించుకుని స్వగ్రామమైన ములకలచెరువు మండలం బత్తలాపురానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆర్థిక సహాయం చిన్నారితో కుటుంబసభ్యులు స్వ గ్రామానికి చేరుకు న్నారని తెలుకున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్, సీఐ రుషికేశవ్, ఎంపీడీవో రాజగోపాల్, తహశీల్దార్ అమరేంద్రబాబు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మీ వెంట మేము ఉంటామని, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బాధితులకు రూ. 25 వేలు, కేవీ.రమణ రూ. 5 వేలు, ఎంపీటీసీ సభ్యురాలు మంజుల రూ.2,500 బాధితురాలి కుటుంబ సభ్యులకు అందించారు. దాతల సహాయం, ప్రజాప్రతినిధుల పరామర్శతో చిన్నారి ప్రాణానికి కొండంత అండ దొరికిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. రేపు చెన్నైలో చిన్నారికి వైద్య పరీక్షలు చిన్నారి వైద్యానికి ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయం విదితమే. సోమవారం చిన్నారికి ఆపరేషన్ కోసం వైద్య పరీక్షలతో చికిత్స మొదలు పెట్టనున్నారు. చిన్నారి వైద్యానికి రూ. 25 లక్షల మేర ఖర్చు అవుతుందని పత్రికలో కథనాలు వెలువడ్డాయి. కథనాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులుకు చిన్నారి కోలుకునే వరకు వైద్యం చేయించాలని ఆదేశించారు. ఇందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హెల్త్ కార్యదర్శి ఎంఎన్వీ ప్రసాద్ (ఐఏఎస్) అధికారిని చిన్నారి వైద్యం కోసం నియమించారు. ఈయన పర్యవేక్షణలో చిన్నారికి వైద్యసేవలు అందించనున్నట్లు సమాచారం. శుక్రవారం హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో చిన్నారికి అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ కోసం తమిళనాడు రాష్ట్రం చెన్నై గ్లోబల్ హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి కాలేయ మార్పిడి చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.