NSE board
-
చిత్రా రామకృష్ణ విచారణకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: కో–లొకేషన్ స్కామ్ కేసులో మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ, సీఈవో) చిత్రా రామకృష్ణను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు వీలుకల్పిస్తూ ప్రముఖ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఎన్ఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీన ఈ మేరకు బోర్డ్ ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎక్సే్ఛంజ్ ఆదాయ అంశాలను కూడా బోర్డ్ ఈ సందర్భంగా ఆమోదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గత ఏడాది మార్చి 6వ తేదీన చిత్రా రామకృష్ణ అరెస్టయ్యారు. అటు తర్వాత ఆమెను విచారించేందుకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) బోర్డు ఆమోదం కోసం సీబీఐ వేచి చూస్తోంది. నిజానికి ఈ కేసులో 2018 మేలో సీబీఐ ఎఫ్ఐఆర్ను నమోదుచేసింది. అనంతరం దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె అరెస్టయ్యారు. స్కామ్ ఏమిటి? మార్కెట్ ఎక్సే్ఛంజీల కంప్యూటర్ సర్వర్ల నుంచి కొందరు స్టాక్ బ్రోకర్లకు చట్ట విరుద్ధంగా కీలక ముందస్తు సమాచారం లభించేలా చిత్రా రామకృష్ణ అవకతవకలకు పాల్పడ్డారన్న ప్రధాన ఆరోపణపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఎక్సే్ఛంజ్ ప్రాంగణంలో ఆయా స్టాక్ బ్రోకర్లు తమ సర్వర్లు, సిస్టమ్స్ లోకేట్ చేయడానికి, నిర్దిష్ట రాక్లను రెంట్‌కు తీసుకోడానికి అనుమతించారన్నది క్లుప్తంగా కో–లొకేషన్ స్కామ్ ప్రధానాంశం. ఈ కో– లెకేషన్ స్కామ్ ద్వారా కొంతమంది బ్రోకర్లు అధిక ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌లో ప్రిఫరెన్షియల్ యాక్సెస్‌ను పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణ 2009లో ఎన్ఎస్ఈ జాయింట్ మనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2013 మార్చి 31 వరకు ఆ స్థానంలో కొనసాగారు. 2013 ఏప్రిల్ 1న ఆమె ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు. ఎన్ఎస్ఈలో ఆమె పదవీకాలం డిసెంబర్ 2016లో ముగిసింది. కో–లొకేషన్ కుంభకోణం వ్యవహారంలో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ 2019లో ఏప్రిల్ చిత్రారామకృష్ణ అలాగే ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా పనిచేసిన రవి నారాయణ్‌లను లిస్టెడ్ కంపెనీ లేదా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్తో లేదా మరే ఇతర మార్కెట్ ఇంటర్మీడియేటరీతో సంబంధం లేకుండా ఐదేళ్ల పాటు నిషేధించింది. నిర్ణీత వ్యవధిలో తీసుకున్న జీతాల్లో 25 శాతాన్ని డిపాజిట్ చేయాలని కూడా వారిని ఆదేశించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రామకృష్ణ, నారాయణ్‌లపై మార్కెట్ రెగ్యులేటర్ జారీ చేసిన ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. సుప్రీంకోర్టులో మాజీ సీఈఓకు ఊరట ఢిల్లీ హైకోర్టు బెయిల్‌పై జోక్యానికి నో... ఇదిలావుండగా, చిత్రరామకృష్ణకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ కేసులో చిత్రారామకృష్ణకు ఢిల్లీ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ, సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిని విచారించిన జస్టిస్ అజయ్ రస్తోగీ, బేల ఎం త్రివేదిలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ అప్పీల్‌ను తిరస్కరిస్తూ, అరెస్టయిన 60 రోజుల్లో రావాల్సిన బెయిల్‌కు సంబంధించి మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. విచారణను ఈ బెయిల్ ప్రభావితం చేయబోదని తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 24న ఈ కేసులో అరెస్టయిన ఎక్సే్ఛంజ్ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (జీఓఓ) ఆనంద్ సుబ్రమణియన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, కో–లొకేషన్ కేసుకు సంబంధించి అక్రమ ధనార్జన (మనీలాండరింగ్) ఆరోపణలపై గత ఏడాది జూలై 14న చిత్రా రామకృష్ణఅను అరెస్ట్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చూపించింది. ఈ కేసులో కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 9 ఢిల్లీ హైకోర్టు చిత్రా రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఎస్ఈ ఉద్యోగుల అక్రమ ఫోన్ ట్యాపింగ్, రహస్య సమాచార సేకరణ వంటి ఆరోపణలు కూడా ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఉన్నాయి. -
చిత్ర రామకృష్ణకు సెబీ భారీ షాక్!
సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)కీ, ఎన్ఎస్ఈ మాజీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చిత్ర రామకృష్ణకు భారీ షాకిచ్చింది. ఎన్ఎస్ఈలో జరిగిన అవకతవకలపై కేసు దర్యాప్తు జరుగుతుండగా..సెబీ ఆమెకు ఫైన్ విధించింది. ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ రోజు రోజుకి మరింత కష్టాల్లో చిక్కుకుంటున్నారు. ఎన్ఎస్ఈలో సీఈవోగా విధులు నిర్వహించే సమయంలో అవకతవకలకు పాల్పడినట్లు పలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి అమెపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో సెబీ..ఎన్‌ఎస్‌ఈకీ రూ.7 కోట్లు, చిత్ర రామకృష్ణ రూ5కోట్లు, ఆనంద్ సుబ్రమణియన్‌కు రూ.5కోట్లు, వే 2 హెల్త్ బ్రోకర్‌కు రూ.6కోట్లు ఫైన్ విధించింది. అంతా యోగి మహిమ చిత్రా రామకృష్ణ ఎన్ఎస్ఈలో సీఈవోగా విధులు నిర్వహించే సమయంలో ఆమె ఓ హిమాలయ యోగి ఆదేశాల మేరకు పనిచేశారని, కీలక సమాచారాన్ని లీక్ చేశారని,అనర్హులకు పదవులిచ్చారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. చదవండి👉 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!! -
చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!
ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ రోజు రోజుకి మరింత కష్టాల్లో చిక్కుకుంటున్నారు. మరోసారి చిత్రా రామకృష్ణ నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే ఆదాయపన్ను, సెబీ సంస్థల విచారణలో చిత్రా రామకృష్ణ ఉన్నారు. ఆమె ఎన్ఎస్ఈ మాజీ సీఈఓగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీనికి తోడు అజ్ఞాత యోగితో చిత్ర జరిపిన ఈ-మెయిల్ సంభాషణలు తాజాగా బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు, ఎవరు ఈమె?, చిత్రా రామకృష్ణపై ఆదాయపన్ను& సెబీ సంస్థలు ఎందుకు విచారణ చేపడుతున్నాయి? అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం. చిత్ర రామకృష్ణ ఎవరు? చార్టెడ్ అకౌంటెంట్‌గా జీవితం ప్రారంభించిన చిత్రా రామకృష్ణ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఐడీబీఐ బ్యాంకుకు చెందిన ప్రాజెక్ట్ ఫైనాన్స్ డివిజన్లో చేరారు. చిత్ర రామకృష్ణ కాలక్రమేణా ఒక్కో మెట్టు ఎక్కుతూ 2009లో ఎన్ఎస్ఈకి మేనేజింగ్ డైరెక్టర్(ఎండి)గా నియామకం కావడం జరిగింది. ఆ తర్వాత 2013లో ఎన్ఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఈఓ) పదివి చేపట్టి 2016 వరకు కొనసాగారు. చిత్ర రామకృష్ణ కెరీర్ హర్షద్ మెహతా కుంభకోణం తర్వాత ఓ పారదర్శక ట్రేడింగ్ మార్కెట్ నిర్వహించాలని కేంద్రం భావించింది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) ఏర్పాటు చేసింది. అందులో ఈమె కీలక సభ్యురాలిగా కొనసాగారు. అక్కడి నుంచి సీఐఐ నేషనల్ కౌన్సిల్ ఆన్ ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్ మెంట్, ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, క్యాపిటల్ మార్కెట్స్ కమిటీ వంటి ఇండస్ట్రీ బాడీ కమిటీల్లో కూడా రామకృష్ణ పని చేశారు. ఆ తర్వాత ఆమె 2009లో ఎన్ఎస్ఈ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్'గా నియమితులయ్యారు. 2013లో ఆమె సీఈఓగా పదోన్నతి పొందింది. 2016లో అనూహ్యంగా ఎన్ఎస్ఈ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. బోర్డు సభ్యులతో అభిప్రాయ భేదాల కారణంగానే తన పదివికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్ర రామకృష్ణ పతనం 2016లో అనూహ్యంగా ఎన్ఎస్ఈ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవికి తొలగిన తర్వాత ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. చిత్ర గత 20 సంవత్సరాలుగా వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలలో హిమాలయాల్లో నివసిస్తున్న ఒక 'యోగి' తనకు మార్గనిర్దేశం చేసినట్లు చెప్పారు. అజ్ఞాత యోగితో చిత్ర జరిపిన ఈ- మెయిల్ సంభాషణలు సెబీ దర్యాప్తులో బయటకు వచ్చాయి. అలాగే, ఆనంద్ సుబ్రమణియన్'ను ప్రధాన వ్యూహాత్మక సలహాదారుగా నియమించడంలోను ఆమెపై ఆరోపణలు వచ్చాయి. హిమాలయన్ 'యోగి' చెప్పినందుకే అతనిని నియమించుకున్నట్లు సీబిఐ దర్యాప్తులో తేలింది. పాలనపరమైన విషయంలో కూడా రామకృష్ణ, బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ విషయం వెల్లడైంది. దర్యాప్తులో రామకృష్ణ హిమాలయన్ 'యోగి' గురించి చెబుతూ తనకు రూపం లేదని, తను ఒక ఆధ్యాత్మిక శక్తిగా చెప్పినట్లు సెబీ పేర్కొంది. పాలనా లోపాల విషయంలో సెబీ రామకృష్ణపై రూ.3 కోట్లు, ఎన్ఎస్ఈ మాజీ ఎండి సుబ్రమణియన్, సీఈఓ రవి నరైన్ లపై ఒక్కొక్కరికి రూ.2 కోట్లు, చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్, కాంప్లయన్స్ ఆఫీసర్'గా ఉన్న వి.ఆర్.నరసింహన్ కు రూ.6 లక్షలు జరిమానా విధించింది. ఇంకా, రామకృష్ణ & సుబ్రమణియన్లను ఏ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో లేదా సెబీతో రిజిస్టర్ చేసుకున్న సంస్థతో కలిసి పనిచేయకుండా 3 సంవత్సరాల పాటు నిషేదించింది. అలాగే, నరైన్ కు కూడా 2 సంవత్సరాలు నిషేదించింది. అయితే, సెబీ దర్యాప్తులో హిమాలయన్ 'యోగి' ఒక వ్యక్తి అని తేలింది. మరి అతను ఎవరు అనేది ఆనంద్ సుబ్రమణియన్'కు తెలిసి ఉంటుంది అని భావిస్తుంది. (చదవండి: వీరేంద్ర సెహ్వాగ్, భువనేశ్వర్ కుమార్ భాటలో ఆరోన్ ఫించ్..!) -
లాభాలని మొత్తుకుంటే సరిపోయిందా? మరి నష్టపోయినోళ్ల సంగతేంటి?
బాంబే స్టాక్ ఎక్సేంజీ, నేషనల్ స్టాక్ ఎక్సేంజీల్లోకి పెట్టుబడుల వరద వస్తోందని, ఇన్వెస్టర్ల జేబుల్లో కనక వర్షం కురుస్తుందంటూ ఇటీవల వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. దేశీ సూచీల బుల్ జోరు రేపుతున్న దుమ్ములో బ్రోకరేజీ సంస్థల ఆగడాలు, వాటి వల్ల నష్టపోతున్న ఇన్వెస్టర్ల సంగతులు బయటకు రావడం లేదు. దీనిపై స్టాక్‌మార్కెట్ విజిల్ బ్లోయర్ సుచేతా దలాల్ తొలిసారిగా గళమెత్తారు. నాణేనికి మరోవైపు అంతర్జాతీయ వ్యవహరాలు, దేశీయంగా నెలకొన్న పరిస్థితులతో సంబంధం లేకుండా స్టాక్‌మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఒక సెషన్‌ని మించి మరో సెషన్లో బుల్‌జోరు కొనసాగుతోంది. వారాల వ్యవధిలోనే వేల పాయింట్లు దాటేస్తున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపయితే మరోవైపు ఇన్వెస్టర్ల నగదుకి మార్కెట్లో గ్యారెంటీ లేకుండా పోతోంది. నమ్మిన వాళ్లను నట్టేట ముంచుతున్నాయి కొన్ని స్టాక్‌మార్కెట్ బ్రోకరేజీ సంస్థలు. మోసాలు.. నిషేధాలు ఇటీవల ఇన్వెస్టర్లకు నగదు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం, స్టాక్ మార్కెట్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న బ్రోకరేజీ సంస్థలపై ఇటు బీఎస్ఈ, అటు ఎన్ఎస్ఈలు కొరడా ఝులిపిస్తున్నాయి. రెండు నెలల కాలంలోనే ఏకంగా 30కి పైగా బ్రోకరేజీ సంస్థలను నిషేధించాయి. తాజాగా ఫస్ట్ ఫ్యూచర్స్ అండ్స్ స్టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిషేధిస్తూ ఎన్ఎస్ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని ఉదహరిస్తూ సుచేతా స్టాక్ మార్కెట్లను ప్రశ్నించారు. వాళ్ల సంగతేంటి ? స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్టాలను టచ్ చేస్తున్నాయి. బుల్ జోరు కొనసాగుతోంది. కొత్తగా డీమ్యాట్ అకౌంట్లు తెరుస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది అనే విధంగా ప్రచారం జరుగుతుంది తప్పితే. బ్రోకరేజీ సంస్థలు మోసాలకు పాల్పడిన సమయంలో ఇన్వెస్టర్లకు ఏ తరహా సాయం అందుతుంది. వారు నష్టపోకుండా ఏం చేస్తున్నారు అనే విషయంపై స్టాక్ ఎక్సేంజీలు ఎందుకు చొరవ చూపించడం లేదు అన్నట్టుగా ఆమె ప్రశ్నించారు. మోసాలకు పాల్పడిన వారిని నిషేధిస్తే సరిపోతుందా ? నష్టపోయిన వారి సంగతేంటంటూ నిలదీస్తూ ట్వీట్ చేశారు. కంటి తుడుపు సాయం ఎన్ఎస్ఈ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్లో ఫస్ట్ ఫ్యూచర్ అండ్స్ స్టాక్స్ ప్రైవేట్ లిమిడెట్ బ్రోకరేజీ సంస్థ వల్ల నష్టపోయిన వారికి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ కింద రూ. 25 లక్షల వంతున పరిహారం అందిస్తామని ప్రకటించింది. అయితే దీనిపై ఇన్వెస్టర్ల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. కోట్ల రూపాయలు నష్టపోతే కేవలం రూ. 25 లక్షలు చెల్లించి చేతులు దులుపుకోవడం సరికాదంటూ చెబుతున్నారు. దీనికి ఉదాహారణగా కేవలం ఆరుగురు ఇన్వెస్టర్లకే ఈ బ్రోకరేజీ వల్ల రూ. 6 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇలాంటి వారు ఎందరో ఉన్నారని చెబుతున్నారు. This must be 30 brokers expelled in past 2 years. #SEBI Coll with it! Probably thinks @NSEIndia is purging system! No talk of investors. Maybe NSE should celebrate these numbers like it celebrates NIFTY highs? Or turnover? @FinMinIndia @nsitharaman ?? pic.twitter.com/7lcUo9fqcw — Sucheta Dalal (@suchetadalal) October 19, 2021 ఎవరీ సుచేతా దలాల్ ఇక స్టాక్‌మార్కెట్ విజిల్ బ్లోయర్ సుచేతా దలాల్ విషయానికి వస్తే... 1992లో హర్షద్ మెహతా స్కామ్‌ని తొలిసారిగా వెలుగులోకి తెచ్చిన బిజినెస్ జర్నలిస్ట్‌గా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. స్టాక్‌మార్కెట్ వ్యవహరాలు, అక్కడ జరుగుతున్న అవకతవకలపై ఆమె తరచుగా స్పందిస్తూ ఇన్వెస్టర్లను హెచ్చరిస్తుంటారు. తాజాగా బ్రోకరేజీ సంస్థల వల్ల ఇన్వెస్టర్లకు జరుగుతున్న నష్టంపై ఆమె చేసిన ట్వీట్ మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. చదవండి :ఎలన్‌మస్క్ నంబర్ 1 ధనవంతుడయ్యాడంటే కారణమిదే - ఆనంద్ మహీంద్రా -
ఎన్ఎస్ఈ కొత్త బాస్ ఈయనే!
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)కొత్త బాస్ గా ఐడీఎఫ్సీ ఎండీ విక్రం లిమాయే ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో సీఈవో , ఎండీగా ఆ యన్ను ఎన్నుకున్నారు. తుది ఆమోదం కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఎన్ఎస్ఈ ఎజిఎంకు పంపించారు. రూ.10,000 కోట్లు అంచనాతో ఎన్ఎస్ఈ త్వరలో ఐపీవోకు రానున్న తరుణంలో ఈ అపాయింట్మెంట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. అతని ఎంపిక సరైందనీ, అపార అనుభవం వున్న విక్రం నాయకత్వంలో వ్యాపారం మరింత అభివృద్ధి సాధిస్తుందని కెఆర్ చోక్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ దేవేన్ చోక్సీ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆసియాలోనే అతిపురాతనమైన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) బంపర్ లిస్టింగ్ సాధించింది. దీంతో త్వరలోనే ఐపీవోకు రానున్న ఎన్ఎస్ఈ మరింత అద్భుతమైన విజయం సాధిస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా ఇటీవల ఎన్ఎస్ఈ ఛైర్మన్ చిత్రారామకృష్ణన్ ఎన్ఎస్ఇకి గుడ్ బై చెప్పారు. 2018 మార్చి వరకు ఆమె పదవీ సమయం ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఆమె తన పదవి నుంచి నిష్క్రమించారు. అల్గో వ్యాపార వ్యవస్థలో కొంతమంది బ్రోకర్లకు ప్రిఫరెన్షియల్ యాక్సెస్ ఇచ్చినట్టుగా ఎన్ఎస్ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకూ లిస్టింగ్ పొందిన ఎక్స్ఛేంజీలలో ఎన్వైఎస్ఈ, నాస్డాక్, లండన్ స్టాక్ ఎక్స్చేంజీ, హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీ, డాయిష్ బోర్స్ వంటివి ఉన్నాయి.