nstl
-
అలా రాజకీయాల్లోకి వచ్చా: వెంకయ్య నాయుడు
సాక్షి, విశాఖపట్నం : ఎన్ఎస్టీఎల్ అర్ధ శాతాబ్ధి వేడుకలో పాల్గోనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబరేటరీ అర్ధ శతాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఎన్ఎస్టీఎల్ ఎన్నో పరిశోధనలకి కిలకంగా వ్యవహించిందని, చంద్రయాన్ ప్రయోగంలో ఎన్ఎస్టీఎల్ పాత్ర ఉండటం అభినందనీయం అంటూ ప్రశంసించారు. సెప్టెంబర్లో చంద్రుడిపై అడుగుపెట్టబోతుండటం మనకి గర్వకారణం అన్నారు. దేశ ప్రశాంతతకు, రక్షణకు ఎన్ఎస్టీఎల్ పరిశోధనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కితాబిచ్చారు. మన దేశంలో తయారయ్యే రక్షణ పరికరాలను ఇతర దేశాలు కొనుగోలు చేసేలా మన పరిశోధనలు ఉండాలని శాస్త్రవేత్తలకు సూచించారు. అలాగే ఎన్ఎస్టీఎల్ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ముఖ్యమైన తూర్పునావికా దళానికి ఎన్ఎస్టీఎల్ వెన్నుముకగా ఉందని, విశాఖలో ఒకేసారి ప్రారంభమైన తూర్పు నావికా దళం, ఎన్ఎస్టీఎల్లు దేశ రక్షణ రంగంలోఅత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. తాను ఏయూలోనే చదువుకున్నానని, ఎమర్జెన్సీ రోజులలో ఇక్కడే ఉన్నానని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ కాలంలో 17 నెలల పాటు జైలు జీవితం గడిపానని, అదే తనను రాజకీయాల్లోకి వచ్చేలా చేసిందని చెప్పారు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం.. ఇక దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మన దేశం ఎప్పుడూ ఇతర దేశాలపై దాడి చేయలేదని అలాగే మన దేశంపై దాడులు చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పామన్నారు. ఈ ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న వెంకయ్యనాయుడుకు రాష్ట్ర పర్యాటక శాఖ, సంస్కతిక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, తూర్పు నావికాదళం వైఎస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ నందగోపన్తో పాటు, జిల్లా కలేక్టర్ ఉన్నతాదికారులు ఘన స్వాగతం పలికారు. (ఇది చదవండి: ఆనాడు చాలా బాధపడ్డానన్న వెంకయ్య) -
బాణీలకు ప్రాణ గాత్రి
బాలు, సాక్షి, విశాఖపట్నం విశాఖపట్నంలోని ఎన్ఎస్టీఎల్ మానసి ఆడిటోరియం. రామ్నాథ్ సెకండరీ స్కూల్ విద్యార్థులతో సందడిగా ఉంది. ‘వెల్కం టు హిజ్ ఎక్స్లెన్సీ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ అబ్దుల్ కలాం’.. మైకులో ప్రకటన.. ఆ వెంటనే ‘నేనొక భారత యువ పౌరుడిని’ అంటూ విద్యార్థినుల బృంద గానం మొదలైంది. కలాం ఆంగ్ల కవిత ‘యాజ్ ఎ యంగ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్మ్డ్ విత్ టెక్నాలజీ’కి తెలుగు అనువాదమిది. హిందోళ రాగంలో రెండున్నర నిమిషాల పాటు సాగిన గానం ముగిసింది. చప్పట్లతో ఆడిటోరియం మారుమోగింది. విద్యార్థినుల్ని కలాం మనసారా దీవించారు. వారి గళాల్లో తేనెలూరిస్తున్న సంగీత ఉపాధ్యాయినిని హృదయపూర్వకంగా అభినందించారు. కలాం కవితకు అద్భుతమైన బాణీ కట్టి ప్రశంసలందుకున్న ఆమె పేరు పాలంకి సరస్వతి. ఇరవయ్యేళ్లుగా సంగీత యజ్ఞం పాలంకి సరస్వతి విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో పీవీ శేషయ్య శాస్త్రి శిక్షణలో సంగీత పాండిత్యానికి తుది మెరుగులు దిద్దుకున్నారు. ఎన్ఎస్టీఎల్ రామ్నాథ్ సెకండరీ స్కూల్లో ఇరవయ్యేళ్లుగా ఎందరో విద్యార్థులను గాత్రంలో తీర్చిదిద్దుతున్నారు. ఆకాశవాణి కళాకారిణిగా తన గాన మాధుర్యంతో శ్రోతలను సమ్మోహనపరుస్తున్నారు. అమెరికాలోని మసాచుసెట్ నగరంలో డబ్ల్యుఎంఎల్ 95.1 ఆన్లైన్ ఎఫ్ఎం రేడియో చానల్లో కూడా ఆమె గానం చేసిన భక్తి గీతాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. దేశభక్తితో ‘స్వరా’ర్చన సాధారణంగా సీబీఎస్ఈ పాఠశాలల విద్యార్థులకు దేశభక్తి గీతాల్లో శిక్షణ ఇప్పిస్తారు. సరస్వతి తొలిసారిగా దేశభక్తి గీతాలకు స్వరాలను జతపరిచి పాడించి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. కర్ణాటక సంగీతంలో బేసిక్స్.. అంటే సరళీ స్వరాలు, జంట స్వరాలు నేర్పేవారు. ఏ గీతాన్నయినా ఆమె విభిన్నంగా బాణీ కట్టడమే పిల్లల విజయానికి కారణం. పురస్కారాలెన్నో పియర్సన్ టీచింగ్ అవార్డ్స్-2013కు దేశవ్యాప్తంగా అందిన 26 వేల ఎంట్రీల్లో సంగీతం కేటగిరీలో టాప్ఫైవ్లో మొదటి స్థానంలో పాలంకి సరస్వతి నిలిచారు. స్వర కళామణి, గాన కళారత్న, ఉమెన్ ఆఫ్ ఎక్స్లెన్సీ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు.