ntr health versity
-
ఎంబీబీఎస్ సీట్ల అవతవకలపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : ఎన్సీసీ కోటా ఎంబీబీఎస్ మెడికల్ సీట్ల కేటాయింపులో చోటుచేసుకున్న అవకతవకలపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. మొదటి మెరిట్ లిస్టులో ఉన్న వారిని తప్పించి... రెండో లిస్టులో ఉన్న కొత్తవారికి 2ఎఫ్ కేటగిరీలో అవకాశం కల్పించారని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు కాళోజీ, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ విద్యార్థులను ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
రైఫిల్ షూటింగ్లో జాతీయస్థాయి పోటీలకు నిమ్స్ విద్యార్థి
ఇబ్రహీంపట్నం: నిమ్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న ఎన్.తేజవర్థననాయుడు రైఫిల్ అండ్ ఫిస్టల్ షూటింగ్లో జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన అంతర్ వైద్య కళాశాలల రైఫిల్ షూటింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ యూనివర్సిటీలో జరిగే అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు ఎంపికయ్యాడు. కళాశాల కరస్పాండెంట్, సెక్రటరీ డాక్టర్ మహ్మద్ సాఖీబ్ రసూల్‌ఖాన్, డీన్ డాక్టర్ సుందరరావు, క్రీడాధికారి ఎం.ఎస్.ఖాన్ తేజవర్థన్ నాయుడును అభినందించారు. -
ఎన్టీఆర్ హెల్త్వర్శిటీలో ఉద్రిక్తత
-
యాజమాన్య కోటా సీట్లకు ఆన్లైన్ ఎంట్రన్స్
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సన్నద్ధం విజయవాడ: ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 35 శాతం యాజమాన్య కోటా (బి-కేటగిరీ) సీట్ల భర్తీకి ప్రత్యేకంగా ‘అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ నిర్వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సన్నద్ధమవుతోంది. ఈ సీట్లకుప్రత్యేకంగాప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆన్లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నట్టు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. ఇప్పటివరకు అందుబాటులోని సీట్ల ప్రకారం తెలంగాణ, ఏపీలలో కలిపి 1,242 (ఏయూ పరిధిలో 420, ఎస్వీయూ పరిధిలో 227, ఓయూ పరి దిలో 595) సీట్లకే అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంది.