
సాక్షి, హైదరాబాద్ : ఎన్‌సీసీ కోటా ఎంబీబీఎస్ మెడికల్ సీట్ల కేటాయింపులో చోటుచేసుకున్న అవకతవకలపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. మొదటి మెరిట్ లిస్టులో ఉన్న వారిని తప్పించి... రెండో లిస్టులో ఉన్న కొత్తవారికి 2ఎఫ్ కేటగిరీలో అవకాశం కల్పించారని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు కాళోజీ, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ విద్యార్థులను ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment