ntr literary award
-
సంగీతం, సాహిత్యం పూర్వజన్మ సుకృతం
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు - ప్రముఖ గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి ఎన్టీఆర్ సాహితీ పురస్కారం హైదరాబాద్: సాహిత్యం లేనిదే సంగీతం లేదని, ఈ రెండూ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు చెప్పారు. పూర్వజన్మ సుకృతంవల్లే సాహిత్యం, సంగీతం అబ్బుతాయన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో ప్రఖ్యాత గుజరాతీ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ రఘువీర్‌చౌదరికి ఎన్టీఆర్ జాతీయ సాహితీ అవార్డును ప్రదానం చేశారు. ఎన్టీరామారావు జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహించిన ఈ ప్రదానోత్సవంలో జస్టిస్ శివశంకరరావు మాట్లాడుతూ... దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యాన్ని మనం గుర్తించలేకపోతున్నామని, వాటిని విదేశీయులు దోచుకొంటున్నారని అన్నారు. పౌరాణిక, జానపద చిత్రాలతో ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి మహానటులు మన సంస్కృతికి పెద్దపీట వేశారన్నారు. బిహార్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మాట్లాడుతూ... తెలుగు జాతి పట్ల భక్తిభావం, గౌరవం పెరగాలంటే ఎన్టీఆర్ చిత్రాలు చూడాలన్నారు. నేడు సమాజంలో విలువలు ఉన్నాయంటే ఎన్టీఆర్ చిత్రాలే కారణమన్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ... తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ‘సాక్షి’ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ... నిస్వార్థం, చిత్తశుద్ధితో సామాన్యుల బాగోగులు తెలుసుకున్న రాజకీయ నాయకులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనన్నారు. 21 ఏళ్లుగా సాహితీ కార్యక్రమాల్ని సంకల్పం, ఆత్మవిశ్వాసంతో నిర్వహిస్తూ, ప్రతిభావంతులకు అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉందని ఎన్టీఆర్ ట్రస్టు చైర్పర్సన్ లక్ష్మీపార్వతి చెప్పారు. నటి గీతాంజలి, అవార్డు కమిటీ సభ్యులు ఓల్గా, సి.మృణాళిని, మాణిక్యాంబ పాల్గొన్నారు. ఈ అవార్డు ప్రత్యేకం: రఘువీర్‌చౌదరి ఎన్ని అవార్డులు వచ్చినా... ఎన్టీఆర్ సాహితీ పురస్కారాన్ని అందుకోవడం ప్రత్యేకమని, ఆనం దంగా ఉందని అవార్డు గ్రహీత రఘువీర్‌చౌదరి చెప్పారు. సినిమాలు, రాజకీయాల్లో సామాన్య ప్రజలకు దగ్గరగా ఉన్నది ఎన్టీఆర్ ఒక్కరేనన్నారు. -
రఘువీర్ చౌదరికి ఎన్టీఆర్ సాహితీ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సాహితీ వేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రఘువీర్ చౌదరిని ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఎన్టీ ఆర్ విజ్ఞాన ట్రస్ట్ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి, జ్యూరీ కమిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి ప్రకటించారు. శని వారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోట ల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా ప్రదానం చేసే ఈ అవార్డును రఘువీర్‌కు ఇవ్వనున్నట్లు తెలి పారు. మహానటుడు, భారత సినీ ప్రపంచం లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానం నిలుపు కొన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గొప్ప సాహితీవేత్త కూడా అని చెప్పారు. 2006లో జ్వాలాముఖి ప్రోత్సాహంతో జాతీ య స్థాయిలో సాహితీ అవార్డును దేశంలోని ముఖ్యమైన సాహితీ వేత్తలకు ఇవ్వాలని నిర్ణ యించామన్నారు. 2007 నుంచి పురస్కార ప్రదానం 2007 నుంచి ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ఆధ్వర్యం లో ఈ సాహితీ పురస్కారం ప్రదానం చేయ డం ప్రారంభించామన్నారు. ఈ అవార్డును 2007లో కన్నడ భాషకి చెందిన సాహితీవేత్తకు ఇచ్చామన్నారు. ఏటా ఈ అవార్డు ఒక్కొక్క భాషకు చెందిన వారికి అందజేస్తూ వచ్చామని తెలిపారు. ఈసారి 2017లో అవార్డుకు ముగ్గు్గరి పేర్లు పరిశీలనకు రాగా జ్యూరీ కమిటీ గుజ రాత్‌కు చెందిన సుప్రసిద్ధ సాహితీ వేత్త, జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకా డమీ అవార్డు గ్రహీత రఘువీర్ చౌదరిని ఎంపిక చేసిందన్నారు. ఈయన ఈ అవార్డు అందుకొంటున్న 11వ వ్యక్తి అని తెలిపారు. ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న రవీంద్ర భారతిలో ఈ అవార్డు ప్రదా నోత్సవం నిర్వహి స్తున్నట్లు చెప్పారు. అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా మహా రాష్ట్ర గవర్నర్ సీహె చ్ విద్యాసాగర్ రావు, విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ ఎల్ నర్సింహా రెడ్డి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌లను ఆహ్వా నించా మన్నారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ కమిటీ సభ్యులు డాక్టర్ ఓల్గా, డాక్టర్ మృణాళిని, డాక్టర్ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.